రిలయన్స్ జియో మనీ వ్యాలెట్‌ని జియో చాట్‌కి కనెక్ట్ చేసి యూజర్లు డబ్బులు పంపిచుకునేలా కొత్త సర్వీసు
రిలయన్స్ జియో మనీ వ్యాలెట్‌ని జియో చాట్‌కి కనెక్ట్ చేసి వినియోగదారులు మని ట్రాన్స్ఫర్ చేసుకొనేలా కొత్త సర్వీసుని అందుబాటులోకి తీసుకొచ్చింది
రిలయన్స్ జియో సిమ్ లు వాడుతున్న వారు ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చని జియో చెబుతోంది
జియో మనీ అకౌంట్ లోకి వేళ్ళని ఆ తరువాత పేమెంట్స్ విభాగం ఆ విభాగంలో మోర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి లింక్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు ఓ ఓటీపీ వస్తుంది. అది రాగానే మీ జియో మనీకి అకౌంట్ జియో చాట్ తో కనెక్ట్ అవుతుంది
ఇప్పుడు మనీ ఎలా పంపాలంటే జియో చాట్ ద్వారా ఇతరులతో చాట్ చేసే సమయంలో ఆ చాట్ లో మీకు రూపీ అనే ఐకాన్ గుర్తు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అవతలి వారికి మనీ పంపుకోవచ్చు
మీరు ఎంత పంపాలనుకుంటున్నారో అంత బ్యాలన్స్ మీ వాలెట్ ఉంటేనే అది అవతలి వారికి చేరుతుంది.మీరు మనీ పంపాలంటే అవతలి వారికి కూడా జియో చాట్ ఉండాలి.
లేకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని జియో సర్వీసు పొందండి