రిలయన్స్ jio కి ఇంకే టెలికాం కంపెనీ సాటిరాదని తేల్చిచెప్పింది. jio ప్రైమ్ తరువాత సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ ను ఎంటర్ చేసి మరో 3 నెలలు తన సేవలను ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి రూ.303తో రీచార్జ్ చేసుకుంటే జూన్ చివరి వరకు ఉచిత సేవలు పొందవచ్చని బంపర్ ఆఫర్ ప్రకటించింది.
అయితే ఇప్పుడు BSNL కూడా నేనేమి తక్కువ కాదన్నట్లు ఇటువంటి ఆఫర్‌నే ప్రకటించింది. ఇదే బాటలో ఐడియా కూడా నడుస్తుంది. ప్రత్యేక
ప్రత్యేక రీఛార్జీలతో తమ పోస్ట్ పెయిడ్ 4జీ మొబైల్ వినియోగదారులకు రోజుకి 1జీబీ 4జీ డాటాను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
300 రూపాయలు యాడ్ ఆన్ ప్యాక్‌తో రోజుకు 1 జీబీ చొప్పున నెల రోజుల పాటు 4జీ డేటాను యూజర్స్ కి అందివ్వనున్నట్లు ఐడియా పేర్కొంది.మరియు
349 రూపాయలు లేకపోతే దానికంటే ఎక్కువ రెంటల్ ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ. 50 ఎక్సట్రా గా పే చేసి మూడు నెలలపాటు ఈ ఆఫర్‌ను పొందవచ్చని కూడా తెలిపింది.
మరియు మూడు నెలల తరువాత మార్చి 2018 వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ కనుక మీకు కావాలంటే రూ.199-రూ.349 మధ్యప్లాన్లో ఎక్సట్రాగా రూ.200, రూ.349- రూ.498 మధ్య ప్లాన్‌లో ఎక్సట్రాగా రూ.50 పే చేస్తే చాలు .
అంటే ఈ నెల ముప్పై వరకు తమ యూజర్స్ ఈ రీచార్జ్ చేసుకుంటే బెనిఫిట్స్ పొందుతారని తెలిపింది. ఈ ఆఫర్ ఎవరిదగ్గరైతే 4జీ హ్యాండ్సెట్లు వుంటాయో వారికి మాత్రమే .
మరియు మరొక విషయం , రూ.349- రూ.498ల మధ్య రెంటల్ ప్లాన్ లో రూ.50 డిస్కౌంట్ ను మరియు రూ.149-రూ.349 రెంటల్ ప్లాన్ పై సబ్ స్క్రైబ్ అయిన వారికి రూ.100 డిస్కౌంట్ ఇస్తున్నట్లు సమాచారం
ఎలాంటి ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా jio తన ప్రస్థానాన్ని చాటుకుంటూనే'
వుంది.