రిటేయిల్ స్టోర్స్ లో TV లను కొనే ముందు అక్కడే, షాప్ లో మీరు టెస్ట్ చేయవలిసిన విషయాలను మీ కోసం చిన్నగా అర్థం అయ్యేలా అందిస్తున్నా. చూడండి. టిప్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి(మొబైల్ లో).
Fast ఏక్షన్ మూవీ scenes ఉన్న సినిమా క్లిపింగ్స్, స్పోర్ట్స్ క్లిప్స్, డార్క్ సన్నివేశాలలో జరిగే సినిమా క్లిపింగ్స్ వంటివి సేకరించి పెన్ డ్రైవ్ లో వేసుకొని వెళ్లండి షాప్ కు. రెండు మూడు పెన్ డ్రైవ్ లు పట్టుకుని వెళితే ఒకే సారి ఒకే కంటెంట్ ఏ టీవీ లో బాగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకోగలరు.
ముందుగా టీవీ లోని సెట్టింగ్స్ అన్ని డిఫాల్ట్ గా పెట్టండి. బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ వంటివి 50% లో పెట్టండి. ఇప్పుడు టీవీ లోని ఎక్స్ట్రా ఫీచర్స్ (మోషన్ కంట్రోల్, డైనామిక్ కాంట్రాస్ట్, డైనామిక్ depth, etc..) వంటివి off చేసి ఉంచండి.
ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ లో ఇంతకుముందు చెప్పిన డిఫరెంట్ మూవీ క్లిప్స్ ను ప్లే చేయండి టీవీ లో. ఏ టీవీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడండి. కలర్ రిప్రోడక్షన్ చెక్ చేయండి. అవసరం అనుకుంటే అవి ప్లే అవుతున్నప్పుడు మంచి సెల్ ఫోన్ కెమెరా తో ఫోటోలు తీసి పెట్టుకోండి. తరువాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు వాటిని రిఫెర్ చేసుకోవచ్చు. టీవీ లలో షాప్ వాళ్లు లేదా టీవీ కంపెని వాళ్లు వేసే డెమో క్లిపింగ్స్ యొక్క రిపీట్ అయ్యే స్పీడ్ ను కంపేర్ చేసుకోకండి. ఈ టీవీ లో ముందే వచ్చేసింది ఈ డెమో క్లిప్, ఆ టివి లో ఇంకా రాలేదు. సో ఈ టివి ఫాస్ట్ గా ఉందనే అభిప్రాయాలు తప్పు.
టివి ని SD (స్టాండర్డ్ డెఫినిషన్), అంటే HD కానిది, మోడ్ లో పెట్టి sd కంటెంట్ ను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడండి . ఇమేజ్ ప్రోసెసింగ్ మరియు upscaling ఇమేజేస్ రెగ్యులర్ టీవీ కంటెంట్ క్వాలిటీ లో పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి.
టీవీ ని గదిలో ఎక్కడ కూర్చొని చూస్తున్నా ఒకేలా కలర్స్ ఏమీ ఫేడ్ అవ్వకుండా కనిపిస్తుందా లేదా చూడాలి. దీనిని వ్యూయింగ్ ఏంగిల్స్ అంటారు.
టీవీ లో స్మార్ట్ ఫోన్ తో అనుసంధానం చేసే ఫీచర్స్ ఉన్నయోమే చూసి, మీ స్మార్ట్ ఫోన్ ను అక్కడికక్కడే కనెక్ట్ చేసి synchronize చేసి కంటెంట్ ఫ్రేం డ్రాప్స్ మరియు లాగ్స్ వంటి స్పీడ్ ను గమనించండి.
ఒక సాలిడ్ కలర్ ఉన్న ఇమేజెస్ ను పెన్ డ్రైవ్ లో పెట్టుకుని టీవీ లో కనెక్ట్ చేసి ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ బ్రైట్ కలర్ డిస్ప్లే లో టీవీ backlight లో ఏమైనా వైట్ patches uneven ప్యానల్ లైటింగ్ మరియు డార్క్ స్పాట్స్ వంటివి దగ్గరికి వెళ్లి గమనించండి. డార్క్ మూవీ scenes ఉన్న క్లిప్పింగ్ లను వేసి స్క్రీన్ edges లో వైట్ లేదా ఇతర కలర్స్ లో డిఫరెంట్ లైటింగ్ వస్తుందా ఏమో చూడండి. వస్తే వాటిని తీసుకోవద్దు. దీనిని backlight bleeding అని అంటారు.
తక్కువకి వచ్చే 4K రిసల్యుషణ్ TV లు మంచివి కావు
వీటిలో స్క్రీన్ ప్యానల్స్ కేవలం 30Hz లో 4K ను చూపిస్తాయి. ఇది వీడియో ప్లే బ్యాక్ ను 30 Hz రిఫ్రెష్ రేట్ పర్ సెకెన్ ను పరిమితం చేస్తుంది. ఫాస్ట్ గా ఉండే డిస్ప్లే కంటెంట్ చూస్తున్నప్పుడు ఇవి చాలా పూర్ క్వాలిటీతో కనిపిస్తాయి. ఎటువంటి LED టీవీ కి అయినా మినిమమ్ 50/60 Hz రిఫ్రెష్ రేట్ ఉండాలి. ఇది అన్ని రిసల్యుషణ్స ను సపోర్ట్ చేస్తుంది.
3D గురించి పట్టించుకోకండి
3D కోసం కంపెని ఎక్స్ట్రా డబ్బులు వేసి అమ్మక పొతే నే దాని గురించి ఆలోచించండి. లేదంటే అనవసరం. కేవలం 3D కోసం టీవీ ను వెతకకండి. అది వాస్తవంలో మనం వాడము. 3D లో చూపించే కంటెంట్ దొరకటం కూడా చాలా అరుదు. 3D అనేది థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయితేనే కరెక్ట్. ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకొని చూస్తాము అని అనుకుంటారు కాని మీరు కేవలం ఆ ఫీచర్ కోసం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి , 10 సినిమాలకు మించి కూడా 3D ను వాడారు. చాలా అరుదుగా వాడే ఫీచర్స్ కోసం డబ్బులు పెట్టడం స్మార్ట్ బయింగ్ కాదు.