ప్రస్తుతం జియో నెట్‌వర్క్ కి మారాలనుకునేవారికి అద్భుతమైన అవకాశం. జియో సంస్థ, ఇప్పటికే కొనసాగుతున్న టెలికం ఆపరేటర్ నెట్‌వర్క్ నుండి జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ కి మారడానికి, యూజర్లకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా, వారి డేటా లిమిట్ ని కూడా పొందేందుకు వీలుగా, 'Carry Forward Your Credit Limit' అనే అద్భుతమైన ఫీచర్ ని అందించింది.
ఇతర ఆపరేటర్ల పోస్ట్ పెయిడ్ కస్టమర్లు వారి నెట్‌వర్క్ ఆపరేటర్ అందచేసే అదే క్రెడిట్ లిమిట్ తో జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ నెట్‌వర్క్ కి మరవచ్చు.
ఒక టెలికం ఆపరేటర్ నుండి మరొక టెలికం ఆపరేటర్ కి మారడానికి వినియోధారులు ఎక్కువగా తమ క్రెడిట్ లిమిట్ గురించి ఆలోచించే వారు. అయితే, జియో ఈ అంతరాన్ని తగ్గించింది.
జియో ప్రకటించిన 'Carry Forward Your Credit Limit' తో చాలా సౌకర్యవంతంగా జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ కి మారవచ్చు. అంతేకాదు, ఈ విధంగా మారడానికి ఎటువంటి రుసుమును లేదా ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయాల్సిన అవసరం లేదని జియో తెలిపింది.
ఇప్పటికే వాడుతున్న పోస్ట్ పెయిడ్ ఆపరేటర్ నుండి Jio Postpaid plus కి మారడానికి ఈ విధంగా చెయ్యాలి.
ముందుగా, మీ వాట్సాప్ నుండి 88501-88501 నంబర్ కు 'Hi' అని వాట్సాప్ మెసేజీని పంపాలి.
మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పోస్ట్ పోస్ట్ పెయిడ్ ఆపరేటర్ యొక్క బిల్ ను కూడా పంపించాలి/అప్లోడ్ చేయాలి.
చివరిగా యూజర్లు తమ కొత్త Jio Postpaid plus సిమ్ కార్డును జియో స్టోర్ నుండి లేదా తమ ఇంటి వద్దకే డెలివరీ చేసుకునే అవకాశం వుంది.
Jio Postpaid plus ప్లాన్స్ కేవలం రూ.399 రూపాయల నుండి ప్రారంభం అవుతాయి మరియు అన్ని ప్లాన్స్ కూడా ప్రధాన OTT ప్లాట్ఫామ్స్ అయినటువంటి Netflix, Amazon Prime, Disney+ Hotstar కి ఉచిత చందాతో వస్తాయి.
ఈ ప్లాన్ యొక్క ధర రూ .399 నుండి రూ .1,499 వరకు ఉంటుంది మరియు 75 జీబీ డేటా రూ .399 కు లభిస్తుంది. ఇది అన్‌లిమిటెడ్ వాయిస్ మరియు ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాన్ని కలిగి ఉంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ లకు వినియోగదారులు చందాలను స్వీకరిస్తారు. వినియోగదారులకు 200 జీబీ డేటా రోల్‌ఓవర్ లభిస్తుంది.
ఈ రూ .599 ప్లాన్ లో 100 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ మరియు ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనం కూడా ఉంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ + హాట్‌స్టార్‌లకు వినియోగదారులు చందాలను స్వీకరిస్తారు. వినియోగదారులకు 200 జీబీ డేటా రోల్‌ఓవర్ లభిస్తుంది. ఫ్యామిలీ కోసం మీకు 1 అదనపు సిమ్ లభిస్తుంది.
ఈ 799 రూపాయల ప్రణాళికలో 150 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ మరియు ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనం కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ + హాట్‌స్టార్‌లకు వినియోగదారులు చందాలను స్వీకరిస్తారు. వినియోగదారులకు 200 జీబీ డేటా రోల్‌ఓవర్ లభిస్తుంది. ఫ్యామిలీ కోసం వినియోగదారులకు 2 అదనపు సిమ్ లు లభిస్తాయి.
ఈ 999 రూపాయల ప్లాన్ లో 200 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ మరియు ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనం కూడా ఉంది. వినియోగదారులు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాలను స్వీకరిస్తారు. వినియోగదారులకు 500 జీబీ డేటా రోల్‌ఓవర్ లభిస్తుంది. ఫ్యామిలీ కోసం వినియోగదారులకు 3 అదనపు సిమ్ లు లభిస్తాయి.
1499 రూపాయల ప్లాన్ లో 300 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ మరియు ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనం కూడా ఉంది. వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాలను స్వీకరిస్తారు. వినియోగదారులకు 500 జీబీ డేటా రోల్‌ఓవర్ లభిస్తుంది. USA మరియు UAE కోసం అపరిమిత డేటా మరియు వాయిస్ యొక్క ప్రయోజనం కూడా ఉంది.
మీరు జియో కస్టమర్ అయితే, మీ నంబర్‌కు అందుబాటులో ఉన్న లేటెస్ట్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇక్కడ చూడండి.