దేశంలో పాత నోట్లను బాన్ చేసిన తరువాత ప్రజలకు online బ్యాంకింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవటం ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలుస్తుంది. మీ వద్ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నా లేకపోయినా, atm debit card ద్వారా కూడా (డెబిట్ కార్డ్ ఆన్లైన్ పనులు ఎలా చేసుకోవాలో ఈ లింక్ లో తెలపటం జరిగింది) క్రింద తెలుపబడిన apps/సర్వీసెస్ కు online పేమెంట్ చేసి మీ డైలీ అవసరాలను తీర్చుకోగలరు.. ఎలాగో తెలుసుకుందాము రండి.. క్రిందకు స్క్రోల్ చేయండి. గమనిక: యాప్స్ ను డౌన్లోడ్ చేయటానికి వాటి పేర్ల పై క్లిక్ చేయండి.
మొదటిగా అందరికీ ఉండే అవసరం ...
vegetables అండ్ groceries - ఇంట్లో కిచెన్ కు సంబంధించిన ప్రతీ ఐటెం - including చికెన్, eggs, dals, అన్నీ డెలివర్ చేయటానికి - Amazon Now, Grofers, Big Basket, Zopnow అనే యాప్స్ ఉన్నాయి. వీటికి వాలెట్స్ , డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయగలరు. అంతే కాదు ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇంకా బయట కన్నా ఇక్కడ తక్కువ prices ఉంటాయి.
రెండు గంటల్లో ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలనుకుంటే...
అమెజాన్ Now అనే పేరుతొ అమెజాన్ కిచెన్ వస్తువులతో సూపర్ మార్కెట్ లో ఉండే ప్రతీ వస్తువును ఇంటికి డెలివర్ చేస్తుంది. అది కూడా రెండు గంటల్లో. ప్లే స్టోర్ లింక్
రెండవ ముఖ్యమైన అవసరం...
Medicines - tablets
కేవలం మందులు కొనతనికే కాదు, మీ దగ్గరిలోని డాక్టర్స్ అప్పాయింట్మెంట్స్ కూడా చేస్తుంది యాప్ లో. సో అన్ని పేమెంట్స్ ఆన్లైన్ ద్వారా చేసుకోగలరు. యాప్ పేరు Practo. ప్లే స్టోర్ లింక్
Hair cut
అర్జెంటు గా మీ హెయిర్ కట్ లేదా make over పనులను చేయటానికి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి ఇండియాలో. వీటి పేరులు..
Styl
GetLook Beauty
EasySpa
మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కానీ చూడటానికి చేతిలో కాష్ ఉండటం లేదు...
Movies
ఇది బాగా ఫేమస్ యాప్/సర్వీస్. కాని మనకు అవసరం వచ్చినప్పుడు వీటిని వినియోగించుకోవాలని గుర్తుకు రాదు. సో లోకల్ ఏరియాస్ లో ఉన్నా వారు Ticket dada అండ్ JustTickets ఆన్లైన్ లో టికెట్స్ కొనేందుకు సహకరిస్తాయి. సిటీస్ లో ఉన్న వారికీ bookmyshow యాప్ బెస్ట్ useful. అయితే కనీసం మూడు గంటల ముందు టికెట్ బుక్ చేయటం మరిచిపోకండి!
READY TO EAT FOOD
వంటకు అవసరం అయ్యే వస్తువులను కొని, వంట చేసుకోవటం ఇష్టం లేదా? చేతిలో ఉన్న అతి కొద్ది 100 రూ నోట్లను అత్యవసరానికి తప్పితే దేనికీ ఖర్చు పెట్టడం ఇష్టం లేదా? సరే, ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా రెస్టారెంట్స్ నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకోండి. ఇందుకు క్రింద యాప్స్ సహకరిస్తాయి.
FoodPanda
Swiggy
Zomato
బట్టలు ఇస్త్రీ మరియు ఉతకటం
లాండ్రీ పనులు చేయటానికి కూడా యాప్స్ ఉన్నాయి. ప్లే స్టోర్ లో ఈ లింక్ నుండి యాప్ డౌన్లోడ్ చేయగలరు.
తిరుపతి దేవస్థానం టికెట్స్
తిరుపతికి వెళ్ళే అవసరం ఉండి కేవలం చేతిలో చెల్లుబాటు అయ్యే కాష్ లేకపోవటం వలన ఆగిపోతున్నారా? అవసరం లేదు మీ ప్రయాణాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ కారణం చేత ఆగిపోనవసరం లేదు. ఎందుకంటే తిరుపతి టికెట్స్ తీసుకునేందుకు ఆన్ లైన్ పేమెంట్ చేసే యాప్ కూడా ఉంది. యాప్ పేరు TTD Tirupathi Online Booking - TTD Tirupathi Online Booking ప్లే స్టోర్ లింక్
train tickets
ఇది బాగా తెలిసిన యాప్ అందరికీ. కాని అవసరానికి మరిచిపోవటం కామన్. సో ఈ లింక్ నుండి IRCTC యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ దూరపు ప్రాంతాలు కూడా సునాయాసంగా పూర్తీ చేసుకోగలరు.
దగ్గరి రోడ్ ప్రయాణాలకు..
ఈ లింక్ లోని రెడ్ బస్ యాప్ లో మీరు ఒక సిటి నుండి వేరొక సిటీస్ కు ఆన్ లైన్ పేమెంట్ చేసి ట్రావెల్ చేయగలరు.
అయితే ఒకే జిల్లలో ఒక ఊరు నుండి మరొక ఊరుకు కూడా మీరు ఆన్ లైన్ టికెటింగ్ చేసేందుకు వీలు ఉంది. ఈ లింక్ లోని యాప్ APSRTC యాప్ డౌన్లోడ్ చేసి మీ లోకల్ ప్రయాణాలకు కూడా లిమిటెడ్ గా ఉన్న 100 రూ నోట్లను ఖర్చు చేయనవసరం లేదు.
కరెంట్ మరియు ఇతర బిల్స్..
ఇది బాగా useful, ఇంట్లోని కట్టవలసిన బిల్స్ - కరెంట్, గ్యాస్, వాటర్, లాండ్ లైన్, టీవీ డిష్ బిల్స్, పోస్ట్ పైడ్ మొబైల్ బిల్స్ etc అన్నిటినీ ఆన్ లైన్ లో కాష్ తీయకుండా కట్టటానికి ఈ యాప్స్ useful.
Paytm
MobiKwik
FreeCharge
ఇతర సర్వీసెస్
ఇంట్లో అర్జెంటుగా బాగు చేయవలసిన పనులు ఏమైనా ఉన్నయా? ఇబ్బంది పడనవసరం లేదు. వీటికి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. నిజంగా A to Z అన్నీ వీటిలో ఉంటాయి. పైన చెప్పిన అన్ని పనులకు కూడా ఈ ఒక్క యాప్ లో తీర్చుకోగలరు.
HelpChat
UrbanClap
గమనిక: అయితే ఈ సర్వీసెస్ అన్నీ మేజర్ సిటీస్ లో ఉన్నవారికి మాత్రమే బాగా అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి.