ఐ ఫోన్ 7 ప్రైస్ - స్పెక్స్ - changes : ఇప్పటివరకు వినిపించిన రిపోర్ట్స్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Aug 31 2016
ఐ ఫోన్ 7 ప్రైస్ - స్పెక్స్ - changes : ఇప్పటివరకు వినిపించిన రిపోర్ట్స్

ఐ ఫోన్ 7 పై ఎప్పటిలానే చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వాటిని పొందిపరచటం జరిగింది. అయితే ఇవి కన్ఫర్మేషన్స్ కావు. ఆపిల్ ఎప్పుడూ ఫోన్ రిలీజ్ కు ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెల్లడించదు. క్రింద తెలపబడినవి అన్నీ రిపోర్ట్స్. అలాగని కొట్టి పారేయటానికి లేదు ఎందుకుంటే ఫేమస్ సోర్సెస్ నుండి వెలువడిన సమాచారాలు. క్రిందకు స్క్రోల్ చేస్తే ఐ ఫోన్ 7 గురించి మరింత సమాచారం తెలుసుకోగలరు.

ఐ ఫోన్ 7 ప్రైస్ - స్పెక్స్ - changes : ఇప్పటివరకు వినిపించిన రిపోర్ట్స్

ఐ ఫోన్ 7 ప్రైస్:
ప్రైస్ పై చాలా రూమర్స్ వినిపించాయి. వాటిలో స్టార్టింగ్ ప్రైస్ 52,900 రూ. ఇది 32GB వేరియంట్ ప్రైస్. 64GB వేరియంట్ 60,900 రూ. highest 91,200 రూ కూడా రిపోర్ట్ అయ్యింది 256GB వేరియంట్ కు.

ఐ ఫోన్ 7 ప్రైస్ - స్పెక్స్ - changes : ఇప్పటివరకు వినిపించిన రిపోర్ట్స్

ఎన్ని మోడల్స్ లో వస్తుంది?
3 మోడల్స్ - ఐ ఫోన్ 7, ఐ ఫోన్ 7 ప్లస్ అండ్ ఐ ఫోన్ 7 pro వేరియంట్స్ లో వస్తుంది అని రిపోర్ట్స్.

మరో వైపు కేవలం ఐ ఫోన్ 7 మరియు 7 ప్లస్ రెండే లాంచ్ అవుతాయి అని వేరే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే అసలు ఐ ఫోన్ 7 పేరు 6SE ఉండవచ్చు అని కూడా వినిపిస్తుంది. 

ఐ ఫోన్ 7 ప్రైస్ - స్పెక్స్ - changes : ఇప్పటివరకు వినిపించిన రిపోర్ట్స్

డిజైన్ changes :
1. బ్యాక్ సైడ్ panel పైనా, క్రిందన antenna stripes ఉండవు అని తెలుస్తుంది.

2. 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా తీసివేయటం జరిగింది. ఇప్పటివరకు వినిపించిన వాటిలో ఇది కచ్చితంగా నిజమవుతుంది అని అంచనా. 

3. deep బ్లూ కలర్ లో కూడా రానుంది ఐ ఫోన్ 7. ఇది ఆపిల్ కు కొత్త కలర్.

4. 4.7 in లో ఫుల్ HD, 5.5 in 2K లేదా Quad HD స్క్రీన్ తో మరొక మోడల్ వస్తుంది అని రిపోర్ట్స్.

ఐ ఫోన్ 7 ప్రైస్ - స్పెక్స్ - changes : ఇప్పటివరకు వినిపించిన రిపోర్ట్స్

ఫీచర్స్:
1. డ్యూయల్ రేర్ కెమెరా. ఇది కూడా నిజమై chances ఎక్కువ. 
2. lightning కేబుల్ ద్వారా కాకుండా బ్లూ టూత్ హెడ్ ఫోన్స్ తో మ్యూజిక్ ఉంటుంది అని మరొక రిపోర్ట్ ఉంది. ఇది బీట్స్ కంపెని హెడ్ ఫోన్స్ అని సమాచారం.
3. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం మొదటి సారి ఆపిల్ డ్యూయల్ సిమ్ ను ప్రవేసపెడుతుంది అని తెలుస్తుంది. అయితే ఇదే సోర్స్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది అని చెబుతుంది. అంటే చాలా సోర్సెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయి కనుక దీనిపై అంత నమ్మకం కుదరటం లేదు అందరికీ.

ఐ ఫోన్ 7 ప్రైస్ - స్పెక్స్ - changes : ఇప్పటివరకు వినిపించిన రిపోర్ట్స్

4. 3GB ర్యామ్ ఉంటుంది అని తెలుస్తుంది. ఆపిల్ రీసెంట్ లాస్ట్ ఫోన్ లో 2GB ర్యామ్ ఉంది. అయితే ఇది highest వేరియంట్ కు మాత్రమే ఉంటుంది అని ఇన్ఫర్మేషన్.

5. స్టీరియో స్పీకర్స్: ఫోన్ క్రింద భాగంలో lightning పోర్ట్ కు రెండు వైపులా స్పీకర్ గ్రిల్స్ తో ఇమేజెస్ లీక్ అయ్యాయి. సో స్టీరియో ఉంటుంది అని రిపోర్ట్స్.

6. Force టచ్ home బటన్: ఆపిల్ లో ఆల్రెడీ ఫోర్స్ టచ్ ఫీచర్ ఉంది డిస్ప్లే లో. ఇప్పుడు ఇది home బటన్ కు కూడా యాడ్ అవుతుంది అని అంచనా. ఇది బాడిలో ఇమిడి ఉంటుంది.

ఐ ఫోన్ 7 ప్రైస్ - స్పెక్స్ - changes : ఇప్పటివరకు వినిపించిన రిపోర్ట్స్

7. Mute బటన్ అనేది ఆపిల్ ఫోన్స్ లో ఇప్పటివరకూ బాగా పరిచయం అందరికీ. కాని ఐ ఫోన్ 7 లో ఇది ఉండదు అని రిపోర్ట్స్.

8. మరింత వాటర్ resistant, 1960 mah పెద్ద బ్యాటరీ, ఆపిల్ A10 SoC కొత్త ప్రొసెసర్ ఉండనున్నాయి.

ఇంతకీ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?
సెప్టెంబర్ 9 San Francisco లో రిలీజ్ అవుతుంది. దీనితో పాటు ఆపిల్ watch కూడా.