ఇంటర్నెట్ లో మనకు సంబంధించిన అకౌంట్స్, ప్రోఫైల్స్, మన ఈమెయిలు ఐడి ల ద్వారా బాగా spread అవటం కామన్ అయిపొయింది ఇప్పుడు. కాలం గడిచే కొద్దీ ఏ వెబ్ సైట్ కు sign up అయ్యామో కూడా తెలియటం లేదు. రక రకాల ఈమెయిలలు వస్తుంటాయి. కాని వాటన్నిటిలో మీ అకౌంట్ డిలిట్ చేసుకొని మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇంటర్నెట్ లో లేకుండా చేసుకునేందుకు ఒక మెథడ్ తెలపటానికే ఈ ఆర్టికల్. క్రిందకు స్క్రోల్ చేయండి మొబైల్ రీడర్స్..
deseat.me అనే వెబ్ సైట్ ద్వారా మీరు ఇంటర్నెట్ లో మీ మెయిల్ id లన్నీ ఎన్ని సర్వీసెస్/వెబ్ సైట్స్ కు సైన్ అప్ అయ్యాయో. అన్నీ డిలిట్ చేసే అవకాశం ఇస్తుంది. వెబ్ సైట్ లింక్ క్రింద ఉంది.
ఏలా పనిచేస్తుంది?
ఏ ఈమెయిలు ఐడి అయితే ఇంటర్నెట్ లో ఉండకూడదు అనుకుంటున్నారో ఆ జిమెయిల్ ఐడి తో సైట్ లో లాగ్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు మీ emails అన్నీ చూసి, ఎన్ని సర్వీసెస్/వెబ్ సైట్స్ కు ఆ ఐడి సైన్ అప్ అయ్యింది అని తెలుసుకొని, మనకు విడివిడిగా టోటల్ లిస్టు ఇస్తుంది. ఈ లిస్టు లో మనకు నచ్చినవి ఉంచుకొని, వద్దు అనుకునేవి డిలిట్ చేసుకోవటానికి అవకాశం ఇస్తుంది.
ఏలా చేసుకోవాలి?
ఇప్పుడు మీరు పై బాక్స్ లో add to delete queue అని సెలెక్ట్ చేసుకున్నవి క్రింద Delete Queue బాక్స్ లో వస్తాయి. ఇక్కడ మీరు delete అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఆ వెబ్ సైట్ యొక్క delete సెక్షన్ లోకి వెళ్తారు. అక్కడ మీ ఈమెయిలు ఐడి ఎంటర్ చేస్తే ఆ వెబ్ సైట్ కు మీకు సంబంధం లేనట్లే. అంతే! ఇదే లాస్ట్ స్టెప్.
కామెంట్స్:
అయితే అన్నీ ఒకే సారి డిలిట్ చేసుకోవటానికి అవ్వదు. మీరు ఒక్కొకటి సెలెక్ట్ చేసుకొని డిలిట్ చేసుకోవాలి. ఇది టైం తీసుకుంటున్నప్పటికీ ఒక విధంగా మంచిది, ఎందుకంటే కొన్ని మనకు కావలసిన సైట్స్ కూడా ఉంటాయి, అందుకే manual గా ఏది డిలిట్ చేస్తున్నామో తెలుసుకోవచ్చు.