రిలయన్స్ జియో వినియోగదారులకు శుభవార్త. ఇటీవల, జియో తన వినియోగదారులకు VoWiFi ఫీచరును ప్రకటించింది. ఈ ఫీచరుతో Wi Fi ద్వారా అన్లిమిటెడ్ కాలింగ్ ఉచితంగా చేసుకునే వీలును కల్పిస్తోంది. అయితే, ఉచిత కాలింగ్ చేసుకోవడానికి అందరికి వీలుండదు. ఎందుకంటే, దీన్ని ఉపయోగించడానికి, VoWiFi ని ఆన్ చేసి WiFi నెట్ వర్క్ కి కనెక్టయ్యి ఉండాలి. ఈ సేవ భారతదేశంలోని అన్ని జియో చందాదారుల కోసం ఏదైనా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తో ఉపయోగించవచ్చు.
ఈ VoWiFi కాలింగ్ ఉపయోగించడం కోసం, వినియోగదారులకు దీనికి అనుకూలమైన ఫోన్ మరియు స్థిరమైన Wi-Fi కనెక్షన్ అవసరం. ప్రస్తుతం, ఈ VoWiFi సర్వీస్ 150 హ్యాండ్ సెట్లల్లో పనిచేస్తునట్లు జియో తెలిపింది. ఈ ఫోన్ల పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి మరియు మీ వద్ద ఈ ఫోన్ ఉన్నట్లయితే, మీరు ఉచితంగా రోజంతా కాలింగ్ చేసుకోవచ్చు.
వివో ఫోన్ల విషయానికి వస్తే, వివో యొక్క 20 ఫోన్లు జియో యొక్క ఈ ఫ్రీ wifi కాలింగ్ కి అనుకూలిస్తాయి.
అవి : U20, S1 ప్రో, V9, V9 ప్రో, V11, V11 ప్రో, V15, V15 ప్రో, V17, Y91i, Y12,Y15, Y17, Y81,Y81i, Y91, Y91 (1811),Y93, Y95 మరియు వివొ Z1 ప్రో స్మార్ట్ ఫోన్లు.
ఇక ఇండియాలో ఎక్కువ ఫోన్లను అమ్ముడు చేస్తున్న షావోమి విషయానికి వస్తే, ఈ బ్రాండ్ లి సంబంధించిన 9 ఫోన్లు ఈ కాలింగ్ కి అనుకూలిస్తాయి.
అవి : F6L(రెడ్మి 7), రెడ్మి 7,రెడ్మి 7A, పోకో F1, రెడ్మి K20, రెడ్మి K20 ప్రో, రెడ్మి నోట్ 7 ప్రో, రెడ్మి నోట్ 8 ప్రో మరియు రెడ్మి Y3.
ఇక శామ్సంగ్ విషయానికి వస్తే, ఈ జాబితాలో అత్యధికంగా ఫోన్లను కలిగిన మొబైల్ ఫోన్ తయారీదారుగా శామ్సంగ్ నిలుస్తుంది. ఎందుకంటే, శామ్సంగ్ యొక్క 82 ఫోన్లు ఈ జాబితాలో వున్నాయి.
S సిరీస్ : S 10, S 10e, S 10 ప్లస్, S9, S9 ప్లస్, S8, Sప్లస్, S7, S7 ఎడ్జ్, S6, S ఎడ్జ్, S 6 ఎడ్జ్ ప్లస్,
గెలాక్సీ నోట్ సిరీస్ : నోట్ 10, నోట్ 10 ప్లస్, నోట్ 9, నోట్ 8, నోట్ 5, నోట్ 5 డ్యూస్, నోట్ ఎడ్జ్, నోట్ 4
ON సిరీస్ : ఆన్ మాక్స్, ఆన్ nxt, ఆన్ 8(2018), ఆన్ 7 ప్రైమ్, ఆన్ 7 ప్రో, ఆన్ 6, ఆన్ 5 ప్రో
A సిరీస్ : A 80, A 70, A 70 s, A 50, A 50s, A 30, A 30s, A 20, A 20s, A 10, A 10s, A 9 ప్రో, A 9, A 8, A 8 ప్లస్, A 8 స్టార్, A 7(2016), A 7(2018), A 7(A700FD), A6, A6 ప్లస్, A 7(2017), A 7(2016) మరియు A5
M సిరీస్ : M 40, M 30, M 30s, M 20, M 10 మరియు M 10s
C సిరీస్ : C 9 ప్రో, C 7 ప్రో, Core ప్రైమ్ 4G
J సిరీస్ : J8, J7, J7 మ్యాక్స్ , J7 ప్రైమ్ , J7 ప్రైమ్ 2, J7 nxt , J7 ప్రో, J7 Duos, J7 (2016),J6, J6 ప్లస్ , J5, J5 (2016), J5 ప్రైమ్ (16GB), J4, J4 ప్లస్, J3 (2016), J3 ప్రో, J2(2018), J2 ప్రో (2016), J2 (హైబ్రిడ్ ట్రే-DD), J2, J2 ఏస్ మరియు J1 4G
ఆపిల్ ఐఫోన్ విషయానికి వస్తే, ఆపిల్ యొక్క Iphone 6 సిరీస్ నుండి ఆపై వచ్చిన అని సిరీస్ ఫోన్లలో ఈ wifi కాలింగ్ పనిచేస్తుంది. ఐఫోన్ 6s, ఐఫోన్ 6s ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X, ఐఫోన్ XR, ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్,ఐఫోన్ SE, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ X ప్రో మ్యాక్స్,
ఇక గూగుల్ నుండి వచ్చిన ప్రీమియం ఫోన్లయినటువంటి, గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3XL, గూగుల్ పిక్సెల్ 3a, గూగుల్ పిక్సెల్ 3a XL వంటి 4 ఫోన్లలో ఈ ఉచిత WiFi కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన ఇన్ఫినిక్స్ యొక్క హాట్ 8, ఎస్ 5 లైట్, ఎస్ 5 ప్రో , స్మార్ట్ 3 ప్లస్, నోట్ 5, S 4, స్మార్ట్ 3, హాట్ 7 ప్రో, హాట్ 7 ప్రో, హాట్ S3, హాట్ S3X, X57B,X604 మొదలైన 13 ఫోన్లు ఈ WiFi ఉచిత కాలింగ్ స్మార్ట్ ఫోన్ జాబితాలో ఉన్నాయి.
టెక్నో మొదలైన బ్రాండ్ల గురించి మాట్లాడితే, ,కామోన్ 15, కామోన్ 15 ప్రో, కామోన్ 12 ఎయిర్, ఫాంటమ్ 9, కెమోన్ KC2, కెమోన్ i ఎస్ 2X, కెమోన్ i ట్విన్,కెమోన్ i 4X, కెమోన్ i ఎస్ 2, కెమోన్ i4, కెమోన్ i స్కై 3,KC2J, స్పార్క్ 4 ఎయిర్, ఫాంటమ్ 9, స్పార్క్ 4 లైట్ మరియు స్పార్క్ గో వాటి ఫోన్లు ఉన్నాయి.
కూల్ ప్యాడ్ ఫోన్ల విషయానికి వస్తే, ఈ బ్రాడ్ కి సంబంధించి కేవలం 3 ఫోన్లలో మాత్రమే ఈ ఉచిత WiFi కాలింగ్ పనిచేస్తుంది అవి : కూల్ ప్లే 6, మెగా 5, మెగా 5c
లావా నుండి 7 ఫోన్లు ఈ జియో wifi కాలింగ్ సౌకర్యంతో పనిచేస్తాయి. అవి : Z60s, Z61, Z40,Z71,Z62, Z92,Z81 2GB ఫోన్లు
మోబి స్టార్ యొక్క 4 ఫోన్లలో మరియు మోటోరోలా నుండి 1 ఫోనులో ఈ సౌకర్యం అందుబాటులో వుంది.
మోబి స్టార్ : C1, C షైన్, C2, X1 నోచ్ మరియు X1 సెల్ఫీ
మోటోరోలా : Moto G6
ఐటెల్ సంస్థ నుండి కేవలం 2 ఫోన్లు మాత్రమే ఈ జాబితాలో వున్నాయి. అవి : A46, S42 ఫోన్లు