ఈ నవీన నవీన యుగంలో వాట్సాప్ ప్రజల జీవితాల్లో ఒక భాగంగా మారిపోయింది. ఆఫీస్ వర్క్, స్కూల్ వర్క్ లేదా సన్నిహితులతో పాటుగా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండడానికి వాట్సాప్ సహాయం చేస్తుంది.
ఎక్కువగా వాట్సాప్ నే ప్రజలు ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, వాట్సాప్ లో మన Whatsapp DP ఫోటో లేదా Whatsapp స్టేటస్ ద్వారా అందరికి మన గురించి చెబుతాం.
అయితే, మన స్టేటస్ లేదా డిస్ప్లే పిక్చర్ (DP) ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది.
Advertisements
కొన్ని సార్లు మన స్నేహితులు లేదా సన్నిహితులు లేదా మనకు తెలిసిన వారితో మనకు మనస్పర్థలు ఏర్పడతాయి. అటువంటి సమయంలో, మనం వారిని మన వాట్సాప్ అకౌంట్ నుండి బ్లాక్ చెయ్యడం లేదా తొలిగించడం వంటి పనులు చేస్తాము.
మనం డిలీట్ లేదా బ్లాక్ చేసిన వారితో పాటుగా ఇంకా ఎవరెవరు మీ Whatsapp DP ఫోటో చూశారో ఇలా తెలుసుకోవాలని మీకు కుతూహలంగా ఉండవచ్చు.
మీ Whatasapp స్టేటస్ ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ, ఈరోజు మీ Whatsapp DP ఫోటో చూశారో ఎలా తెలుసుకోవాలి? అని తెలుసుకుందాం.
Advertisements
మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవడానికి ఒక Android app డౌన్ లోడ్ చేసుకోవలసి వుంటుంది. Who Viewed My Whatsapp Profile లేదా Whats Track యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ Google play Store నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మీ ఫోన్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తరువాత రన్ చెయ్యడానికి కొంత సమయం పడుతుంది.
ఈ టైమ్ లో మీ వాట్సాప్ కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ లేదా డిస్ప్లే పిక్చర్(DP) ని ఎవరెవరు చూశారనే వివరాలను సేకరిస్తుంది.
Advertisements
తరువాత, ఈ యాప్ లో మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను చూసిన స్నేహితుల లేదా ఇతరుల మొబైల్ నెంబర్లు మరియు పేర్లను పొందుతారు.
అయితే, ఈ యాప్ కేవలం 24 గంటల వ్యవధిలో మీ వాట్సాప్ ప్రొఫైల్ చూసిన వారి వివరాలను మాత్రమే ఈ జాబితాలో అందిస్తుంది.
ఇందులో, మొదటిగా విజిటర్ ఎవరు అని తెలుసుకోవచ్చు. తరువాత, ఆ విజిటర్ ఎప్పుడు ఈ ప్రొఫెల్ చూశారో చూడవచ్చు. చివరిగా, విజిటర్ యొక్క కాంటాక్ట్ వివరాలను కూడా చూడవచ్చు.