మీరు రూటింగ్ చేసే ప్రయత్నాలలో ఉన్నారా? PC అవసరం లేకుండా మొబైల్ లోనే యాప్స్ సహాయతంతో కూడా రూటింగ్ చేయగలరు. అది ఎలాగో గతంలో ఈ ఆర్టికల్ లో చెప్పుకున్నాము. అయినా చాలా మందికి తమ వద్ద ఉన్న మొబైల్స్ కు కూడా pc లేకుండా రూట్ చేయటం అవుతుందా అనేది స్పష్టంగా తెలియటం లేదు. సో దాని కోసం ప్లే స్టోర్ లో ఒక యాప్ ఉంది. దాని గురించి తెలుసుకోవటానికి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి. గమనిక: ఇది రూటింగ్ చేయదు, రూటింగ్ ప్రోసెస్ మాత్రమే తెలియజేస్తుంది.
యాప్ పేరు Root android without PC. ఈ లింక్ లో 6MB సైజ్ లో ఉంది. రేటింగ్ 3.6
రూటింగ్ మెథడ్స్ అండ్ ప్రోసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పైన ఉన్న లింక్ లో గతంలో తెలియచేయటం జరిగింది. అయినా ఇది పరిచయం చేయటానికి కారణం. ప్రోసెస్ అంతా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అంతకు మించి ఏ మొబైల్ సపోర్ట్ చేస్తుందో ఏ మోడల్ సపోర్ట్ చేయటం లేదో లిస్టింగ్ కూడా ఉంది యాప్ లో.
దీనిలో నాకు బాగా నచ్చిన విషయం కేవలం ఒక్క యాప్ అనే కాకుండా అన్ని రకాల రూట్ యాప్స్ యొక్క ప్రోసెస్ మరియు అవసరం అయిన లింక్స్ ను ఇస్తుంది.
థర్డ్ స్టెప్ టాబ్ లో మీ మొబైల్ సపోర్ట్ చేయలేదని చూపించినా, అసలు ఎన్ని యాప్స్ pc లేకుండా రూట్ చేస్తున్నాయి, ఎలా చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కోసమైనా ఈ యాప్ బాగా useful అవుతుంది.
జస్ట్ ఏదో ఒక మోడల్ పై టచ్ చేస్తే దాని రూటింగ్ మెథడ్ గురించి కంప్లీట్ గా తెలుసుకుంటారు, మరొక మోడల్ పై టచ్ చేస్తే వేరే రూటింగ్ యాప్ యొక్క ప్రోసెస్ ను తెలుసుకోగలరు. మైనస్ : అన్నీ మోడల్స్ యొక్క సపోర్ట్ లిస్టు లేదు దీనిలో. గమనిక: ఇది రూటింగ్ చేయదు, రూటింగ్ ప్రోసెస్ మాత్రమే తెలియజేస్తుంది.