ప్రపంచం అంతా నిజ జీవితం తో కన్నా అంతర్జాలంలో (ఇంటర్నెట్) లో ఎక్కువ ఉంది. మనం అందరం బాహ్య ప్రపంచంతో కన్నా స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే ఎక్కువ గడపుతున్నాము. ఇలా ఉండటం తప్పా ఒప్పా అనే సోషల్ సూక్తులు ఇవ్వటానికి కాదు ఈ ఆర్టికల్. కాని ఈ ఇంటర్నెట్ - స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఉంటూ జాగ్రత్తగా ఏలా ఉండాలి అనే విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నమే ఈ ఆర్టికల్. ఇంటర్నెట్ కు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది హ్యాకింగ్ మరియు డివైజ్ లను సాఫ్ట్ వేర్ పరంగా పాడుచేసే వైరెస్ లే. ఒకప్పుడు వైరెస్ లు కేవలం డివైజ్ లను స్లో చేయటానికే ఉండేవి, ఇప్పుటి రోజుల్లో ఈ వైరస్ లు అంతిమ లక్ష్యం హాకింగ్. మనకు తెలియకుండా మన సమాచారాన్ని చూడటం, లేదా దొంగాలించటం, వాటిని బహిరంగంగా ఇంటర్నెట్ లో విడుదల చేయటం వంటి కార్యకలాపాలే హ్యాకింగ్. ఇంట్లో దొంగతనం జరిగితే వస్తువు పోవటం కనిపిస్తుంది, అదే ఇంటర్నెట్ ప్రపంచంలో మన ఇన్ఫర్మేషన్ ఎవరినా హ్యాక్ చేసి చూస్తున్నా మనకు తెలియదు. ఇది ఎంత త్రీవ్ర స్థాయిలో ఉందంటే జర్మన్ హాకర్స్ తమ దేశపు వోటింగ్ మెషిన్లను హ్యాక్ చేసి ఎలక్షన్ రిజల్ట్స్ ను కూడా మార్చారు. సో ఇలాంటి వాటికి మీరు బలి కాకుండా మీకు మీరు జాగ్రత్తగా ఎలా ఉండాలో వీలైనంత సింపుల్ గా వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ ఎదో మేజికల్ సీక్రెట్ టిప్స్ ఉంటాయి అని ఆశిస్తే నిరాశ పడతారు. సేఫ్ గా ఉండటానికి మన వద్ద అందుబాటులో ఉందేవాటిని స్ట్రిక్ట్ గా వాడితే చాలు. కొత్త కొత్త సిక్రెట్ టిప్స్ అనేవి అసలు అవసరం ఉండవు, లేవు కూడా. గమనిక: డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు. స్టోరీ చదవటానికి మొబైల్ users క్రిందకు స్క్రోల్ చేయండి, డెస్క్ టాప్ రీడర్స్ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయగలరు.
1. ఫిజికల్ హాకింగ్ - మీరు లేనప్పుడు మీ ఫోనులోకి పాస్ వర్డ్ తెలుసుకొని డివైజ్ ఓపెన్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ను పరిశీలించటం. పాస్వర్డ్ ను మీరు టైపు చేస్తున్నప్పుడైనా వెనుక నుండి చూడటం లేదా మిమ్మల్ని అడిగి తెలుసుకోవటం.
2. remote hacking - మీరు ఫోన్ లో ఇంస్టాల్ చేసుకున్న ఎదో ఒక యాప్ ద్వారా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయ్యి మీరు అడగని malware (మాల్వేర్ అనేది మన ఇన్ఫర్మేషన్ ను హరించి మన డివైజ్ కు హాని చేసే సాఫ్ట్ వేర్ లాంటిది) బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా డౌన్లోడ్ చేసేది.
అలాంటివి జరగకుండా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ useful గా ఉంటాయి..
పాస్ వర్డ్స్:
ఫోన్ లో ప్రతీ దానికి పాస్ వర్డ్ ఉండటం అనేది కామన్. బ్యాంక్, సోషల్ అకౌంట్స్ పాస్ వర్డ్స్ స్టోర్ అయ్యి ఉంటాయి ప్రతీ ఫోన్ లో. సో ఫిజికల్ లేదా రిమోట్ పద్దతిలలో వీటిని హాకర్స్ దొంగాలించగలరు. సో ఇక్కడ మీరు అటువంటి వేమి జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోగలరు(క్రిందకు స్క్రోల్ చేయండి)
మీరు మొబైల్ బ్రౌజర్ లో లాగిన్ అయిన తరువాత బ్రౌజర్ మిమ్మల్ని పాస్ వర్డ్ స్టోర్ చేయాలా అని అడుగుతుంది. మీరు అప్పుడు NO అని ప్రెస్ చేసి, పాస్ వర్డ్ ను స్టోర్ చేయకుండా చూసుకోవాలి. Phishing సైట్స్(సమె ఒరిజినల్ సైట్స్ లా ఉండే డూప్లికేట్ సైట్స్) మీరు సేవ్ చేసిన పాస్ వర్డ్స్ ను దొంగాలిస్తాయి. ఒరిజినల్ వెబ్ పేజెస్ స్టోర్ చేసిన వాటిని cookies నుండి కూడా డేటా(పాస్ వర్డ్ & etc) దొంగలించబడుతుంది. అంతేకాదు మీరు సేవ్ చేసి ఉంచటం వలన మీ చుట్టూ ప్రక్కల వాళ్ళు ఎవరైనా సోషల్ ఎకౌంట్స్ లోకి డైరెక్ట్ గా లాగ్ ఇన్ అయిపోగలరు కదా! అంత ప్రైవెసి ఇన్ఫర్మేషన్ ఏమి లేదులే అనుకునే వారు, తరువాత బాధపడే బదులు ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది కదా!
కేవలం నంబర్ లేదా ఆల్ఫా బేట్స్ తో ఉండే డైరెక్ట్ పాస్ వర్డ్స్ వాడకూడదు సేఫ్ గా ఉండాలనుకుంటే. అలాగే మినిమమ్ 8 characters ఉండాలి. సింపుల్ గా చిన్నగా పెట్టుకుంటే గుర్తుంటుంది & ప్రతీ సారి పెద్దది టైప్ చేయనవసరం లేదు అని lazy గా ఫీల్ అయితే, మీరు నిజంగా పెద్ద రిస్క్ చేసినట్లే. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళే అలాగే ఇతరులు కనుక్కోగలిగే పాస్ వర్డ్స్ ను కూడా పెట్టుకోకూడదు(ముద్దు పేరు, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఊరు పేరు, ఫేవరేట్ సినిమా,హిరోయిన్, హీరో పేరు, లవర్ పేరులు). అంతగా పెట్టాలనుకుంటే మీరు చిన్నప్పుడు crush గా ఫీల్ అయిన లవర్ పేరు పెట్టుకోండి కాని కరెంట్ లవర్స్ పేరులను పెట్టుకోకూడదు. ముఖ్యంగా అమ్మాయిలు సొంత లవరే కదా అని అతనికి మీ పాస్ వర్డ్ చెప్పటం కూడా అంత సమంజసం కాదు. లేదా అతనికి దూరం అయిన తరువాత వాళ్ళు ఊహించలేని పాస్ స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ను మార్చుకోవాలి.
ఆండ్రాయిడ్ OS అనేది ఓపెన్ సోర్స్. అంటే దానిని సోర్స్ ఫైల్స్ ను ఎవరైనా mమార్పులు చేయగలరు.అందుకే గూగల్ ఆండ్రాయిడ్ OS సొంతంగా స్ట్రాంగ్ అండ్ secure ఇంబిల్ట్ సెక్యూరిటీ సిస్టం తో వస్తుంది. ఫర్ eg: పాస్ వర్డ్ సెక్షన్ లో మీరు గమనించినట్లైతే వివిధరకాల పాస్ వర్డ్ మోడ్స్ ఉంటాయి. పాటర్న్, పాస్ వర్డ్, ఫింగర్ ప్రింట్, పిన్ కోడ్. వీటిలో పాటర్న్ సిస్టం ప్రధమంగా secure కాదని చెప్పాలి. ఫింగర్ ప్రింట్ స్కానర్ లేని వారికి alphanumeric password బెస్ట్ చాయిస్. కాని ఇప్పుడు ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ అన్ని ఫోనుల్లో వస్తుంది, ఫింగర్ ప్రింట్ లాకింగ్ బెస్ట్ సెక్యూరిటీ. unlocking చేసేటప్పుడు పాస్ వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు ఎవరైనా చూసే అవకాశాలు ఉండవు, పైగా ఫాస్ట్ అండ్ ఈజీ unlocking.
గూగల్ ప్లే స్టోర్ కారణంగా ఆండ్రాయిడ్ ఇంత లాంగ్ రన్ సక్సెస్ అందుకుంది అని చెప్పాలి. అనేక మైన యాప్స్ user కు బోర్ కొట్టినవ్వకుండా మరియు ప్రతీ అవసరానికి రకరకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ యాప్స్ ప్లే స్టోర్ నుండి కాకుండా ఇతర వెబ్ సైట్స్ & థర్డ్ పార్టీ యాప్స్ స్టోర్స్ నుండి కూడా ఇంస్టాల్ చేసుకునే వీలు ఉంది. అయితే ఇది by default గా enable అయ్యి ఉండదు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో. మీరు ప్రత్యేకంగా enable చేసుకుని ఇంస్టాల్ చేసుకుంటేనే ఇతర సోర్సెస్ నుండి యాప్స్ అనేవి ఇంస్టాల్ అవుతాయి మీ ఫోన్ లో. సో other సోర్సెస్ నుండి చేసుకునే యాప్స్ ద్వారా హానికరమైన పనులు (పైన హాకింగ్ గురించి చెప్పినవి) జరగవచ్చు మీకు తెలియకుండా. అయితే అప్పుడప్పుడు గూగల్ ప్లే స్టోర్ లో కూడా ఇలాంటి హానికరమైన యాప్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ వాటి బారిన పడకుండా ఎలా ఉండాలి అనేవి చూడగలరు ఇప్పుడు.. (క్రిందకు స్క్రోల్ చేయండి)
Taking బ్యాక్ అప్ అనేది ఎందుకు అందరూ అవసరం అంటారంటే.. ఒక వేల మీ డేటా వైరెస్ తో అటాక్ అయినప్పుడు కొన్ని డిలిట్ అవటం, మారిపోవటం జరుగుతాయి. సో అప్పుడు ఒరిజినల్ గా సేఫ్ గా ఉన్న బ్యాక్ అప్ తీసిన డేటా అవసరం ఏంటో తెలుస్తుంది. ఈ బ్యాక్ అప్ అనేది cloud(ఇంటర్నెట్ ఆన్ లైన్ స్టోరేజ్) లేదా హార్డ్ డిస్క్/PC లలో ఉంచకోగలరు. క్లౌడ్ స్టోరేజ్ లో చాలా సైట్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు, అయితే ఏవైతే ప్రతీ సారి మీ పాస్ వర్డ్ ప్రొటెక్షన్ అడుగుతయో వాటినే వాడాలి. క్లౌడ్ ఎంచుకుంటే, మీ ఫోన్ పోయినా, లాప్ టాప్ హార్డ్ డిస్క్ డిలిట్ అయినా డేటా మాత్రం సేఫ్ గా ఉండటమే కాదు, మీ వద్ద PC లేకపోయినా డేటా ను ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యి ఎక్కడైనా access చేయగలరు. అయితే నమ్మదగిన క్లౌడ్ స్టోరేజ్ సైట్స్/సర్వీసెస్ నే వాడాలి. ఫర్ eg: Idrive, Sugarsync, Crashplan etc క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్/సైట్స్ మంచివి.
అప్లికేషన్స్ లో సెక్యూరిటీ ఆప్షన్స్ ఉంటె వాటిని వాడటం మంచిది. ఎందుకంటే ఒక వేల మీ ఫోన్ ను ఎవరైనా unlock చేయగలిగినా యాప్స్ ను వాడటానికి కుదరదు కదా. యాప్స్ లో సెక్యూరిటీ ఆప్షన్స్ లేకపోయినా, యాప్స్ ను లాక్ చేయటానికి మంచి యాప్ లాకింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఓవర్ ఆల్ గా మల్టీ లేయర్ సెక్యూరిటీ అంటారు దీనిని. ఇలా ఉండాలి ఎప్పుడూ. ఎందుకంటే ఒకటి తెలిసి పోయినా, డేటా ను access చేయటానికి మరొక ద్వారం ఉంటుంది. ఫర్ eg ఫోన్ పోయినప్పుడు, మీ యాప్స్ కు లాకింగ్ ఉంటే మీరు ప్రైవెసి డేటా కొరకు బాధ పడనవసరం లేదు.
ముందుగా పైన చెప్పినట్లు ప్లే స్టోర్ నుండి కాకుండా బయట నుండి యాప్స్ ఇంస్టాల్ చేసుకోకండి. అయితే గూగల్ ప్లే స్టోర్ లో కూడా కొన్ని unwanted యాడ్స్ తో వస్తున్నాయి యాప్స్. వీటి వలన unwanted phishing సైట్స్ కు వెళ్ళవలసి వస్తుంది. అలా ప్రవర్తించే యాప్స్ లో log in లు చేయకుండా ఉండటం బెటర్. పేజ్ ఓపెన్ చేసిన వెంటనే "మీ డివైజ్ అటాక్ అయ్యింది, వైరేస్ ఉంది" అని చెబుతాయి ఇలాంటివి. వాటిని వీలైనంత తొందరగా క్లోజ్ చేయాలి కాని ఇంస్టాల్స్ ఏమి చేయకూడదు. ఒక యాప్ డౌన్లోడ్ చేసే ముందు, డెవలపర్ పేరు కామెంట్స్ సంఖ్య చూడాలి.
ఇంటర్నెట్ అంటే కుత్రిమంగా ఒక చోట ఉన్న వ్యక్తి మరొక వ్యక్తి తో కనెక్ట్ అవ్వటం. ఇలా కనెక్ట్ చేసే మెథడే నెట్ వర్క్. సో అలంటి నెట్ వర్క్ లో ఇంటర్నెట్ సౌకర్యం ఆస్వాదిస్తూ ఇతరులకు బలి కాకుండా ఎలా ఉండాలి చూద్దాం రండి..
Wi-Fi వాడుతుంటే కనుక దానికి కచ్చితంగా పాస్ వర్డ్ ఉండేలా చూడండి. లేదంటే వేరే ఎవరినా దగ్గరిలో ఉన్నవారు అదే వై ఫై కు కనెక్ట్ అయ్యి, దాని తో కనెక్ట్ అయ్యి ఉన్న అన్ని డివైజెస్ నుండి సమాచారం తెలుసుకోగలరు. ఫ్రీ గా వచ్చే Wi-Fi లను వాడటం మానేయండి. మీ ఏరియా లో హాకింగ్ చేసే అంత పరిస్థితిలు ఉండవు అని అనుకోకండి, చిన్న పాటి టెక్నాలజీ ఇష్టం ఉన్న వారు అదే రేంజ్ లో చిన్నపాటి హాకింగ్ కూడా చేయగలరు. ఎప్పుడు ఎవరు ఏ ఆలోచనలతో ఉంటారు చెప్పటం కష్టం. HideNinja VPN లాంటి యాప్ వాడితే ఇలాంటివి వాటికీ బలి కాకుండా ఉండవచ్చు. ఇది మీ అవుట్ గోయింగ్ నెట్ వర్క్ డిజిటల్ సిగ్నేచర్ తో encrypted అయ్యి ఉండేలా చేస్తుంది. సో encrypted అయిన దాని నుండి ఎవరూ ఏమి దొంగలించ లేరు.
ఫోన్స్ లేదా డివైజెస్ లో రెండు అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఉంచుకోండి. ఒకటి మీకు మరొకటి guest అకౌంట్. ఇది ఇప్పుడు దాదాపు అన్ని ఫోనుల్లో ఉంది. SETTINGS లోకి వెళ్లి USER section లోకి వెళ్లి చేసుకోగలరు. ఒక వేల ఆప్షన్ లేకపోతే ప్లే స్టోర్ లో ఇలాంటి అవసరానికి యాప్స్ ఉన్నాయి. For example, SWITCHME లేదా PARALLEL SPACE. ఈ రెండింటి గురించి ఆల్రెడీ డిజిట్ తెలుగు రీడర్స్ కు తెలపటం కూడా జరిగింది. ఒక డివైజ్ లోనే మల్టిపుల్ సోషల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకునే యాప్స్ కూడా ఉన్నాయి. ఒకే డివైజ్ ను ఇద్దరు వాడే పరిస్తితి ఉంటే డ్యూయల్ అకౌంట్స్ useful.
ప్లే స్టోర్ లో అయినా బయట అయినా డివైజ్ ను హాని చేసే యాప్స్ చాలా ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు ఓపికగా చూడాలంటే ఇబ్బందే. సో ఇదే పనిని చేసి పెట్టడానికి anti virus యాప్స్ పనిచేస్తాయి. ఇందుకు బెస్ట్ ఉదాహరణ AVG అప్లికేషన్. ఫ్రీ వెర్షన్ యాప్ లో మంచి సెక్యూరిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ eg: unknown sources నుండి మిమ్మల్ని యాప్స్ డౌన్లోడ్ చేయనివ్వకుండా చేస్తుంది. ఇంకా ఫోన్ ట్రాకింగ్ అండ్ ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ లో హానికరమైన malware లేకుండా చెకింగ్స్ చేస్తూ ఉంటుంది ఎప్పుడూ. ఇలాంటి నమ్మదగిన బెస్ట్ anti virus యాప్స్ క్రింద చూడగలరు..
ఫోన్ పోయే అంత వరకూ దీని గురించి ఎవ్వరూ పట్టించుకోరు. కాని ఫోన్ పొతే,ఫోన్ లోని ప్రైవేటు డేటా బయట పడితే మన జీవితాలే నాశనం అవుతాయి అని చెప్పాలి.కాంటాక్ట్స్, పాస్ వర్డ్స్, యాప్స్, ఫోటోస్, వీడియోస్ etc అన్ని ఎవరో చేతిలో ఉన్నట్లే. సో మీ ఫోన్ పోయినప్పుడు.. మీరు బాధపడనవసరం లేకుండా GPS SAT-NAV పై పనిచేసే కొన్ని యాప్స్ దొంగలించ బడిన ఫోన్ ను తిరిగి పొందేగలిగే అవకాశాలు ఇస్తున్నాయి. పొందలేకపోయినా ఫోన్ లోని మొత్తం డేటా ను రిమోట్ పద్దతిలో పూర్తిగా డిలిట్ చేసే సదుపాయాలు ఇస్తున్నాయి. సో ఈ క్రింద ఫోన్ పోయినప్పుడు useful గా ఉండే సేఫ్టీ విషయాలను చూడండి..
పోయిన ఫోన్ తిరిగి రాదు అనే సందర్బాలు ఉంటే కనుక రిమోట్ పద్దతిలో ఫోన్ లోని డేటా అంతా డిలిట్ చేయాలి త్వరగా. ఏలా చేయాలో గూగల్ తెలిపిన సమాచారాన్ని క్రింద చదవగలరు...
“Select Remote Wipe when a device is lost or stolen to erase all data on the device and to do a factory reset. You can remote wipe an Android device with the Google Apps Device Policy app installed and any supported mobile device with Google Sync configured. All data is erased from the device (and SD card, if applicable), including email, calendar, contacts, photos, music, and a user’s personal files.
అయితే రిమోట్ Wipe ఫీచర్ అనేది కొన్ని ఫోనుల్లో కేవలం డివైజ్ ఇంటర్నెల్ స్టోరేజ్ ను మాత్రమే డిలిట్ చేస్తుంది. SD కార్డ్ డేటా ను డిలిట్ చేయదు. remote గా డిలిట్ చేయాలంటే మీ పోయిన డివైజ్/ ఫోన్ లో Device Policy లేదా గూగల్ Sync సెట్ అప్ చేసి ఉండాలి. ఈ యాప్ ను ఈ లింక్ లోకి వెళ్లి ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. సెట్ అప్ చేసుకోవటానికి గూగల్ వ్రాసిన సమాచారాన్ని ఈ లింక్ లో చూడగలరు. పోయిన తరువాత Device policy ను ఇంస్టాల్ చేసి డేటా ను రిమోట్ గా డిలిట్ చేయటం కుదరదు. ముందుగా బ్యాక్ అప్ తీసుకుంటే ఈజీ గా మీరు రిమోట్ డిలిట్ చేయగలరు.
ఇందుకు AVG security system లేదా ‘FIND MY PHONE’ for android యాప్స్ ను వాడగలరు. GPS ట్రాకింగ్ ద్వారా satellite navigation ను use చేసి పోయిన ఫోన్ ఎక్కడుందో లొకేషన్ ట్రాక్ చేస్తాయి. అయితే ఇదే పని ఎటువంటి యాప్స్ లేకుండా కూడా చేయగలరు Google account సహాయంతో. అయితే పోయిన ఫోన్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యి ఉండాలి. ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్ by default గా ADM (android device manager) తో ఉంటుంది. ఇదే ఇక్కడ use అవుతుంది. ఇవన్నీ ఉంటే మీరు గూగల్ సర్చ్ లో “Where is my phone” అని టైప్ చేస్తే ఫోన్ లొకేషన్ చూపిస్తుంది గూగల్ మాప్స్ లో. ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ మాత్రం ఇంస్టాల్ అయ్యి enable మోడ్ లో ఉండాలి పోయిన ఫోన్ లో.
రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లేముందు ఫోన్ చాలా జాగ్రత్తగా ఉండేలా చేసుకోవాలి. పైన చెప్పినవన్నీ డైలీ usage లో చేసుకోకపోయినా at least బయటకు వెళ్ళే టప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు పైన చెప్పినవన్నీ చేసుకొని ఉండాలి. గమనిక: డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.
రిలయన్స్ Jio 4G స్పీడ్ బాలేదా? ఈ లింక్ లో చెప్పిన విధంగా చేస్తే మీ స్పీడ్ పెరుగుతుంది.