ఈ మధ్య కాలంలో కొన్ని ఇన్ఫర్మేషన్ బయట పడిన ATM కార్డ్ లను ఆయా బ్యాంక్స్ ఆటోమాటిక్ గా బ్లాక్ చేయటం జరిగింది. అసలు ATM లలో జరిగే frauds నుండి ఏలా safe గా ఉండాలి అని డిజిట్ రీడర్స్ కు తెలిపేందుకు ఈ ఆర్టికల్ వ్రాయటం జరిగింది. క్రిందకు స్క్రోల్ చేయండి ఇన్ఫర్మేషన్ కొరకు.
Phishing:
బాంక్ పేరులతో డూప్లికేట్ ఐడి లు క్రియేట్ చేసి ఆ మెయిల్ ఐడి ల నుండి బ్యాంక్ వాళ్ళు పంపినట్లు emails పంపుతారు. email సారంశంలో మీ బ్యాంకు డిటేల్స్ అడుగుతారు. మీరు మెయిల్ ఎవరి నుండి వచ్చింది లేదా అసలు బ్యాంక్స్ ఎప్పుడూ ఇలా అడగరు అని తెలియక తిరిగి బ్యాంకు డిటేల్స్ పంపిస్తే, వాటి ద్వారా వారు మీ డబ్బును దొంగాలిస్తారు.
సో పర్సనల్ సమాచారం ఏదైనా అడిగే emails వస్తే, వాటిని బ్యాంక్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి రిపోర్ట్ చేయాలి. మీరు వాళ్ళకు ఏమి ఇవ్వకపోతే మీరు safe గానే ఉంటారు. Mostly "you’ve won from lottery/competitions" లేదా "cheques cleared" అనే మెసేజ్ లు వస్తాయి ఇలా.
Skimming Devices:
atm కార్డ్ యొక్క పిన్ నంబర్స్ ను దొంగలించటానికి ఎటిఎం మెషిన్ లకు కొన్ని పరికరాలును తగిలిస్తారు దొంగలు. ఇవి కీ పాడ్, లేదా మీరు కార్డ్ లోపల పెట్టె స్లాట్ places లో పెడతారు.
జనరల్ గా వీటిని పట్టుకోవటం కష్టం. కానీ కీ పాడ్ లేదా కార్డ్ పెట్టె స్లాట్ లూజ్ గా slight గా లూజ్ గా ఊగుతూ ఉన్నట్లయితే, దానిని మీరు అనుమానించాలి. ఎందుకంటే ATM లు సాధారణంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మరియు ఇలాంటివి జన సంద్రోహం లేని ప్రదేశాలలో ఉన్న atm లలో ఎక్కువుగా జరుగుతాయి.
Hacking:
పబ్లిక్ ఇంటర్నెట్(Wifi లేదా ఇంటర్నెట్ సెంటర్లు) ఎప్పుడైనా వాడుతున్నారా? అలాంటి సందర్భాల్లో బ్యాంకు transactions కూడా చేస్తే ఇక మీరు రిస్క్ చేసినట్లే. పబ్లిక్ నెట్ వర్క్స్(ఇంటర్నెట్) చాలా easy గా హాక్ చేయటానికి అవుతుంది.
Hacking కు గురవ్వకుండా ఉండాలంటే... ఏదైనా తెలియని లింక్ లను ఓపెన్ చేయకూడదు ఎక్కడా. వాట్స్ అప్, ఫేస్ బుక్ లలో కూడా ఆకర్షణియంగా కనిపించే ఆఫర్స్ లింక్స్ ను కూడా ఓపెన్ చేయకూడదు. torrent లలో పాటలు లేదా విడియోలు డౌన్లోడ్ చేసేముందు ఆల్రెడీ చేసిన వారు ఉంటేనే చేయాలి. ఇంటర్నెట్ లో ఏది పడితే అది తెలియకుండా, చదవకుండా ఓపెన్ చేయకపోతే మిమ్మల్ని ఎవరూ హాక్ చేయలేరు.
Point of sale:
ఇది మనం కంట్రోల్ చేయలేనిది. ఈ పద్దితిలో(Point of sale) ఒకసారి ఏదైనా ఎఫెక్ట్ అయితే అందరికీ అది ప్రాబ్లెం అవుతుంది. ఇదే పద్దతిలో రీసెంట్ గా ఇండియాలోని కొన్ని atm కార్డ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ కంపెని వెంటనే ఎఫెక్ట్ అయిన కార్డ్ లను బ్లాక్ చేసేసింది. ఒకవేళ మీ డబ్బులు కూడా పోయినట్లయితే మీకు బ్యాంకు రీసర్చ్ చేస్తే డబ్బులను వెనక్కు వేస్తుంది.
మనం కంట్రోల్ చేయలేనప్పతికీ దీని భారిన పడకుండా ఉండటానికి.. ఫేమస్ స్పాట్స్ లేదా ఏరియాస్ లోనే కార్డ్ ను వీలైనంత వరకూ వాడాలి. అయితే ఇవి కూడా ఎఫెక్ట్ అవొచ్చు. సో ఉన్నంతలో ఒకవేళ మీ వద్ద cash ఉంటే. మీరు cash వాడటం బెటర్.
Change PIN:
ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మీరు పిన్ చేంజ్ చేయాలి అనెని బ్యాంకింగ్ సెక్టార్ లో మంచి అలవాటే కాని అన్నీ పాస్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవటం అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో ముఖ్యంగా మీకు అనుమానం ఉన్నా మరియు ఇతరులకు లేదా మీకు ఏదైనా జరిగినా మీరు వెంటనే పిన్ చేంజ్ చేస్తే safe అయినట్లే.
ఇవ్వన్నీ మీకు atm వాడటానికి బయపెట్టే విధంగా అనిపించవచ్చు కాని భయం వేరు జాగ్రత్తగా ఉండటం వేరు. ఇవి జాగ్రత్తలు మాత్రమే కాని మరొకటి కాదు.