నిన్న లాంచ్ అయిన కంపెని ఫ్లాగ్ షిప్ మోడల్ టోటల్ 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉన్న ధరలలో లాంచ్ అవటం మంచి విషయం అని చెప్పాలి. 21 వేల స్టార్టింగ్ ప్రైస్ తో విడుదలైన Mi 5 ఇండియాలో కూడా ధరను competitve గా పెట్టి త్వరలోనే రిలీజ్ చేస్తుంది అని రిపోర్ట్స్. Mi 5 indepth ఇమేజెస్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
5.15 in 1920x1080-pixel resolution డిస్ప్లే తో సైడ్ బెజేల్స్ ను బాగా సన్నగా ఇచ్చింది కంపెని. పైన ఫ్రంట్ సైడ్ 4MP అల్ట్రా పిక్సెల్ కెమెరా ఉంది. ఇది theortical గా తక్కువ లైటింగ్లో కూడా మంచి ఫోటోస్ ను తీయాలి.
మెటల్ గ్లాస్ బిల్డ్ తో వస్తుంది. గతంలో కంపెని నోట్ ప్రో(ఇండియాలో రిలీజ్ కాలేదు) మోడల్ కు ఇలాంటి బిల్డ్ ఇచ్చింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తున్న మొదటి ఫ్లాగ్ షిప్ మోడల్ ఇదే Xiaomi నుండి. ఫ్రంట్ లో ఉండటం వలన అదే ఫింగర్ ప్రింట్ బటన్ home బటన్ గా కూడా ఉపయోగించవచ్చు.
3GB తో వస్తున్న రెండు వేరియంట్స్ గ్లాస్ బాడీ తో వస్తే, 4GB ర్యామ్ వేరియంట్(Mi 5 PRO) ఫ్రంట్ లో cermaic బాడీ కలిగి ఉంది. 3GB ర్యామ్ వేరియంట్స్ 32 అండ్ 64 ఇంబిల్ట్ storages తో వస్తే 4GB మోడల్ 128gb తో వస్తుంది.
4 axis OIS, PDAF అండ్ DTI (pixel-to-pixel isolation) ఇమేజ్ enhancement ఫీచర్స్ ను సపోర్ట్ చేస్తూ సోనీ IMX298 సెన్సార్ కలిగిన 16MP రేర్ కెమెరా ఉంది దీనిలో.
కెమెరా ఇంటర్ ఫేస్ సేమ్ MIUI 7 పై రన్ అవుతున్న డివైజెస్ వలె ఉంది. Mi 5 కూడా MIUI 7 పైనే రన్ అవుతుంది.
MIUI 7 ఓస్ ఉన్నప్పటికీ Mi 5 మాత్రం లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ మార్ష్ మల్లో 6.0 పై రన్ అవుతుంది.