ఎటువంటి అవసరానికైనా ముందుగా అడిగే ఆధార్ కార్డ్ ను మీరు ఎక్కడెక్కడ ఇచ్చారో లేదా ఉపయోగించారో తెలుసుకోవడం చాల సులభం.
వాస్తవానికి, అడిగిన ప్రతి పనికి లేదా అవసరానికి మీ ఆధార్ కార్డును ఉపయోగించడం వలన మీ ఆధార్ కార్డ్ వివరాలు ఎక్కడెక్కడ ఉపయోగించారు, అనే విషయం మీకు గుర్తుండక పోవచ్చు.
కానీ, మీ ఆధార్ కార్డును మీరు ఎక్కడెక్కడ వాడబడిందో తెలుసుకోవడం చాలా సులభం.
మీ ఆధార్ కార్డ్ ఎక్కడ, ఎందుకు ఉపయోగించారు అనేవిషయాన్ని తెలుసుకోవడానికి మీరు అనుసరించవలసిన విధానాన్ని స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకోండి.
1. ముందుగా ప్రభుత్వ అధికారిక UIDAI యొక్క https://resident.uidai.gov.in లింక్ ఓపెన్ చేయాలి.
2. ఇక్కడ మీరు పైన సూచించిన ఎంపికల్ల్లో My Aadhaar లోకి వెళ్ళాలి
3. ఇక్కడ మీరు Aadhaar Services లోకివెళ్ళి అందులో Aadhaar Authentication History ని ఎంచుకోవాలి
4. పేజ్ ఓపెన్ అయిన తరువాత సూచించిన దగ్గర మీ 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి మరియు అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ కూడా నమోదు చేసి ఎంటర్ చేయాలి.
5. ఈ విధంగా చేసినతరువాత మీకు మీ యొక్క నమోదుకాబడిన (Registered) మొబైల్ నంబర్ కి OTP వస్తుంది. ఈ OTP కేవలం ముందుగా నమోదు చేయబడిన మొబైల్ నంబరుకు మాత్రమే వస్తుంది.
6. మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేసిన తరువాత మీరు ఆధార్ పేజీ వివరాల్లోకి వెళతారు, ఇక్కడ మీరు మీకు సంబంధించిన వివరాలను చూడొచ్చు.
7. అయితే , ఇక్కడ మీరు ఏయే వివరాలు కావాలనుకుంటున్నారో వాటిని మీరు ఎంచుకోవలసి ఉంటుంది.
8. ఉదాహరణకి : డేట్ ఎంచుకోవడం ద్వారా ఈ డేట్ పరిధిలో ఏవిధమైన సౌకర్యాలకు ఈ కార్డు వాడబడిందో తెలుస్తుంది.
9. అయితే ఇక్కడ ఎవరు వాడారన్న విషయం మాత్రం తెలుసుకునే వీలులేదు.
ఈ విదంగా మీ ఆధార్ కార్డు ను ఎక్కడ ఎక్కడ ఇచ్చారో చాలా సులభంగా తెలుసుకోవచ్చు
సెక్యూరిటీ ఇష్యు కారణముగా https://resident.uidai.gov.in కొన్ని సార్లు ఓపెన్ కాకపోవచ్చు. కొంత సమయం ఆగి మళ్ళీ ప్రయత్నించండి.