HTC వన్ సిరిస్ లో గత నెల ఏప్రిల్ లో HTC M9 + ను విడుదల చేసింది. HTC ఫ్లాగ్ షిప్ మోడల్స్ వాలే ఇది కూడా అదే డిజైన్ తో వస్తుంది. అయితే దీనిలో మాకు ప్రత్యేకంగా కనిపించిన విషయం ఏంటంటే, మీడియా టెక్ హేలియో X10 ప్రాసెసర్. దీనిపై త్వరలో మనం లోతుగా రివ్యూ చూద్దాం. అప్పటిదాకా htc M9+ ఇమేజెస్ ను ఇక్కడ చుడండి.
మెటాలిక్ షైన్ ఉన్న ఈ ఫోన్ htc ముందటి ఫోన్ల మాదిరిగానే లుక్స్ ఉన్నాయి. కాని దిని షైనింగ్ చాలా ప్రీమియం గా ఉంది.
htc డ్యూయల్ టోన్ డిజైన్ అని కొత్తగా డిజైన్ ను దించింది. ఇది ఫోన్ సైడ్స్ లో కనపడుతుంది. కొంచెం పట్టుకోవటానికి అప్పుడప్పుడు చేతికి ఇబ్బంది గా అనిపిస్తుంది, కాని ప్రీమియం లుక్ మాత్రం సూపర్.
వెనుక 20MP కెమేరా తో పాటు 2.1 MP డ్యుయో-కెమేరా సెట్ అప్ ఉంది.
4MP అల్ట్రా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా తో వస్తుంది htc M9 ప్లస్.
ముందు చెప్పినట్టు MediaTek MT6795T octa-core 64-bit SoC పై, 2.2 GHz మీడియా టెక్ హేలియో x10 క్లాక్ స్పీడ్ పనిచేస్తుంది ఈ ఫోన్. మరియు 3జిబి ర్యామ్ ఇందులో జోడించింది కంపెని.
htc M9 ప్లస్ లో 2840mah బ్యాటరీ ను వాడారు.
ఆండ్రాయిడ్ 5.5.2 ఆదారిత htc సెన్స్ వెర్షన్ 7 పై నడవనుంది ఫోన్. కంపెని బ్లింక్ ఫీడ్ ui లో కొన్ని సరికొత్త ఫీచర్స్ రానున్నాయి.
htc ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏడ్ చేయడం వలన ఇది క్రింది బాగంలో ఐ ఫోన్ మాదిరిగా ఒక బటన్ ను జోడించింది.
32జిబి ఇంటర్నెల్ స్టోరేజి. 128జిబి ఎక్స్పాన్డబాల్ స్టోరేజి దీని సొంతం.
ఫోన్ బరువు 168 గ్రాములు. 9.6MM మందం. కర్వ్ద్ డిజైన్.
5.2 ఇంచ్ QHD సూపర్ LCD3 డిస్ప్లే దిని సొంతం. మోస్ట్ బ్యాలన్సేడ్ 2K డిస్ప్లే లలో ఇదొకటి.
అవును, ఇది 4G తో వస్తున్న మోడల్. లుక్స్ వైజ్ గా ఈ ఫోన్ చాలా బాగుంది. కాని కొంచెం పెద్దదిగా ఉంది. మొదటి నుండి htc కామ్పెక్ట్ డిజైన్ లలో ఎందుకో ఇష్టం చూపించలేదు. 5.2 అంగుళాలలో స్క్రీన్ సైజ్ లో చాలా ఫోన్లు దీని కన్నా తక్కువ బిల్డ్ సైజ్ లో వచ్చాయి. అయితే ఫోన్ పెర్ఫార్మెన్స్ ను ఎలా ఇస్తుంది అని మాకు ఆసక్తిగా ఉంది. త్వరలో పెర్ఫార్మెన్స్ రివ్యూ పోస్ట్ చేస్తాము.