ఆండ్రాయిడ్ M - మార్ష్ మల్లో ను ఎలా useful గా వాడుకోవాలి. ఏమి ఉన్నాయి దీనిలో..

బై Dhruv Kumar | అప్‌డేట్ చేయబడింది Jan 05 2016
ఆండ్రాయిడ్ M - మార్ష్ మల్లో ను ఎలా useful గా వాడుకోవాలి. ఏమి ఉన్నాయి దీనిలో..

ఆండ్రాయిడ్ M రిలీజ్ అయ్యి కొన్ని నెలలు అవుతుంది. కాని ఇంకా అందరికీ అప్ డేట్ రావటం లేదు. ఆండ్రాయిడ్ M లో UI మార్పులు కన్నా సెట్టింగ్స్ లో ఎక్కువ మార్పులు జరిగాయి.  ఆండ్రాయిడ్ M కంప్లీట్ ఫోన్స్ లిస్ట్ ఈ లింక్ లో చూడగలరు. ఇప్పుడు మార్ష్ మల్లో ను ఎలా వాడుకోవాలి. ఏమున్నాయి అసలు మార్ష్ మల్లో లో అనే విషయాలు ఇక్కడ తెలుసుకోగలరు. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.

ఆండ్రాయిడ్ M - మార్ష్ మల్లో ను ఎలా useful గా వాడుకోవాలి. ఏమి ఉన్నాయి దీనిలో..

గూగల్ Now on Tap
google యాప్ ఇంస్టాల్ చేసి, సెట్టింగ్స్ లోకి వెళ్లి Voice మెను లో కి వెళ్తే 'Now On Tap' అనే ఆప్షన్ ను enable చేయాలి. 
use - మీరు ఏ యాప్ లో ఉన్న హోమ్ బటన్ పై లాంగ్ ప్రెస్ చేస్తే మీరు ఉన్న స్క్రీన్ లోని డేటా ను స్కాన్ చేసి దానికి సంబందించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అక్కడే overlay లో.
 

ఆండ్రాయిడ్ M - మార్ష్ మల్లో ను ఎలా useful గా వాడుకోవాలి. ఏమి ఉన్నాయి దీనిలో..

Individual యాప్స్ permissions
సెట్టింగ్స్ - యాప్స్ - యాప్ permissions లోకి వెళ్లి నచ్చిన యాప్ కు నచ్చిన విధంగా పెర్మిషణ్ సెట్ చేయగలరు.
use - ఏ యాప్ ఇంస్టాల్ చేసుకున్న అవి మీ ఫోన్ లోని కొన్ని డేటా లను యాక్సిస్ చేయటానికి permissions అడుగుతుంది. కాని అవి okay చేస్తే యాప్ ఇంస్టాల్ అవుతుంది. సో అది permission కాదు కేవలం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆండ్రాయిడ్ M లో permission వచ్చింది. ఫేస్ బుక్, కెమేరా, ఏదైనా యాక్సిస్ చేయాలి అంటే మీరు వాటికి పర్తికులర్ పర్మిషన్ ఇస్తేనే. అంటే ఇవ్వకపోయినా యాప్ ఇంస్టాల్ అవుతుంది.

ఆండ్రాయిడ్ M - మార్ష్ మల్లో ను ఎలా useful గా వాడుకోవాలి. ఏమి ఉన్నాయి దీనిలో..

Tune your System UI
క్విక్ సెట్టింగ్స్ పైన ఉన్న సెట్టింగ్స్ ఐకాన్ పై లాంగ్ ప్రెస్ చేయాలి..అప్పుడు ఐకాన్ రొటేట్ అవుతుంది. వెంటనే దానిపై నుండి చేసి తీస్తే క్రింద సిస్టం UI tuner ఆన్ అయ్యింది అని చిన్న మెసేజ్ చూపిస్తుంది క్రింద. ఇప్పుడు ఈ ఆప్షన్ ను మెయిన్ సెట్టింగ్స్ లో చూడగలరు. 
use - స్టేటస్ బార్ లో అలారం బ్లూటూత్ etc వంటి ఐకాన్స్ ను కనిపించకుండా సెట్ చేసుకోవటానికి.. అలాగే క్విక్ సెట్టింగ్స్ panel లో ఏమి ఉండాలి అని సెలెక్ట్ చేసుకోవటానికి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఆప్షన్ ను ఇస్తుంది ఆండ్రాయిడ్ M లో.

ఆండ్రాయిడ్ M - మార్ష్ మల్లో ను ఎలా useful గా వాడుకోవాలి. ఏమి ఉన్నాయి దీనిలో..

బ్యాక్ గ్రౌండ్ యాప్స్ డేటా restriction
సెట్టింగ్స్ - data usage - టాప్ రైట్ మెను ఐకాన్ -  సెలెక్ట్ నెట్వర్క్ restrictions  లోకి వెళ్లి మీరు ఇంటర్నెట్ వాడకాన్ని అదుపు చేయలి అనుకునే యాప్స్ ను enable చేయండి.
use - ఇది ఫోన్ లో టోటల్ డేటా restriction ఆప్షన్ కాదు. individual గా ప్రతీ యాప్స్ కు డేటా ను restrict చేసే ఫీచర్.enable చేస్తే ఆ యాప్స్ అధికంగా ఇంటర్నెట్ ను వాడుతున్నప్పుడు మీకు అలెర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ M - మార్ష్ మల్లో ను ఎలా useful గా వాడుకోవాలి. ఏమి ఉన్నాయి దీనిలో..

ఇంబిల్ట్ ఫైల్ మేనేజర్
అవును. మనం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఆప్షన్ ఇది. ఇప్పుడు ఫైల్స్ ను చూడటానికి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు, ఆండ్రాయిడ్ M లో డిఫాల్ట్ గా ఫైల్ మేనేజర్ వస్తుంది. 
అయితే ఇది కూడా ఈజీ గా అందరకీ కనపడదు. సెట్టింగ్స్ లో కి వెళ్లి స్టోరేజ్ అండ్ USB పై ప్రెస్ చేయండి. ఇప్పుడు Explore అనే ఆప్షన్ ఉంటుంది స్క్రీన్ క్రింద. అదే ఫైల్ మేనేజర్.
use - మీ ఫోన్ ఇంటర్నెల్ లేదా sd కార్డ్ లో మూవీస్, ఫైల్స్, సాంగ్స్ ఏ ఫోల్డర్స్ లో ఉన్నాయి చూడటానికి.

 

ఆండ్రాయిడ్ M - మార్ష్ మల్లో ను ఎలా useful గా వాడుకోవాలి. ఏమి ఉన్నాయి దీనిలో..

వెబ్ లింక్స్ ను యాప్స్ కు లింక్ చేయటం
సెట్టింగ్స్ - యాప్స్ - పైన టాప్ రైట్ కార్నర్ లో ఉన్న gear ఐకాన్ పై టాప్ చేసి యాప్స్ ను సెలెక్ట్ చేసుకోండి.

మీరు బ్రౌజర్ లో ఫేస్ బుక్, ట్విటర్ లేదా ఏదైనా యాప్ రూపంలో కూడా ఉన్న వెబ్ సైట్ ను బ్రౌజ్ చేస్తుంటే దానిని యాప్ కు లింక్ చేయగలరు.
use - మీరు playstore, అమెజాన్, స్నాప్ డీల్ లేదా ఇతర సైట్స్ యొక్క లింక్స్ ను డిజిట్ తెలుగు లో చూసి వాటిపై క్లిక్ చేస్తే అవి బ్రౌజర్ లో ఓపెన్ అవుతాయి. ఇక ఇవి డైరెక్ట్ గా యాప్స్ కు లింక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది.
 

ఆండ్రాయిడ్ M - మార్ష్ మల్లో ను ఎలా useful గా వాడుకోవాలి. ఏమి ఉన్నాయి దీనిలో..

డిఫాల్ట్ యాప్స్ change
ఫోన్, మెసేజింగ్, బ్రౌజర్ అండ్ వాయిస్ వంటి ఇంపార్టంట్ యాప్స్ ను కూడా రిప్లేస్ చేసి థర్డ్ పార్టీ యాప్స్ ఇంస్టాల్ చేసుకొని వాడగలరు. ఇలా గూగల్ వాయిస్ assitant ను కూడా మార్చుకోగలరు.

ఆండ్రాయిడ్ M - మార్ష్ మల్లో ను ఎలా useful గా వాడుకోవాలి. ఏమి ఉన్నాయి దీనిలో..

సెల్యులర్ డేటా ను యాక్టివ్ గా ఉంచాలి
సెట్టింగ్స్ - అబౌట్ ఫోన్ లోకి వెళ్లి బిల్డ్ నంబర్ పై 10 - 12 టైమ్స్ టాప్ చేసి డెవెలపర్ ఆప్షన్స్ ను ను enable చేయండి. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ లోకి వెళ్లి ఆన్ చేయాలి. నెట్ వర్క్ సెక్షన్ లో cellular data always active అనే ఆప్షన్ ను enable చేయాలి.
use - మీరు wifi నుండి మొబైల్ డేటా, మొబైల్ డేటా నుండి wifi కు షిఫ్ట్ అవుతున్నప్పుడు ఇంటర్నెట్ డిసేబుల్ కాకుండా ఉండటానికి. ఇది wifi ఆన్ లో ఉన్నా మొబైల్ డేటా ను కూడా ఆన్ లో ఉంచుతుంది. కాని wifi పనిచేస్తున్నప్పుడు మోబైల్ డేటా ను వాడదు. ఇంటర్నెట్ అస్సలు లేకుండా ఉండటానికి అవ్వని users కు ఇది useful.