రిలయన్స్ jio మన దేశ టెలికాం రంగం లో ఒక పెను మార్పు ను తీసుకువచ్చింది . సరిగ్గా 7 నెలల క్రితం JIO ప్రివ్యూ ఆఫర్ అంటూ వచ్చింది. ఈ ప్రివ్యూ ఆఫర్ లో అన్లిమిటెడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ అంటూ అన్లిమిటెడ్ వీడియో కాల్స్ అంటూ దేశం మొత్తం jio వైపు చూసేలా చేసింది దీని దెబ్బకి మిగతా టెలికాం దిగ్గజాలు అయినా ఎయిర్టెల్ , ఐడియా , వోడాఫోన్ లు షాక్ కు గురయ్యాయి
ఆ ప్రివ్యూ ఆఫర్ ఒక నెల కానీ 2 నెలలకే ముగిస్తుందనుకుంటే ఆశ్చర్యకరంగా నెల తరువాత jio వెల్కమ్ ఆఫర్ అంటూ వచ్చింది. మరో 3 నెలల పాటు 4జీబీ 4 జి డేటా , అన్లిమిటెడ్ డేటా , అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇచ్చారు. అంతటితో దీని ప్రస్థానం ఆగలేదు
మరో 3 నెలలు అంటే మార్చ్ 31 వరకు 1 జీబీ 4 జి డేటా fup లిమిట్ తో అన్లిమిటెడ్ డేటా , అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇచ్చారు. ఆ తరువాత jio ప్రైమ్ మెంబర్షిప్ ప్రవేశ పెట్టారు , దీని కోసం మొదట 99 రూ రీఛార్జి చేసుకుని ఆ తరువాత నెలకి 303 రూ లతో కానీ Rs.499 కానీ రీఛార్జ్ చేయించుకుంటే నెలరోజుల పాటు రోజుకి 1 జీబీ లేదా 2 జీబీ డేటా ను కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు , ఇప్పుడు మరల సరికొత్తగా
jio ప్రైమ్ మెంబర్షిప్ ను మరో 15 రోజులు పొడిగించారు . ఈ 15 డేస్ లో ప్రైమ్ మెంబర్షిప్ 99 రూ రీఛార్జి చేసుకున్నవారికి మరియు చేయించుకొనే వారు నెలకి 303 రూ లతో కానీ Rs.499 కానీ రీఛార్జ్ చేయించుకుంటే మరో 3 నెలలు పాటు వాటికి రిలేటెడ్ ఆఫర్ ను పొడిగించవచ్చు
మీరు 303 రూ రీఛార్జ్ చేస్తే అంటే జూన్ 30 వరకు రోజుకి 1 జీబీ చొప్పున fup లిమిట్ తో అన్లిమిటెడ్ డేటా , అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు
ఒకవేళ మీరు Rs.499 కానీ రీఛార్జ్ చేయించుకుంటే జూన్ 30 వరకు రోజుకి 2జీబీ చొప్పున fup లిమిట్ తో అన్లిమిటెడ్ డేటా , అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాలిసిన విషయం ఏమిటంటే ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు 91 రోజులు ఉంటాయి
అంటే మీరు 303 రూ మీరు రీఛార్జ్ చేయిస్తే రోజుకి 1 జీబీ చొప్పున 91 రోజులకి 91 జీబీ డేటా వస్తుంది. అదే మీరు 499 రూ రీఛార్జ్ చేసుకుంటే రోజుకి 2 జీబీ చొప్పున 91రోజులకి 182 జీబీ డేటా వస్తుంది. మీ ఇంటర్నెట్ నినియోగం బట్టి ఈ రెండిట్లో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు