ఇటీవల ట్విట్టర్ లో ఒక యూజర్ షేర్ చేసిన వాట్సాప్ మైక్రోఫోన్ యాక్సెస్ స్క్రీన్ షాట్ మెసేజ్ తో చాలా మంది కొత్త ఆలోచనలో పడ్డారు. వాట్సాప్ ఉపయోగంలో లేని సమయంలో ఈ యాప్ ఫోన్ మైక్రో ఫోన్ ను వినియోగిస్తున్నట్లు అయన తెలిపారు.
ఈ విషయం జరిగిన తరువాత అనుమానం ప్రజల మనసుకు మెదిలింది. అదేమిటంటే 'ఏ యాప్స్ మా పర్మిషన్ లేకుండా మా మాటలు వింటున్నాయి అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే, మాకు తెలియకుండా మా ఫోన్ మా పైనే నిఘా పెడుతుందని డౌటా పడుతున్నారు.
వాస్తవానికి, ఏ యాప్స్ కి ఎటువంటి పర్మిషన్ ఇవ్వాలో మీకు తెలిసి ఉండాలి. లేకుంటే, మీకు తెలియని ప్రతి యాప్ కి మీరు అన్ని పర్మిషన్స్ ఇస్తే మీ డేటా మరియు సెక్యూరిటీకి భంగం కలగవచ్చు.
ముఖ్యంగా, మీడియా మరియు మైక్రో ఫోన్ పర్మిషన్ అని యాప్స్ కి అవసరం ఉండకపోవచ్చు.
ఈ మధ్య షోషల్ మీడియాలో వస్తున్న కధనాలను చూస్తున్న చాలా మంది ప్రజలు ఈ విషయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కానీ మీరు విషయాల గురించి చింతించాల్సిన పనిలేదు. మీరు చాలా ఈజీగా మీ ఆండ్రాయిడ్ మరియు iOS ఫోన్ లలో ఏ యాప్స్ మీ మైక్రో ఫోన్ యూజ్ చేస్తున్నాయో తెల్సుకోవచ్చు.
ఒకవేళ మీకు డౌట్ ఉంటే, ఆ యాప్ మైక్రో ఫోన్ లేదా ఇతర పర్మిషన్ లను పూర్తిగా నిలిపి వేయవచ్చు
దీనితో మీకు ఎటువంటి అనుమానాలకు తావు ఉండదు మరియు ఆ యాప్స్ మీ మైక్రో ఫోన్ లేదా మీడియా లేదా కాంటాక్ట్స్ వంటి వివరాలను ఉపయోగించ లేవు.
కొన్ని యాప్స్ ఇన్ స్టాల్ సమయంలో అన్ని పర్మిషన్స్ తీసుకున్నా తరువాత ఆ యాప్ లో అవసరాన్ని బట్టి కొన్ని పర్మిషన్స్ ని నిలిపి వేసే అవకాశం ఉంటుంది.
దీనికోసం, మీరు మీ ఫోన్ లో 'Settings' ను ఓపెన్ చెయ్యాలి (iOS మరియు Android)
తరువాత iOS ఫోన్లలో Privacy & Security ట్యాబ్ ను ఎంచుకోవాలి. Android ఫోన్లలో అయితే Privacy Protection ట్యాబ్ ను ఎంచుకోవాలి.
మీ ఫోన్ లో ఏ యాప్స్ రీసెంట్ గా మీ మైక్రోఫోన్, కెమేరా, లొకేషన్ లేదా మీడియా వంటి వాటి పైన పనిచేశాయి లేదా పని చేస్తున్నాయో క్లియర్ అండ్ డీటెయిల్ గా తెలుసుకోవచ్చు.
ఇక్కడ ఫోటోలో చూపించిన విధంగా మీ ఫోన్ లో ఏ యాప్స్ మీ మైక్రోఫోన్ లేదా కెమేరా ఉపయోగించాయో, ఎప్పుడు ఉపయోగించేయో చూడవచ్చు.
దీనికోసం, మీరు మీ ఫోన్ లో 'Settings' ను ఓపెన్ చెయ్యాలి (iOS మరియు Android)
తరువాత iOS ఫోన్లలో Privacy & Security ట్యాబ్ ను ఎంచుకోవాలి. Android ఫోన్లలో అయితే Privacy Protection ట్యాబ్ ను ఎంచుకోవాలి.
ఇక్కడ ఆండ్రాయిడ్ యూజర్లు Privacy Dashboard ను ఎంచుకోవాలి మరియు iOS యూజర్లు App Privacy Report ను ఎంచుకోవాలి
ఇక్కడ మీ ఫోన్ లో రీసెంట్ గా ఉపయోగించబడిన వాటి వివరాలను మరియు యాప్ వివరాలను చూడవచ్చు
మీకు ఏదైనా యాప్ పైన అనుమానం వచ్చినా లేదా ఆ యాప్ మీ కెమేరా లేదా మైక్రోఫోన్ లేదా మీడియా ఫైల్స్ ను ఉపయోగించడం మీకు ఇష్టం లేకున్నా, దానికి పర్మిషన్ ను నిలిపివేయవచ్చు
దీనికోసం Permission Manager ట్యాబ్ ను ఓపెన్ చేసి ఏ యాప్స్ మీ నుండి ఏ పర్మిషన్స్ పొందాయో చూసి, వాటిని రీసెట్ చేసుకోవచ్చు.
ఇందులో, లొకేషన్, కెమేరా, మైక్రోఫోన్ మరియు ఇతర వాటికి పర్మిషన్ ను మీరు రే సెంట్ చేసుకోవచ్చు. Don't Allow లేదా Ask Every time లేదా Allow Only While using the App ను ఎంచుకోవడం ద్వారా యాప్ పర్మిషన్ ను రీసెట్ చేసుకోవచ్చు.
మీ వాట్సాప్ లో ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే జర భద్రం..ఎందుకో తెలుసుకోవడానికి Click Here