కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 03 2020
కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

చైనా నుండి వ్యాప్తి చెందిన కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడు భారతదేశంలో మరింత ప్రభలుతోంది. అంతేకాదు, మనం ఈ కరోనా యొక్క  పీక్స్ చూసే దిశగా సాగుతున్నామని చేస్తున్న హెచ్చరికలను కూడా చూస్తున్నాం. ముఖ్యంగా, మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎక్కువగానే కేసులు నామోదయ్యాయని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని మన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా చెబుతోంది. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని అసత్య విషయాల వలన ప్రజలు మోసపోయే ప్రమాదం వుంది. అందుకే, ఈ 10 విషయాల గురించి తెలుసుకోవడం మంచిది.

కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

1. Face Mask Ads

కరోనావైరస్ నుండి సరైన రక్షణ ఇవ్వగల Face Mask అంటూ అనేక రకాల మాస్కులు కొనమని మిమ్మల్ని టెంప్ట్ చేసే ప్రకటనలను మీరు విస్మరించాలి.

కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

2. డాక్టర్ సలహా లేకుండా మందులు వాడకండి  

కరోనావైరస్ మహమ్మారి భారిన పడకుండా ఉండడానికి మరియు దాన్ని ఏ విధంగానైనా నివారించలనే ఉధ్యేశ్యంతో ఆన్‌లైన్‌లో ఎప్పుడూ మందులు కొనకండి

కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

3. అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు

ఇప్పుడు చాలా వెబ్‌సైట్లలో కరోనా గురించి అనేక రకాల వార్తలు అంధిస్తున్నాయి. ఇవన్నీ కూడా నూటికి నూరుపాళ్లు నిజం అని మీరు నమ్మవద్దు, వాటిలో చాలా నకిలీ వార్తలు కావచ్చు. అది గమనించండి.

కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

4. కరోనా టెస్ట్ కిట్స్

మార్కెట్లో ఎక్కడ చూసిన కరోనా టెస్టింగ్ కిట్స్ గురించిన ప్రచారమే జరుగుతోంది మరియు కొన్ని టెస్టింగ్ కిట్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. కానీ, వాస్తవానికి ఇప్పటివరకూ ఎటువంటి టెస్టింగ్ కిట్స్ కూడా అధికారికంగా ప్రకటించ లేదు.

కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

5. Tik Tok  మరియు Whatsapp

Tik Tok  మరియు Whatsapp ఫార్వార్డింగ్ మెసేజ్ లు మరియు వీడియోలకు వీలైనంత దూరంగా ఉండడం మంచింది.

కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

6. ఆన్లైన్ లో చూసి సొంత నిర్ణయం

మరీముఖ్యంగా, ఆన్‌లైన్ సైట్లు మరియు Youtube వీడియోలను అనుసరించి ఆన్లైన్ లో సలహాలను చూసి, మీకు మీరుగా ఎలాంటి అంచనాలను లేదా సొంత నిర్ణయాలను తీసుకోకూడదు. ఏమాత్రం అనుమానంగా వున్నా, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

7. కరోనా లక్షణాలుంటే ఆన్లైన్ డాక్టర్ వద్దు

ఒకవేళ, మీకు ఏదైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే దీనికోసం ఆన్‌లైన్‌లో డాక్టర్స్ లేరు. దీన్ని ఆన్‌లైన్‌లో కన్ఫర్మ్ చేయడానికి ప్రయత్నించవద్దు.

కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

8. ఆన్‌లైన్ సోషల్ మీడియా వార్తలు

ఆన్‌లైన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పైన వార్తలు అక్కడివారి పరిస్థితి మరియు అప్డేట్ తరువాత మాత్రమే ఇతరులకు చేరవేయబతాయి. ఇవి ప్రదేశం, వాతావరణం, ఆహార పరిస్థితులు మరియు అనేకమైన విషయాలలో తార తామ్యతలను కలిగి ఉంటాయి.        

కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

9. కరోనా లేదా Covid 19 పేరుతో  Unknown Mail  

కరోనా గురించి మీకు తెలియని వారినుండి ఏదైనా Unknown Mail వస్తే, ఖచ్చితంగా చూడవద్దు.  ప్రస్తుతం నమోదవుతున్న చాలా సైబర్ క్రైమ్ లలో అధిక శాతం ఇలా జరిగినవే.

కరోనా విషయంలో మీరు గుర్తుచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

10. Help Line

మీ ఆరోగ్యం గురించి మీకు ఏదైనా అనుమానంగా అనిపిస్తే, వారి వారి రాష్ట్రాన్ని బట్టి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రభుత్వ వెబ్ సైట్ మరియు హెల్ప్ లైన్ మాత్రమే సంప్రదించండి.

తెలంగాణా : https://covid19.telangana.gov.in/

ఆంధ్రప్రదేశ్ : https://www.facebook.com/ArogyaAndhra/