బ్యాంకాక్ లో జరిగిన తాజా ఈవెంట్ లో Huawei కంపెని ఎసేండ్ సిరిస్ లో మూడు ఫోన్ లను లాంచ్ చేసింది. ఇవి ఇండియాకి కుడా లాంచ్ అవనున్నాయి. ఈ మెటల్ క్లాడ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఇమేజెస్ ఇక్కడ చూడగలరు.
Huawei P8 లో మంచి మెటల్ ను బిల్డ్ క్వాలిటి లో ఉపయోగించారు. మ్యాటి ఫినిషింగ్ ఉన్న డివైజ్ ప్రీమియం ఫీల్ ను ఇస్తుంది. చాలా లైట్ బరువు తో ఉన్న ఈ ఫోన్ 6.4 mm మందంతో వస్తుంది.
5.2 in 1080P డిస్ప్లే కలిగిన ఇది 2k డిస్ప్లే వలె షార్ప్ నేస్ ను ప్రదర్శిస్తుంది.
13MP ఉన్న కెమేరా లో ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ ఉంది. కాని వైడ్ అపెర్చార్ మోడ్ లేదు.
8MP ఫ్రంట్ కెమేరా తో Huawei P8 సేల్ఫీ లవర్స్ కు పెద్ద ఆఫర్ ను ఇచ్చింది.
Huawei తన సొంత 2.2 GHz ఆక్టో కోర్ కిరిన్ 930 ప్రాసెసర్ పై నడవనుంది. 3జిబి ర్యామ్, 16/64 జిబి స్టోరేజ్ ఆప్షన్స్ తో వస్తుంది మొబైల్.
Huawei సొంత ఎమోషన్ యూజర్ ఇంటర్ఫేస్ 3.0 ను ఆండ్రాయిడ్ 5.0.2 తో ఇందులో జతపరిచింది.
2680mah బ్యాటరీ కొంచెం నిరాశ కలిగించింది. ఎందుకంటే కిరిన్ SoC ల పై మంచి బ్యాటరీ లైఫ్ మేము పరీక్షించిన ఫోన్లలో ఇప్పటి వరకూ చూడలేదు. ఇది అయినా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను ఇస్తుంది ఏమో వేచి చూద్దాం.
రౌండేడ్ ఎడ్జెస్ వలన ఇది సోని ఫోనులను గుర్తుచేస్తుంది. కాని ఎక్కడా గ్లాస్ కాకుండా మెటల్ ను ఉపయోగించడం వలన ఇది ఇంకా బాగుంది అని చెప్పాలి.
Huawei P8 4జి కనెక్టివిటి ని ఇస్తుంది,
Huawei P8 ఎక్కువ కలర్స్ లలో లభించటం లేదు.
P8 మోడల్ కి ఈ కేసెస్ ను కూడా మార్కెట్ లోకి కంపెనీయే విడుదల చేస్తుంది.
ఓవర్ ఆల్ గా Huawei P8 నిజంగా ఒక ప్రీమియం లుక్ తో మంచి కెమేరా తో, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ను ఇచ్చేలా కనిపిస్తుంది. త్వరలో దీని పూర్తి రివ్యూ చూద్దాం. ఫోన్ ధర 30,000 రూ. ధర కొంచెం ఎక్కువ.