టెల్కో స్మార్ట్ టీవీ సర్వీసెస్ ను వినియోగం లోకి తెచ్చేటందుకు సన్నాహాలు మొదలుపెట్టింది
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తో కలిసి ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది
గూగుల్ తో కలిసి సరికొత్త 4 G ఫోన్ ను అందించనుంది. ఈ ఏడాది చివరినాటికి ఈ ఫోన్ లను అందుబాటులోకి తీసుకొచ్చేవిధముగా సన్నాహాలు చేస్తుంది.
మధ్యతరగతి ప్రజలకు అత్యంత చేరువగా తీసుకురావటానికి ముఖేష్ అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 4G
స్మార్ట్ ఫోన్ లో వుండే మాక్సిమం ఫీచర్స్ తో ఈ ఫోన్ ను అత్యంత తక్కువ ధరకు దీనిని రూపొందించాలని JIO కంపెనీ గూగుల్ ని కోరింది.
ఆల్రెడీ దీనికి సంభందించిన తయారీలు జరుగుతున్నాయి. ఈ ఫోన్
కనీస ధర 2,000 రూ ఉంచే విధముగా గూగుల్ మరియు JIO చర్చలు జరుపుతున్నాయి. మరియు
ఈ రెండు కంపెనీలు కలిపి టెల్కో స్మార్ట్ టీవీ సర్వీసెస్ ను వినియోగం లోకి తెచ్చేటందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని చైనా ఫోన్ కంపెనీలతో jio చర్చలు జరుపుతుంది. మరియు
కొన్ని ఫోన్ లను కూడా మార్కెట్ లోకి విడుదల చేసింది. లావా ఇంటర్నేషనల్ మరియు
మరికొన్ని కంపెనీలతో కలిసి 4G VOLTE ఫోన్ లను ఆవిష్కరించింది. ఈ ఫోన్ లను 1,000 రూ లకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇటీవలే
చైనీస్ మరియు థైవాన్ కంపెనీ ఒరిజినల్ డివైస్ మ్యానుఫ్యాక్చర్స్ తో తమ 4G ఫోన్స్ తయారుచేయాలని కోరింది.