జియో ఇప్పటివరకు ఇచ్చిన సంచలన ప్లాన్స్ ఇవ్వటం లో మరో ఈ కంపెనీకి ఇవ్వటమనేది అసాధ్యం. ఇస్తామని అనేక ప్రకటనలు చేస్తున్నప్పటికీ మార్కెట్ లో జియో సృష్టించినంత ప్రభంజనం ఇక మరేది చేయలేదు.
ఎందుకంటే 1 కాదు 2 కాదు 6 నెలల పాటు ఫ్రీ సర్వీస్ ఇవ్వటం అనితర సాధ్యం.
ఆ తరువాత జిఓ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ కి ట్రాయ్ అడ్డుకట్ట వేయటం తో ఇక జియో పని అవుట్ అని మిగతా టెల్కో లు ఊపిరి పీల్చుకుంటున్నాయ్.
కానీ జియో ని ఎవరూ ఆపలేనట్లుగా మరల మరల ఎదో ఒక ప్లాన్ తో సందడి చేస్తోంది.
దానిలో భాగంగానే 19 నుంచి 9999 రూ వరకు ప్లాన్స్ ను విడుదలచేసి తన సత్తా ను చాటుకుంది.
ఇప్పుడు మరో సంచల నిర్ణయం తీసుకుంది. నెలకి కేవలం 100 రూ రీఛార్జ్ చేస్తే చాలు యూజర్స్ కి అన్లిమిటెడ్ డేటా మరియు వాయిస్ కాల్స్ ఇతరత్రా సౌకర్యాలు కల్పించనున్నారు.
జియో అతిత్వరలో దీనిని మనముందుకు తీసుకురానుంది. మరియు ఇంకా షాకింగ్ ప్లాన్స్ ని విడుదల చేసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించనుందట.