ఇటీవల ఇండియాలో చాలా సరికొత్త స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. వీటిలో బడ్జెట్ ధర మొదలుకొని ప్రీమియం సెగ్మెంట్ వరకూ చాలా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మరి ఇండియాలో సరికొత్తగా విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందామా.
మోటోరోలా నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ ఫ్లిప్ ఫోన్ ఇండియాలో రూ. 59,999 ధరలో మరియు మంచి లాంచ్ ఆఫర్లతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన 10-bit డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 7 Gen 1 ప్రోసెసర్ మరియు మరిన్ని ఫీచర్లతో వచ్చింది.
మోటోరోలా నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ ప్రీమియం ఫ్లిప్ ఫోన్ రూ. 89,999 ధరలో మరియు భారీ లాంచ్ డిస్కౌంట్ ఆఫర్లతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన 10-bit మెయిన్ డిస్ప్లే మరియు 3.6 ఇంచ్ సెకండరీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 ప్రోసెసర్, భారీ కెమేరా సెట్టింగ్ వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది. జూలై 15 మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.
ఈ ఫోన్ ను రీసెంట్ గా ఐకూ ఇండియాలో రూ. 34,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 ప్రోసెసర్, 120W ఫ్లాష్ ఛార్జ్, 120Hz రిఫ్రెష్ రేట్ 10bit డిస్ప్లే, 50MP OIS ట్రిపుల్ కెమేరా మరియు ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ సెట్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి వుంది.
రియల్ మి నార్జో సిరీస్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ ఫోన్ సన్నని మరియు ఆకర్షణీయమైన డిజైన్, 90Hz AMOLED డిస్ప్లే, Dimensity 6020 ప్రోసెసర్, 64MP ట్రిపుల్ రియర్ కెమేరా వంటి మరిన్ని ఇతర ఫీచర్లతో రూ. 17,999 రూపాయల ప్రారంభ ధరలో వచ్చింది.
రియల్ మి నార్జో 60 సిరీస్ లో నుండి ప్రీమియం ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz OLED Curved డిస్ప్లే, 100 MP OIS ట్రిపుల్ కెమేరా, ప్రీమియం లెథర్ డిజైన్, Dimensity 7050 ప్రోసెసర్, 24GB వరకూ డైనమిక్ ర్యామ్ మరియు హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది.
Samsung యొక్క Galaxy M సిరీస్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ రూ. 18,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ Exynos 1280 చిప్ సెట్, 50MP No Shake కెమేరా, 6000mAH హెవీ బ్యాటరీ, బిగ్ సూపర్ AMOLED డిస్ప్లే మరియు 4 OS Upgrade వంటి ఆకట్టుకునే ఫీచర్ల ను కలిగి వుంది.
వన్ ప్లస్ యొక్క నార్డ్ సిరీస్ నుండి సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ రూ. 33,999 ప్రారంభ ధరతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ Dimesity 9000 చిప్ సెట్, LPDDR5X ర్యామ్, 80W సూపర్ ఊక్ ఛార్జ్, 120Hz సూపర్ Fluid డిస్ప్లే మరియు 50MP SonyIMX890 కెమేరా వంటి భారీ ఫీచర్లతో వచ్చింది.
ఈ టెక్నో ఫోన్ ఇప్పుడు వచ్చింది మరియు దీని ప్రారంభ ధర రూ. 29,999 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ Dimensity 8050 చిప్ సెట్, 108MP అల్ట్రా వైడ్ మ్యాక్రో లెన్స్, ప్రీమియం లెథర్ డిజైన్, సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ మరియు 120Hz 10bit AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగి వుంది.
మోటోరోలా నుండి ఇటీవల వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో 3D Curved డిస్ప్లేతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ Dimensity 8020 చిప్ సెట్, 144Hz 3D Curved డిస్ప్లే, IP68 రేటింగ్, Dolby Atmos స్టీరియో స్పీకర్లు మరియు 68W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో రూ. 29,999 రూపాయల ధరలో లభిస్తుంది.
రియల్ మి గత నెలలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ 120Hz Curved విజన్ డిస్ప్లే, ప్రీమియం వేగన్ లెథర్ డిజైన్, 100MP OIS కెమేరా, 67W సూపర్ ఊక్ ఛార్జ్ మరియు Dimensity 7050 చిప్ సెట్ వంటి ఫీచర్లతో రూ. 23,999 ప్రారంభ ధరలో వచ్చింది.
ఈ ఫోన్ కూడా గత నెలలో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ భారీ 200MP OIS కెమేరా, 100W సూపర్ ఊక్ ఛార్జ్, 120Hz Curved విజన్ డిస్ప్లే మరియుDimensity 7050 ప్రోసెసర్ వంటి ఫీచర్లతో రూ. 27,999 రూపాయల ప్రారంభ ధరలో లాంచ్ అయ్యింది.
ప్రముఖ ఇండియన్ బ్రాండ్ లావా ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 3D డ్యూయల్ కర్వ్డ్ డిజైన్, FHD+ Curved AMOLED డిస్ప్లే, Dimensity 7050 చిప్ సెట్, 50MP క్వాడ్ రియర్ కెమేరా మరియు 66W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ వంటి ప్రత్యేకతలతో రూ. 19,999 ధరతో వచ్చింది.
శామ్సంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ రూ.29,999 రూపాయల ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ 108MP No Shake కెమేరా, 120Hz సూపర్ AMOLED డిస్ప్లే, 6000mAh హెవీ బ్యాటరీ మరియు లేటెస్ట్ Android 13 OS వంటి ఫీచర్లను కలిగి వుంది.
టెక్నో ఇటీవల విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ Tecno Camon 20 Pro 5G. ఈ స్మార్ట్ ఫోన్ 64MP RGBW(G+P) OIS lens, 10బిట్ AMOLED డిస్ప్లే, Dimensity 8050 ప్రోసెసర్ మరియు ప్రీమియం లెథర్ బ్యాక్ డిజైన్ ను కలిగి వుంది. టెక్నో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 19,990 రూపాయల ధరలో అందించింది.
ఇంఫినిక్స్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రూ. 14,999 రూపాయల ప్రారంభ ధరలో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 6080 ప్రోసెసర్, 108 MP డ్యూయల్ AI రియర్ కెమేరా, బిగ్ FHD+ డిస్ప్లే మరియు JBL Hi-Res డ్యూయల్ స్పీకర్లు వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.
iQOO Z7 5G స్థానంలో కొత్తగా వచ్చిన ఈ iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ రూ. 18,999 రూపాయల ధరతో లిస్ట్ చెయ్యబడింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రాసెసర్, FHD+ AMOLED డిస్ప్లే, 44W ఫ్లాష్ ఛార్జ్, 64MP OIS అల్ట్రా స్టేబుల్ కెమేరా, మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లతో వచ్చింది.
మీకు తెలియకుండా మీ ఫోన్ మీ పైనే నిఘా పెడుతుందని డౌటా..ఎలా చెక్ చెయ్యాలో తెలుసుకోవడానికి Click Here
మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకో తెలుసుకోవడానికి Click Here
మీ ఆధార్ ఏ సర్వీస్ లకు ఉపయోగించారో తెలుసుకోవడానికి సింపుల్ పద్దతి తెలుసుకోవాలంటే Click Here