ట్రాయ్ పాస్ చేసిన ఆర్డర్స్ ప్రకారం jio తన సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను వెనక్కితీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసినా ఇప్పటికి వినియోగదారులు ఆలాభాలను పొందుతున్నారు.
jio సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ నిలిచిపోవటానికి గల అసలు కారణం మిగతా టెలికాం సంస్థలన్నీ తీవ్రముగా నష్ట పోవటమే , మరియు ఇవన్నీ తమయొక్క గోడు ట్రాయ్ ముందట వెళ్లబోసుకున్నాయ్
ట్రాయ్ ఈ సమ్మర్ సమ్మర్ ఆఫర్ గురించి సరైన వివరణ ఇవ్వమని కోరినప్పుడు jio నుంచి సరైన వివరణ రాలేదు.
అందుకే వెంటనే ఈ ఆఫర్ నిలిపి వేయాలని ట్రాయ్ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌కు నిలిపివేతకు సంబంధించిన
అఫిషియల్ అనౌన్స్ మెంట్ జియో మరికొద్ది గంటల్లో వెల్లడించనుందని మార్కెట్ వర్గాల సమాచారం
.దీనికి అసలు కారణం, జియో మరో షాకింగ్ టారిఫ్ ప్లాన్‌ల ను ఇవ్వటానికి సిద్ధపడింది.
జియో తన అఫిషియల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన బ్యానర్‌లో , సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌కు రీప్లేస్ మెంట్ గా సరికొత్త టారిఫ్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
. ‘మా టారిఫ్ ప్యాక్ లను అప్ డేట్ చేస్తున్నాం, త్వరలోనే మరిన్ని ఆసక్తికర ఆఫర్లను పరిచయం చేయబోతున్నామంటూ' జియో తన వెబ్ సైట్ లో పేర్కొంది.