చాలా తక్కువ ధరకే వస్తుందని ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ ను ఎటువంటి చెక్ చెయ్యకుండా తీసుకుంటున్నారా? అయితే, మీకు కొత్త తలనొప్పి మొదలుకావచ్చు.
ఎందుకంటే, ఫోన్ ఒరిజినల్ అయితే మీకు ఎటువంటి సమస్య ఉండదు, ఒకవేళ కొట్టుకొచ్చిందయితే ఇక మీ పని అంతే.
అందుకే, మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునే ముందుగా ఆ ఫోన్ ఒరిజినల్ అవునా లేక కాదా అనే విషయం మీరు నిర్ధారించుకోవడం మంచిది.
అంటే, మీరు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునే ముందుగా ఖచ్చితంగా చెక్ చేసి మాత్రమే తీసుకోవడం నూరుకు నూరు శాతం ఉత్తమం.
ఎలా చెక్ చెయ్యాలి ?
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ నుండి మీరు తీసుకోదలుచుకున్న ఫోన్ IMEI నంబర్ తో ఫోన్ ఒరిజినల్ అవునా లేక డూప్లికేట్ లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉన్నదా అని ఇక్కడ వెరిఫికేషన్ చెయ్యొచ్చు.
ఈ ఎలా చెక్ చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూడండి.
ముందుగా CEIR పోర్టల్ లోకి వెళ్ళండి
ఇక్కడ మైన్ పేజ్ లో అప్లికేషన్ లోకి వెళ్ళండి
ఇక్కడ మీకు Know Your Mobile APP మరియు IMEI Verification అనే రెండు అప్షన్స్ వస్తాయి.
వీటిలో, IMEI Verification అనే రెండవ అప్షన్ ఎంచుకోండి
ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP పొందండి
మీకు అందిన OTP ఎంటర్ చేసి ఎంటర్ చేయండి
ఇక్కడ మీరు IMEI కోసం సూచించిన బాక్స్ లో ఇమేజ్ నంబర్ ఎంటర్ చేయండి
ఒకవేళ మీరు తీసుకోవాల్సిన ఫోన్ IMEI నంబర్ తెలియక పొతే *#06# తో తెలుసుకోవచ్చు
చివరిగా, మీరు IMEI ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు స్టేటస్ వివరాలు అందించబడతాయి.
అంతే, మీ ప్రాసెస్ మొత్తం పుర్తయింది మరియు మీరు కోరుకున్న మొబైల్ పూర్తి వివరాలు చూడవచ్చు.