జియో, సరికొత్త దారి వైపు అడుగులు వేస్తోంది ఇప్పటివరకు ఫ్రీ డేటా సర్వీసెస్ ఇవ్వటం తో పాటు జియో ఫీచర్ ఫోన్స్ మరియు లాప్టాప్ ఇంకా dth ను కూడా ప్రవేశపెట్టింది,
అయితే ఇప్పుడు సరికొత్తగా' డీటీహెచ్ టెలికాస్ట్ కు అవరసమైన cable TV STBలను కూడా టెస్ట్ చేస్తుందట .
జియో లాంచ్ చేయబోయే కేబుల్ టీవీ సెట్ టాప్ బాక్సులు కూడా FTTH కేబులింగ్ ద్వారానే వ పని చేస్తాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
వీటి హైబ్రీడ్ సెట్ టాప్ బాక్సులు కొరియాలో తయారు చేస్తున్నారట .
ఇంతకు ముందు లీకైన ఫొటోస్ ని మీరందరు గమనిస్తే jio సెటప్ బాక్స్ బాక్స్ లో చాలా కనెక్టింగ్ పోర్టులువున్నాయి.
వాటిలో స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్ పోర్ట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ పోర్ట్, ఆడియో, వీడియో అవుట్ పుట్ పోర్ట్స్ తో పాటు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునేందుకు అవసరమైన Ethernet పోర్ట్ కూడా ఉంది. జియో సెట్ టాప్ బాక్స్ ముందు భాగంలో కూడా యూఎస్బీ పోర్ట్ వుంది.
మొదటి మూడు నెలల పాటు జియో డీటీహెచ్ ప్రసారాలను ఫ్రీ గా చూసే అవకాశం ఇస్తున్నారు .
సాధారణంగా అన్ని కంపెనీలు నెలవారీ డీటీహెచ్ ప్యాక్‌ను 275 నుంచి 300 వరకు ఛార్జ్ చేస్తాయి . కానీ రిలయన్స్ జియో రూ. 185కే ఇస్తుందట. మరియు 300 ఛానళ్లను జియో అందుబాటులో ఉంచుతుందట.
ప్రస్తుతం అయితే ఎయిర్‌టెల్, టాటా స్కై, డిష్ టీవీ లకు ఈ వార్త గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.