Hyve అనే కొత్త ఇండియన్ కంపెని మార్కెట్ లో 17,999 రూ లకు 4GB రామ్ తో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీనికి ముందు ఆల్రెడీ కంపెని రెండు బడ్జెట్ ఫోనులను కూడా రిలీజ్ చేసింది. దీని స్పెక్స్ చూస్తె Lenovo Z2 Plus, Xiaomi Mi Max అండ్ Asus ZenFone 3 Max ఫోనులతో కాంపిటేషన్ అయ్యేటట్లుగా ఉంది. మరిన్ని డిటేల్స్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.
5.7-inch పెద్ద డిస్ప్లే decent వ్యూయింగ్ angles తో 73% screen-to-body ratio కలిగి ఉంది. అయితే డిస్ప్లే చుటూ బోర్డర్స్ లో బ్లాక్ కలర్ బార్ ఒకటి ఉంది. ఇది పర్సనల్ గా నచ్చలేదు. మీరు ఫోటో లో దానిని గమనించగలరు.
ఫోన్ కు చుటూ మెటల్ బాడీ ఉంది. వెనుక sand-blasted chamfered edges ఉన్నాయి. చేతిలో పట్టుకుంటే మంచి ఫీల్ ఇస్తుంది ఫోన్. అయితే మెటల్ డిజైన్ ఇంత కన్నా తక్కువ ప్రైస్ లోని ఫోనుల్లో కూడా ఉంది.
ఫోన్ అడుగ భాగంలో ప్లాస్టిక్ ఉంది. ఇది నెట్ వర్క్ ను బాగా రిసీవ్ చేసుకోవటానికి. అయితే ఇది scratches కు అనువుగా ఉంది.
ఫ్రంట్ లో 8MP కెమెరా ఉంది. ఇది ఫ్రంట్ ఫ్లాష్ తో వస్తుంది.
Hyve Pryme లో13MP కెమెరా ఉంటుంది వెనుక. దీనిలో PDAF 4K వీడియో షూటింగ్ సపోర్ట్ ఉంటుంది. కంపెని ప్రకారం ఇది గ్రేట్ Low లైట్ ఫోటోస్ ఇస్తుంది.
స్క్రీన్ సైజ్ పెద్దగా ఉండటం వలన ఫోన్ పెద్దది గా ఉంది. కచ్చితంగా సింగిల్ హ్యాండ్ లో అయితే ఫోన్ ను వాడటం కష్టం.