ప్రతీ సంవత్సరం దీపావళి సమయంలో మొబైల్ ఆఫర్స్, సేల్స్ ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు ఆ ఫెస్టివల్ సీజన్ లో ఉన్నాయి అన్ని వెబ్ సైట్స్ కూడా. అన్ని బడ్జెట్ లలో కొనగలిగే మంచి ఫోన్స్ లిస్టు ఇక్కడ పొందిపరిచాము. ఈ దీపావళి కి కనవలసిన బెస్ట్ ఫోన్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
నా బడ్జెట్ 7,000 రూ.. అనుకునే వారికీ..
మీ బడ్జెట్ లిమిట్ 7K అయినా లేదా మీరు పెద్ద టెకీ కానప్పుడు.. ఈ బడ్జెట్ లో తీసుకోవటం బెటర్.
1. Meizu M2 - 6,999 రూ. 5 in 720P డిస్ప్లే, 2gb ర్యామ్, 13MP రేర్ కెమేరా (కంప్లీట్ రివ్యూ)
2. రెడ్మి 2 prime - 6,999 రూ (నవంబర్ 5 వరకూ mi.com/in లో 6,500 రూ)
అన్ని కంపెనీలు 10K బడ్జెట్ లో ఇప్పుడు అన్నీ ఇస్తున్నాయి. సో ఈ బడ్జెట్ చాలు అనుకునే వారికీ..
1. Meizu M2 నోట్ - 9,999 రూ. మంచి బ్యాలన్స్ద్ స్మార్ట్ ఫోన్ ఇది. (కంప్లీట్ రివ్యూ)
2. లెనోవో K3 నోట్ (కంప్లీట్ రివ్యూ)
నా బడ్జెట్ 15,000 రూ..
1. ఆసుస్ జెన్ ఫోన్ 2 (2gb ర్యామ్). బ్యాటరీ, 10 గంటలు పైనే వస్తుంది, కెమేరా రెండు వైపులా మంచి అవుట్ పుట్ ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ మిగిలిన ఫోన్స్ కన్నా బెటర్. (కంప్లీట్ రివ్యూ)
2. Xiaomi Mi 4i - లుక్స్ ఎక్కువ, కాని పై ఫోన్ తో పోలిస్తే పెర్ఫార్మెన్స్ తక్కువ. కాంపాక్ట్ అండ్ బెస్ట్ కెమేరా. (కంప్లీట్ రివ్యూ)
20 వేల రూ లలో తీసుకునే ప్లాన్స్ లో ఉన్న వారికి..
గుడ్ బడ్జెట్. ఈ ప్రైస్ లో కొనటానికి కొన్ని మంచి ఫోన్స్ ఉన్నాయి ..
1. మోటో X ప్లే - మంచి బ్యాలన్స్ద్ ఫోన్ ఇది. (కంప్లీట్ రివ్యూ)
2. ఆసుస్ జెన్ ఫోన్ 2 (4gb ర్యామ్) - హై పవర్ ఫుల్ అండ్ డిసెంట్ కెమేరా, ఒకే అనిపించే బ్యాటరీ
25 వేల బడ్జెట్ ను మీ ఫోన్ కోసం కేటాయించు కున్నారా...
1. oneplus 2 మంచి ఆప్షన్ కాని ఇది చేతిలో పట్టుకోవటానికి ఇబ్బందిగా ఉంది బాగా.. (కంప్లీట్ రివ్యూ)
2. హానర్ 7 - 22,999 రూ. oneplus 2 అంత పవర్ ఫుల్ కాదు కాని మంచి ఫోన్, 2 వేలు తక్కువ కూడా దాని కన్నా.
30 వేల పైన పెట్టె వారికీ...
1. నేక్సాస్ 5X..ఇది లేటెస్ట్ గూగల్ మోడల్ - బిగ్ స్క్రీన్ లవర్స్ కు నచ్చకపోవచ్చు. మోటో స్టైల్ కన్నా బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
2. మోటో X స్టైల్ - ఇది కూడా రీసెంట్ మోటో ఫ్లాగ్ షిప్ మోడల్. కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడే వారికి నచ్చదు. నేక్సాస్ 5x కన్నా మంచి కెమేరా ఉంది దీనిలో.
35 వేలు కన్నా ఎక్కువలో కొనే ఉద్దేశం ఉంటే..
నేక్సాస్ 6P అండ్ ఐ ఫోన్ 6 మంచి ఆప్షన్స్
అన్ లిమిటెడ్ బడ్జెట్ వారికీ..
సామ్సుంగ్ గేలక్సీ S6 / సామ్సంగ్ నోట్ 5 అండ్ ఐ ఫోన్ 6S / 6S ప్లస్ మోడల్స్ బెస్ట్ హై ఎండ్ బడ్జెట్ డివైజెస్. మీ స్క్రీన్ సైజ్ అండ్ OS ప్రిఫరెన్స్ బట్టి రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆపిల్ కు సామ్సంగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్స్ చాలా దగ్గరగా పోటీ ఇస్తున్నాయి కూడా. ఐ ఫోన్ 6S కంప్లీట్ తెలుగు రివ్యూ