అడిగిన ప్రతి పనికి లేదా అవసరానికి మీ ఆధార్ కార్డును ఉపయోగించడం వలన మీ ఆధార్ కార్డ్ వివరాలు ఎక్కడెక్కడ ఉపయోగించారు, అనే విషయం మీకు గుర్తుండక పోవచ్చు.
ప్రస్తుతం ఆధార్ కార్డ్ అన్ని అవసరాలకు ఉపయోగపడే ప్రధాన పత్రం కాబట్టి, ఆధార్ ను ఇంకెవరైనా ఉపయోగిస్తున్నారా లేదా ఎక్కడైనా తప్పుగా ఉపయోగించారో పరిశీలించడం మంచిది.
ఎటువంటి అవసరానికైనా ముందుగా అడిగే ఆధార్ కార్డ్ ను మీరు ఎక్కడెక్కడ ఇచ్చారో లేదా ఉపయోగించారో తెలుసుకోవడం చాల సులభం.
1. ముందుగా ప్రభుత్వ అధికారిక UIDAI యొక్క https://resident.uidai.gov.in లింక్ ఓపెన్ చేయాలి.
2. ఇక్కడ మీరు పైన సూచించిన ఎంపికల్ల్లో My Aadhaar లోకి వెళ్ళాలి
4. పేజ్ ఓపెన్ అయిన తరువాత సూచించిన దగ్గర మీ 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి మరియు అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ కూడా నమోదు చేసి ఎంటర్ చేయాలి.
5. ఈ విధంగా చేసినతరువాత మీకు మీ యొక్క నమోదుకాబడిన (Registered) మొబైల్ నంబర్ కి OTP వస్తుంది. ఈ OTP కేవలం ముందుగా నమోదు చేయబడిన మొబైల్ నంబరుకు మాత్రమే వస్తుంది.
6. మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేసిన తరువాత మీరు ఆధార్ పేజీ వివరాల్లోకి వెళతారు, ఇక్కడ మీరు మీకు సంబంధించిన వివరాలను చూడొచ్చు.
7. అయితే , ఇక్కడ మీరు ఏయే వివరాలు కావాలనుకుంటున్నారో వాటిని మీరు ఎంచుకోవలసి ఉంటుంది.
8. ఉదాహరణకి : డేట్ ఎంచుకోవడం ద్వారా ఈ డేట్ పరిధిలో ఏవిధమైన సౌకర్యాలకు ఈ కార్డు వాడబడిందో తెలుస్తుంది.
9. అయితే ఇక్కడ ఎవరు వాడారన్న విషయం మాత్రం తెలుసుకునే వీలులేదు.
ఈ విదంగా మీ ఆధార్ కార్డు ను ఎక్కడ ఎక్కడ ఇచ్చారో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
వాట్సాప్ లోని బెస్ట్ ఫీచర్స్ మరియు బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకోవడానికి. Click here
నంబర్ సేవ్ చేయకుండా Whatsapp లో మెసేజ్ సెండ్ చేసే బెస్ట్ ట్రిక్ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఇక్కడ చూడండి. నంబర్ ను సేవ్ చెయ్యకుండగానే చాలా సింపుల్ గా మెసేజ్ ను సెండ్ చేసే మూడు ట్రిక్స్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ అందించాను.
ముందుగా మీరు మెసేజ్ చేయాలనుకుంటున్న నంబర్‌ను మీకు మీరే సెండ్ చేయండి. ఇప్పుడు మీరు సెండ్ చేసిన నంబర్‌పై ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్‌లు కనిపిస్తాయి.
ఇందులో, చాట్, కాల్ మరియు యాడ్ నంబర్ 3 అప్షన్స్ ఉంటాయి. వీటిలో, మొదటి అప్షన్ Chat +(Number) ను ఎంచుకోండి.
మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న Whatsapp గ్రూప్ లోని వ్యక్తి పేరు పై ఒకసారి నొక్కండి. ఇప్పుడు మీ ముందు 3 ఆప్షన్లు కనిపిస్తాయి. మీ అవసరం ప్రకారం ఒక అప్షన్ ఎంచుకోండి.
ఇంటర్నెట్ బ్రౌజర్‌లో https://wa.me/country-code-phone-number అనిటైప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక కొత్త పేజీ తెరవబడుతుంది.
ఇక్కడ Continue to chat పై నొక్కండి మరియు ఇప్పుడు whatsapp chat box ఓపెన్ అవుతుంది. అంతే, ఇక్కడ మీరు మీ చాట్ ను స్టార్ట్ చేయవచ్చు.
ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన స్మార్ట్ ఫోన్స్ మరియు వాటి వివరాలు తెలుసుకోండి.! Click Here