Aadhaar Update: ఎలాంటి ప్రూఫ్ అవసరంలేకుండా మొబైల్ నంబర్ అప్డేట్

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Dec 22 2020
Aadhaar Update: ఎలాంటి ప్రూఫ్ అవసరంలేకుండా మొబైల్ నంబర్ అప్డేట్

ఆధార్ నంబర్ అనేది భారత ప్రభుత్వం జారీ చేసిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఐరిస్ స్కాన్, వేలిముద్ర వంటి వ్యక్తి యొక్క బయోమెట్రిక్ సమాచారం మరియు DOB మరియు ఇంటి చిరునామా వంటి జనాభా సమాచారం మీద ఇది జారీ చేయబడుతుంది. ఇక్కడ మీరు ప్రత్యేక వివరాలు ఇవ్వాలి, అందులో ఒకటి మీ మొబైల్ నంబర్.

Aadhaar Update: ఎలాంటి ప్రూఫ్ అవసరంలేకుండా మొబైల్ నంబర్ అప్డేట్

ఆధార్ కార్డు మరియు ఓటరు కార్డు మరియు పాన్ కార్డ్ వంటివి చాలా అవసరమైన పత్రాలు. మీరు దేశంలో ఎక్కడైనా మీ ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు. అందుకే,  ఆధార్ కార్డుతో మీ లేటెస్ట్ మొబైల్ నంబర్‌ను జోడించడం చాలా ముఖ్యం.

Aadhaar Update: ఎలాంటి ప్రూఫ్ అవసరంలేకుండా మొబైల్ నంబర్ అప్డేట్

ఏదైనా కారణం చేత మీ మొబైల్ నంబర్ బ్లాక్ చేయబడినా లేదా దొంగిలించబడినా, మీ ఆధార్ కార్డులోని మొబైల్ నంబర్‌ను ఎలా మార్చవచ్చు .

Aadhaar Update: ఎలాంటి ప్రూఫ్ అవసరంలేకుండా మొబైల్ నంబర్ అప్డేట్

ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్ చెయ్యడం

ఆధార్‌ను అప్డేట్ గా ఉంచడం ప్రయోజనకరంగా ఉండటమే కాదు, అనేక ఆన్‌లైన్ సేవలకు కూడా ఇది అవసరం. ఆధార్ సంబంధిత ఆన్‌లైన్ సేవలను పొందడానికి మీరు మొదట మీ మొబైల్ నంబర్‌ను UIDAI తో నమోదు చేసుకోవాలి, ఇది OTP ద్వారా ప్రామాణీకరించబడుతుంది.

Aadhaar Update: ఎలాంటి ప్రూఫ్ అవసరంలేకుండా మొబైల్ నంబర్ అప్డేట్

ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డు మొబైల్ నంబర్‌ను ఎలా మార్చాలి

వాస్తవానికి, ఆధార్ మొబైల్ నంబర్‌ను ఆఫ్‌లైన్‌లో మాత్రమే మార్చవచ్చు. ఎందుకంటే, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి UIDAI కి ఆన్‌లైన్ వ్యవస్థని నిలిపివేసింది . అయితే, మీరు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మీ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇది చేయటానికి మీ ప్రస్తుత మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో నమోదు చేసుకోవాలి.

Aadhaar Update: ఎలాంటి ప్రూఫ్ అవసరంలేకుండా మొబైల్ నంబర్ అప్డేట్

OTP ద్వారా ఆధార్ కార్డులో మొబైల్ నంబర్‌ అప్‌డేట్

  • మొదట అధికారిక ఆధార్ పోర్టల్ https://ask.uidai.gov.in/ ను తెరవండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు క్యాప్చాతో లాగిన్ అవ్వండి. అన్ని వివరాలు ఇచ్చిన తరువాత, SEND OTP ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు కుడి వైపున ఉన్న పెట్టెలోని OTP ని పూరించండి మరియు సబ్మిట్ OTP ఎంపికపై క్లిక్ చేయండి.

Aadhaar Update: ఎలాంటి ప్రూఫ్ అవసరంలేకుండా మొబైల్ నంబర్ అప్డేట్

ఇప్పుడు తరువాతి పేజీలో మీరు ఆధార్ సర్వీసెస్ కొత్త నమోదు మరియు అప్డేట్ ఆధార్ ఎంపికలను చూడవచ్చు, ఇక్కడ క్లిక్ చేయండి ఆధార్ అప్డేట్ చేయండి.

తరువాత స్క్రీన్‌లో పేరు, ఆధార్ నంబర్, రెసిడెన్షియల్ టైప్ మరియు మీరు అప్‌డేట్ చేయదలిచిన కొన్ని ఎంపికలు మీకు కనిపిస్తాయి.

Aadhaar Update: ఎలాంటి ప్రూఫ్ అవసరంలేకుండా మొబైల్ నంబర్ అప్డేట్

ఇక్కడ తప్పనిసరి ఎంపికలను పూరించండి మరియు ‘what do you want to update’ విభాగంలో మొబైల్ నంబర్‌ను ఎంచుకోండి.

తరువాతి పేజీలో మీ మొబైల్ నంబర్ మరియు కాప్చా అడుగుతారు. అన్ని ఫీల్డ్‌లను పూరించండి మరియు Send OTP పై క్లిక్ చేయండి. మొబైల్ OTP ని ఎంటర్ చేసి ప్రాసెస్ పై క్లిక్ చేయండి.

మీరు ఇచ్చిన అన్ని వివరాలను ఒకసారి తనిఖీ చేసి, Submit బటన్ పై క్లిక్ చేయండి.

Aadhaar Update: ఎలాంటి ప్రూఫ్ అవసరంలేకుండా మొబైల్ నంబర్ అప్డేట్

మీరు అపాయింట్‌మెంట్ ఐడితో సక్సెస్ స్క్రీన్ పొందుతారు. Book Appointment ఎంపికపై క్లిక్ చేసి, ఆధార్ నమోదు కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోండి.

Aadhaar Update: ఎలాంటి ప్రూఫ్ అవసరంలేకుండా మొబైల్ నంబర్ అప్డేట్

OTP లేకుండా మొబైల్ నంబర్‌ అప్‌డేట్

ఆధార్ నమోదు లేదా అప్డేట్ కేంద్రానికి వెళ్లండి.

ఆధార్ అప్డేట్ ఫారమ్ నింపండి.

ఇప్పుడు మీ ప్రస్తుత మొబైల్ నంబర్‌ను ఫారమ్‌లో నింపండి.

మీరు పాత మొబైల్ నంబర్‌ను ఫారమ్‌లో ఇవ్వనవసరం లేదు.

ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మీ అభ్యర్థనను నమోదు చేస్తారు.