రిలయన్స్ జియో సామాన్యునికి ఒక వరం లా వచ్చిందని చెప్పొచ్చు . అయితే కేవలం జియో వలన అన్ని టెలికాం కంపెనీలు వారి ప్లాన్ లకు కొత్త రూపాన్ని అందిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కూడా చౌకగా మరియు అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్ ని అందించడానికి చాలా ప్రయత్నిస్తుంది .ఇదే బాటలో మిగతా టెలికాం కంపెనీ లు అడుగులు వేస్తున్నాయి .
తన యూజర్స్ ని కాపాడుకోనేందుకు తెగ ప్రయత్నిస్తుంది. జియో-ధన్ ధనా ధన ప్లాన్ హిట్ అయినప్పుడు, ఎయిర్టెల్, వొడాఫోన్ మరియు ఐడియా కూడా అదే ప్లాన్లను అందించాయి.
ఎయిర్టెల్ కి చాలా మంది సబ్స్ క్రైబర్స్ ఉన్నప్పటికీ , జియో తన ఫ్రీ ప్లాన్ ల తో ముందుకు సాగుతోంది. జియో మరియు ఎయిర్టెల్ లో చాలా వరకు ఒకే కాస్ట్ లో లభించే అనేక ప్లాన్స్ ఉన్నాయి.
ఏ ప్లాన్ మీకు బెస్ట్ మరియు మీకు ఏ ప్లాన్ లో లాభం వస్తుందనే విషయం లో మీరు ఒకవేళ చాలా కన్ఫ్యూషన్ కలిగి ఉంటే, మీరు సరైన స్థానానికి వచ్చారు. ఈ ఆర్టికల్ లో మీకు మరింత లాభం ఎక్కడ మరియు ఎలా లభిస్తాయో మేము మీకు చెప్పబోతున్నాము.
ఇక్కడ ఎయిర్టెల్ మరియు జియో యొక్క అన్ని ప్లాన్స్ కూడా కంపేర్ చేయబడ్డాయి .
రూ .349 ప్లాన్
ఎయిర్టెల్, రిలయన్స్ జీయో రెండూ ఈ ప్లాన్ ను అందిస్తున్నాయి. జియో ఈ ప్లాన్ లో లోకల్ STD రెండింటిలోనూ అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుంది. దీనితో పాటు, 20GB 4G డేటా 56 రోజులు పాటు అందిస్తుంది , దీనిలో ఏ FUP లిమిట్ లేదు.
అలానే , ఎయిర్టెల్ తన రూ .349 ప్లాన్లో జియో లానే లోకల్ మరియు ఎస్టీడీ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ను ఇస్తోంది. 28 రోజులు 4 జిబి డేటాతో 28 రోజుల వాలిడిటీ తో వస్తుంది. 1 GB రోజువారీ FUP లిమిట్ వుంది .
రూ 149 ప్లాన్
ఈ 149 రూ ప్లాన్ ను కూడా రెండూ ఇస్తున్నాయి . దీనిలో జియో అన్లిమిటెడ్ కాలింగ్ ఇస్తుంది మరియు 2జీబీ 4 జి డేటా 28 రోజులకు లభిస్తుంది . ఎయిర్టెల్ లలో కూడా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తుంది . కానీ ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ కి మాత్రమే . మరియు 2జీబీ 4 జి డేటా 28 రోజులకు లభిస్తుంది .