ఆపిల్ IOS 9 పబ్లిక్ బీటా వెర్షన్ మొబైల్స్ లో నిన్న విడుదల అయ్యింది. షెడ్యూల్ లాంచ్ కు ముందు పబ్లిక్ బీటా వెర్షన్ రిలీజ్ చేయటం ఇదే మొదటి సారి. గతంలో WWDC లో os అనౌన్స్ అయినప్పుడు ios 9 ఫీచర్స్ ను మీకు తెలియజేశాము. ఇప్పుడు లైవ్ గా ఒక రోజు వాడిన తరువాత మీకు ఇందులోని చెప్పుకోదగిన ఫీచర్స్ మరియు మార్పులను తెలియజేయటానికే ఈ స్లైడ్ షో. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.
New ఫాంట్ మరియు రౌండెడ్ ఎడ్జెస్
san francisco typeface ఫాంట్ ఇంతకుముందే ఆపిల్ వాచ్ లో వాడింది కంపెని.. ఇప్పుడు దాన్ని మొబైల్ కు తెచ్చింది. cohesiveness యాడ్ అయ్యింది ఫాంట్ వలన. స్మూత్ కూడా ఉన్నాయి లుక్స్. మీరు కనుక సఫారీ లేదా మెసేజ్ లను ఓపెన్ చేస్తే రౌండేడ్ ఎడ్జెస్ కనిపిస్తాయి. అన్ని ఆప్షన్ ప్యానల్స్ కి కూడా ఇవి యాడ్ అయ్యాయి.
Low పవర్ మోడ్
ఆపిల్ కు అవసరమైన అతీ ముక్యమైన ఫీచర్ ఇది. ఈ ఆప్షన్ ఆన్ చేస్తే, పుష్ నోటిఫికేషన్స్, బ్యాక్ గ్రౌండ్ యాప్ రిఫ్రెష్, ఆటోమేటిక్ డౌన్లోడ్స్, యానిమేషన్స్ అన్నీ డిసేబుల్ అవుతాయి. లో చార్జింగ్ ఉన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్ లో పాత ఫీచర్ కాని IOS కు మొదటి సారి కాబట్టి, ఆపిల్ యూజర్స్ కు బాగా నచ్చే అంశం ఇది.
Timeline వ్యూ ఫోటోస్
ఫోనులో ఉన్న ఫోటోస్ అన్నీ ఫోల్డర్స్ వైస్ గా ఆర్గనైజ్ అవుతున్నాయి. ఎక్కువ ఫోటోలు ఉన్నవాల్లకి ఇది నచ్చుతుంది. ఓల్డ్ ఫోటోలను సర్చ్ చేసే పని లేకుండా ఫోల్డర్స్ ప్రకారం కనిపిస్తాయి. అలాగే ప్రివ్యూ లో ఉన్న ఫోటోలను పించ్ ఇన్ చేస్తే ప్రివ్యూ పెద్దది అయ్యి కనిపిస్తుంది.
Siri మరియు స్పాట్ లైట్ సర్చింగ్
సిరి ఫాస్ట్ గా ఉంది. Accents కూడా చాలా బాగా గుర్తిస్తుంది. అలాగే స్పాట్ లైట్ సర్చ్ కూడా మీకు క్విగ్ గా ఏదైనా పాట లేదా కాంటాక్ట్ అవసరం అయితే వెంటనే ఇస్తుంది. స్క్రీన్ పై మీరు క్రిందకు స్వైప్ చేస్తే స్పాట్ లైట్ సర్చ్ బార్ వస్తుంది.
Task మేనేజర్ ఇంటర్ఫేస్ అప్ గ్రేడ్
దాదాపు స్క్రీన్ అంతా నిండిన సరికొత్త లార్జ్ టైల్స్ తో cascading కార్డ్స్ లుక్స్ లో ఉంది టాస్క్ మేనేజర్. యాప్స్ ను స్విఫ్ట్ చేసి టైల్ కంటెంట్ నుండి లార్జర్ ప్రివ్యూ ను పొందగలరు. అలాగే వాల్ పేపర్ మర్చుకునేటప్పుడు జూమింగ్ టాబ్ తీసివేయబడింది. వాల్ పేపర్స్ ను పెర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకునే వారికి ఇది నచ్చుతుంది.
Revamped నోట్స్, వాల్లేట్ మరియు Find మై ఐ ఫోన్ ఇంటర్ఫేస్
ఇప్పుడు నోట్స్ లో చెక్ లిస్టు లను , ఫోటోలను మరియు స్క్రిబ్బ్లింగ్ లను చేయగలరు. అలాగే ఇప్పటి వరకూ ఉన్న passbook యాప్ ఇప్పుడు Wallet అని పేరు మార్చుకుంది. దీనిలో మూవీ టికెట్స్, loyalty points, payback కార్డ్స్, బోర్డింగ్ పాసేస్, డిస్కౌంట్ కూపన్స్ దాచుకోగలరు.
Find మై ఐ ఫోన్ కు కొత్త సింపుల్ మరియు ఈజీ ఇంటర్ఫేస్ వచ్చింది. మీ ఆపిల్ ID లో రిజిస్టర్ అయిన అన్ని ఐ ఫోన్లను ఏక్సిస్ మరియు ట్రేసింగ్ చేయగలరు. మేము వాడిన టైమ్ లో Find మై ఐఫోన్ accurate గా ఉంది.
Carplay మరియు Switch కంట్రోల్
కార్ ప్లే సపోర్ట్ మరియు Switch కంట్రోల్ టు ios 9 యాడ్ చేసింది ఆపిల్. కార్ ప్లే ఇండియన్ యూజర్స్ కు ఇప్పట్లో ఉపయోగపడే ఫీచర్ కాదు కాని స్విచ్ కంట్రోల్ వాడగలరు. దిన్ని ఆన్ చేస్తే, మీరు బాగా వాడే యాప్ లేదా ఫీచర్ ప్లగ్ ఇన్ accessory కనెక్ట్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఇది డైలీ లైఫ్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించదు కాని లాంగ్ రన్ లో దీని ఉపయోగం తెలుస్తుంది మీకు.
Six డిజిట్ పాస్ కోడ్
ఇప్పటి వరకూ ఉన్న 4 డిజిట్ పాస్ కోడ్ predictable గా ఉండేది ఇతరలకు. సో ఇప్పుడు 6 డిజిట్ పాస్ కోడ్ ను ప్రవేశ పెట్టింది. అలాగే మీరు ఏదైనా యాప్ లో ఉన్నప్పుడు వాట్స్ అప్ మెసేజ్ వస్తే దాని ప్రివ్యూ మీద క్లిక్ చేసి రిప్లై ఇచ్చి మళ్ళీ వెంటనే Back to ఆప్షన్ ద్వారా మీరు ఇంతకముందు వాడుతున్న యాప్ కు వెళ్ళగలరు. మెయిన్ సెట్టింగ్స్ లో సర్చ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది మీరు ఆ సెట్టింగ్ ఎక్కడ ఉందా అని అన్ని సెట్టింగ్స్ ను ఓపెన్ చేసి వెతుకునే అవసరాన్ని తగ్గిస్తుంది.
KeyBoard
ఇప్పటి వరకూ కీ బోర్డ్ లో అక్షరాలు మీరు స్మాల్ లెటర్స్ వాడుతున్నా కేపిటల్ లోనే చూపించబడేవి. ఇది కన్ఫ్యుజింగ్ గా ఉండేది. ఇప్పుడు ఇది ఫిక్స్ అయ్యింది.