Huawei సబ్ బ్రాండింగ్ హానర్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 4X కు 5X పేరుతో నెక్స్ట్ కొత్త మోడల్ ను లాంచ్ చేసింది. అయితే ఇది ఇండియాలో జనవరి 28 న రిలీజ్ అవనుంది ఇంకా. చైనాలో ఆల్రెడీ లాంచ్ అయ్యింది. దీనిని మేము వాడటం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ యొక్క close లుక్స్ ను పరిశిలించటం తో పాటు ఫోన్ పై మా మొదటి అభిప్రయాలను తెలుసుకోండి. క్రిందకు స్క్రోల్ చేయండి.
“No Nonsense” అనే టాగ్ లైన్ తో ఈ మోడల్ ను రిలీజ్ చేసింది కంపెని. అంటే అర్థంలేని స్పెసిఫికేషన్స్ ను ఇచ్చి ఆకర్షించటం వంటివి చేయని motto తో వస్తుంది హానర్ 5X.
KEY స్పెక్స్:
డిస్ప్లే: 5.5 అంగుళాల, 1920x1080
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 616
RAM: 2GB
స్టోరేజ్: 16GB ఇంబిల్ట్ అండ్ SD కార్డ్ సపోర్ట్: 128GB
కెమెరా: 13MP ప్రైమరీ కెమెరా, 5MP సెకండరీ కెమెరా
బ్యాటరీ: 3,000 mAh
డిస్ప్లే
హానర్ 5X IPS LCD ప్యానల్ ఫుల్ HD with 401PPi కలిగి ఉంది. స్క్రీన్ బ్రైట్ అండ్ షార్ప్ గా ఉంది. గ్రేట్ వ్యూయింగ్ angles కూడా. outdoor లోకి వస్తే డైనమిక్ కాంట్రాస్ట్ ratio ను పెంచే విధంగా enhancing తో వస్తుంది.
కెమెరా:
సింగిల్ led ఫ్లాష్ తో f/2.0 తో ఫోన్ లో 13MP రేర్ కెమెరా ఉంది. ఫోటోస్ బాగున్నాయి. ఫ్రంట్ లో 5MP f/2.4 - 22mm వైడ్ angle లెన్స్ కెమెరా ఉంది. స్మార్ట్ ఇమేజ్ 3.0 ఇమేజ్ processing టెక్నాలజీ వలన ఫోటో క్వాలిటీ లో అదనంగా ఏమైనా ఉందా అనేది రివ్యూ లో చెబుతాము.
లెఫ్ట్ సైడ్ లో రెండు స్లాట్స్ ఉన్నాయి. ఒకటి సిమ్ కార్డ్, మరొకటి SD కార్డ్. సెకెండ్ సిమ్ కు వేరే స్లాట్ ఉంది. అంటే 3 - slot డిజైన్ తో వస్తుంది. హై బ్రిడ్ సిమ్ స్లాట్ కాదు. 128gb వరకు sd కార్డ్ expand చేయగలరు. రెండు సిమ్ లలో 4G సపోర్ట్ ఉంది.
రైట్ సైడ్ వాల్యూం బటన్స్ మరియు పవర్ బటన్ ఉంది. ఎవరేజ్ tactile ఫీడ్ బ్యాక్ ఇస్తున్నాయి బటన్స్. ప్రెజర్ ఎక్కువ పెట్టనవసరం లేదు. పొజిషన్ కూడా పర్ఫెక్ట్ సింగిల్ హ్యాండ్ తో వడగలిగేలా. బటన్స్ పై texture కూడా ఉంది గ్రిప్ కొరకు.
ఫింగర్ ప్రింట్ స్కానర్
బ్యాక్ సైడ్ కెమెరా module క్రింద ఉంది. ఫింగర్ ప్రింట్ ను సెట్ అప్ చేయటానికి 6 సార్లు టాప్ చేయటం జరిగింది. కాని అన్ లాక్ చేయటానికి pressure కావలి. ఎందుకంటే లైట్ టచ్ చేస్తే సరిపోవటం లేదు సెన్సార్ మీద. ఇమేజెస్ తీయటానికి కూడా పనిచేస్తుంది. నోటిఫికేషన్స్ ను స్క్రోల్ చేయటానికి కూడా. ఇంకా కొన్ని hidden ట్రిక్స్ ఉన్నాయి. డబుల్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ ఉంది ఫింగర్ స్కానర్ కు. ఇది సేఫ్టీ కోసం.
బ్యాటరీ
3000 mah బ్యాటరీ ఉంది దీనిలో. కంపెని ప్రకారం ఒక రోజు వస్తుంది. స్మార్ట్ పవర్ 3.0 బ్యాటరీ సేవింగ్ మోడ్ వలన ఇది సింగిల్ చార్జ్ లో ఎక్కువ సేపు ఉంచేలా చేస్తుంది. నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఇది. టెస్టింగ్ చేయాలి ఇంకా.
డిజైన్:
5.5 in డిస్ప్లే వలన slight గా bigger గా ఉంది form factor. బెజేల్స్ మాత్రం వీలైనంత వరకూ సన్నగా, మినిమల్ గా డిజైన్ చేసింది. అల్యూమినియం alloy కేసింగ్ మరియు మెటాలిక్ brushed అల్యూమినియం బ్యాక్ సర్ఫేస్ తో డిజైన్ అయ్యింది. ఫోన్ బ్యాక్ సైడ్ మాత్రం టాప్ అండ్ బాటం భాగాలలో ప్లాస్టిక్ ఉంది. ఇది antennas ను మూసివేయకుండా ఉంచటానికి.
ఇంటర్ఫేస్:
లాలిపాప్ 5.1 వెర్షన్ తో వస్తుంది రెగ్యులర్ ఎమోషన్ యూజర్ ఇంటర్ఫేస్ తో వస్తుంది. దీనిలో EM UI 3.1 ఉంది. స్మూత్ గా ఉంది UI. కెమెరా యాప్ చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. యాప్స్ switching కూడా ఫాస్ట్ కాని సెట్టింగ్స్ ను స్క్రోల్ చేస్తుంటే లాగ్ అవుతుంది స్క్రోల్లింగ్. గేలరీ యాప్ కూడా సేమ్.
ఫోన్ క్రింది భాగంలో రెండు స్పీకర్ గ్రిల్స్ మధ్యన మైక్ర్రో usb కనెక్టర్ ఉంది. స్పీకర్స్ సౌండ్ ను టెస్ట్ చేయటానికి మాత్రం కుదరలేదు ఇంకా. 3.5MM ఆడియో జ్యాక్ పైన ఉంది. బిల్ట్ in amplifier తో వస్తుంది సుపీరియర్ ఆడియో క్వాలిటీ కొరకు. ఇండియాలో దీని ప్రైసింగ్ పై ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఇండియాలో జనవరి 28 న రిలీజ్ కానుంది. కాని చైనాలో రిలీజ్ అయ్యింది ఆల్రెడీ.