Jio సిమ్ ను డైరెక్ట్ గా 2G, 3G ఫోనుల్లో వేసి Jio ఇంటర్నెట్ లేదా వాయిస్ కాల్స్ అనేవి వాడటం జరగని పని టెక్నికల్ గా. ఇదే విషయం లేటెస్ట్ గా వచ్చిన ఇలాంటి రూమర్ విషయం లో కూడా తెలియజేయటం జరిగింది. కాని ఒక మెథడ్ ద్వారా వాడుకోవచ్చు. మరిన్ని డిటేల్స్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి. గమనిక: ఇది మీలో కొంతమందికి తెలిసిన విషయమే అయ్యుండొచ్చు కాని తెలియని వారు చాలామంది రోజూ మెసేజెస్ చేస్తున్నారు, సో అలాంటి వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది అని వ్రాయటం జరిగింది.
Jio ఫ్రీ సర్వీసెస్(unlimited కాల్స్, ఇంటర్నెట్ etc)... మీ 2G/3G ఫోనుల్లో వాడుకోవాలంటే అది కేవలం JioFi అని పిలవబడే WiFi hotspot/రూటర్ వలనే కుదురుతుంది. Hotspot కొంటె కంపెని Jio సిమ్ ఇస్తుంది. అందరిలానే ఈ సిమ్ తో కూడా ఫ్రీ సర్వీసెస్ వస్తాయి.
సో సిమ్ ను డివైజ్(WiFi హాట్ స్పాట్, JioFi) లో వేసి, WiFi వలే ఉపయోగించుకోగలరు. అంటే ఇది ఇప్పుడు WiFi ద్వారా 10 నుండి 15 WiFi డివైజ్ లకు ఇంటర్నెట్ ను అందించగలదు. కనెక్ట్ చేయదలచుకున్న డివైజెస్ లో WiFi ఫీచర్ ఉంటే చాలు... 4G, VoLTE లేకపోయినా ఫర్వాలేదు.
ఇప్పుడు మీ 2G/3G ఫోనులో WiFi on చేస్తే మీ JioFi నెట్ కనిపిస్తుంది. దానికి కనెక్ట్ చేసి ఇంటర్నెట్ ను వాడుకోగలరు.
అలాగే నెట్ తో పాటు unlimited వాయిస్ కాలింగ్ కూడా ఎంజాయ్ చేయగలరు ఈ JioFi WiFi ద్వారా ఇంటర్నెట్ సిగ్నల్ ఉన్నంతసేపు..
ఇందుకు ఫోన్ లో Jio4G వాయిస్ కాలింగ్ యాప్ ఇంస్టాల్ చేసుకొని, యాప్ ఓపెన్ చేసి దాని నుండి కాల్స్ చేయాలి ప్రతీసారి.
Jio 4G యాప్ ను ఎలా యాక్టివేట్ చేయాలి?
ఈ లింక్ నుండి యాప్ ను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే, మీకు OTP ఎంటర్ చేయమని అడుగుతుంది డైరెక్ట్ గా. ఈ OTP మీరు సిమ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన సెకండ్/Alternative ఫోన్ నంబర్ కు వెళ్తుంది. మీరు ఏ నంబర్ ఇచ్చారో గుర్తుకు తెచ్చుకొని, ఆ ఫోన్ లో ఆ సిమ్ కు OTP వచ్చి ఉంటుంది. దానిని ఇక్కడ ఎంటర్ చేస్తే వాయిస్ కాలింగ్ యాప్ యాక్టివేట్ అయినట్లే. మీరు ప్రతీ సారి కాల్స్ చేయదలచుకున్నప్పుడు ఈ యాప్ ను ఓపెన్ చేసి చేయాలి కాల్స్.
ఇప్పుడు 1977 కు కాల్ చేసి వాయిస్ కాల్స్ చేసుకునేందుకు సిమ్ ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇందుకు రెగ్యులర్ ప్రాసెస్ వర్తిస్తుంది. ఆల్రెడీ JioFi వేసిన తరువాత యాక్టివేషన్ చేసేది కేవలం ఇంటర్నెట్ కొరకు, ఇప్పుడు చేసే యాక్టివేషన్ కాల్స్ కొరకు.
మీకు వచ్చే ఒక డౌట్: WiFi సిగ్నల్ లో ఉన్నప్పుడే కాల్స్ అండ్ ఇంటర్నెట్ వాడుకోగలమా? అవును. కాని దీనికి ఒక పరిష్కారం ఉంది.
పరిష్కారం:
JioFi డివైజ్ రెండు మూడు మోడల్స్ లో రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి సొంతంగా ఇంబిల్ట్ బ్యాటరీ తో వస్తుంది. సో దానిని మీ పాకెట్ లో వేసుకొని, మీరు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ కాల్స్ అండ్ ఇంటర్నెట్ ను ఆనందించగలరు.
JioFi ప్రైస్ : 1,999 rs - బయింగ్ లింక్. అదనంగా JioFi డివైజ్ గురించి తెలుసుకోవటానికి ఈ లింక్ లో కంప్లీట్ రివ్యూ చూడగలరు.
గతంలో రిలయన్స్ Jio కు సంబంధించి చాలా ఆర్టికల్స్ వ్రాయటం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నవారు లింక్స్ క్రింద చూడగలరు...
1. Unlimited ఇంటర్నెట్ అండ్ కాలింగ్ కలిగిన రిలయన్స్ Jio SIM కంప్లీట్ ఇన్ఫర్మేషన్
2. welcome offer complete questions and answers
3. రిలయన్స్ Jio లోని Welcome offer, మార్చ్ 2017 వరకూ పనిచేస్తుంది అనే వార్త ఎలా వచ్చింది?
4. welcome ఆఫర్ ముందుగా తెలిపిన డేట్ కన్నా ముందే ముగిసిపోతుంది.
5. వాట్స్ అప్ & సోషల్ నెట్ వర్కింగ్ లో Jio పై రన్ అయిన రూమర్స్ లోని నిజాలు
6. Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా (tested)