జూన్ 23 న InFocus M350 మరియు M530 మోడల్స్ ను లాంచ్ చేసింది అని మీకు ఇంతకముందు చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ లుక్ పిక్స్ ను ఇక్కడ క్లోజ్ అప్ లో చూడగలరు.
ఇన్ ఫోకస్ M350 మోడల్ రెడింటిలో తక్కువ ధర కలిగినది. 7,999రూ. 8MP బ్యాక్ మరియు ఫ్రంట్ కెమేరాస్ దీనిలో ఉన్నాయి. దీని కొనాలంటే ముందుగా ప్రీ రిజిస్టర్ చేసుకోవాలి స్నాప్ డీల్ లో. ప్రీ రిజిస్టరింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి.
స్పీకర్ గ్రిల్, కంపెని లోగో, 8MP కెమేరా లెన్స్ దీని కర్వ్ బ్యాక్ ప్యానల్ లో కనిపిస్తాయి.
మీడియా టెక్ MT6732 1.5 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4.4
InLife పేరుతో దీనికి సొంత యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. ఫాస్ట్ గా అనిపిస్తుంది. కాని కెమేరా వేగం తక్కువుగా ఉంది.
ఇది ఇన్ ఫోకస్ M530 మోడల్. దీని ధర 10,999 రూ. స్నాప్ డీల్ లో ఎటువంటి రిజిస్ట్రేషన్ లు అవసరం లేకుండా కొనవచ్చు.
M530 లో మీడియా టెక్ MT6595 2GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 2జిబి ర్యామ్ ఉంది. కంపెని మాటల ప్రకారం, ఇది ఈ బడ్జెట్ లో వస్తున్న ఫాస్టెస్ట్ ప్రొసెసర్. ఆ విషయం మనం ఎలాగూ మన రివ్యూ లో ముందు తెలుసుకుంటాం అనుకోండి! :)
5.5 in HD IPS డిస్ప్లే, InLife UI, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4.4 దీని సొంతం.
రెండు కెమేరాలు 13MP లెన్స్ తో వస్తున్నాయి M530 లో . దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేష్న్ కూడా ఉంది.
M530 తో HDR మోడ్ లో తీసిన సింపుల్ ఫోటో. బాగా వచ్చింది. దీని ఫ్రంట్ కెమేరా కు Gesture రికాగ్నిషణ్ ఫీచర్ కూడా ఉంది.
లో లైటింగ్ లోని కొన్ని మార్పులు ఆటోమేటిక్ చేసి, తీయబడిన ఫోటో ఇన్ఫర్మేషన్.
చుట్టూ మెటల్ స్ట్రిప్ ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్, left సైడ్ వాల్యూమ్ రాకర్ ఉంది.
ఫోన్ పైన 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది.
కింద స్టాండర్డ్ usb పోర్ట్ ఉంది.
కంపెని చెప్పిన దాని ప్రకారం, ఒక నెలకు రెండు లక్షల ఫోన్ సేల్స్ ను ఆశిస్తుంది ఇన్ ఫోకస్. వీటి పై మరింత సమాచారం త్వరలో.