పెరుగుతున్న టెక్నాలజీ మరియు దానికి అనుగుణంగా మారుతున్న పోకడలతో ఆన్లైన్ మోసాలు మరింత పెరిగిపోయాయి.
ఇందులో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలే ఎక్కువ, అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇన్‌స్టాగ్రామ్ స్కామ్స్ అనేది ఇప్పుడు భారతీయులను ఎక్కువగా భయపెడుతున్న సమస్య
ఇన్‌స్టా లో జస్ట్ ఫింగర్ టిప్స్ పైన వీడియోలను ఎంజాయ్ చెయ్యడం యూజర్లకు పరిచయం ఉన్న విషమైతే, కొందరికి మాత్రం దీని చీకటి కోనం పరిచయం అవుతుంది.
తాము మోసపోయాము అని వారికి తెలియకుండానే మిగిలిపోయే వారు కూడా ఉన్నారంటే, ఈ సమస్య యొక్క తీవ్రత అర్ధం చేసుకోవచ్చు
అందుకే, ఇన్‌స్టాగ్రామ్ స్కామ్స్ మరియు వాటి నుండి జాగ్రత్త పడటానికి మీరు ఏమి చెయ్యాలో ఈరోజు తెలుసుకోండి.
వాస్తవానికి, ఈ స్కామ్స్ మరియు వీటి నుండి ఎలా జాగ్రత్త పడాలనే విషయాలను ఇన్‌స్టాగ్రామ్ స్వయంగా వివరించింది.
దీనికి సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే 'ప్రలోభం మోసాలకు మొదటి కారణం'. మీకు ఏదో ఒక ఎరవేసి మిమ్మల్ని బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తారు.
ఇన్‌స్టాగ్రామ్ స్కామ్స్ లో ప్రధానంగా జరిగే మోసాలు వారి ప్రలోభ పెట్టె అంశాలు ఇక్కడ చూడవచ్చు.
ఆర్ధికమాంద్యం కారణంగా నెలా కొన్న ఉద్యోగాల కొరతను క్యాష్ చేసుకుంటున్నారు ఇన్‌స్టాగ్రామ్ స్కామర్లు.
ఇంటి వద్ద ఆన్లైన్ జాబ్ అఫర్ ఉంది ఈ లింక్ ద్వారా మీ వివరాలను సబ్ మీట్ చేయండి అంటూ పోస్ట్ మోసం చేస్తున్నారు.
ప్రేమ లేదా రొమాంటిక్ వీడియో కాల్ అంటూ రొమాంటిక్ వీడియోలతో ట్రాప్ చేస్తారు. నమ్మితే నట్టేట ముంచేస్తారు.
మీరు ఏదో లాటరీ తగిలిందని క్లయిమ్ చేసుకోవడానికి ఈ లింక్ పైన నొక్కండి లేదా మమల్ని సంప్రదించండి అని నమ్మకంగా మోసం చేస్తారు జాగ్రత్త.
ఎటువంటి షూరిటీ లేకుండా 5 నిముషాల్లో లోన్ పొందండి. వారిని నమ్మి మీ వివరాలను ఇచ్చారో మిమల్ని ముప్ప తిప్పలు పెడతారు.
హాఫ్ రేటుకే ప్రీమియం OTT సబ్ స్క్రిప్షన్ అఫర్ అంటూ మిమ్మల్ని ప్రలోభ పెడతారు. వాస్తవానికి, ఆన్ సైట్ తప్ప అటువంటి ఆఫర్లు OTT ప్లాట్ ఫామ్స్ అందించవు.
మరి ఈ ఇన్‌స్టాగ్రామ్ స్కామ్స్ నుండి మీరు ఎలా సురక్షితంగా ఉండాలి? అని మీకు డౌట్ రావచ్చు. చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తే మీరు ఈ స్కామ్స్ నుండి సురక్షితంగా ఉండవచ్చు. అవేమిటో క్రింద చూడండి.
ముందుగా, మీ అకౌంట్ కి two-factor అతంటికేషన్ ని సెట్ చేసుకోండి. ఈ ఫీచర్ ద్వారా మీ అకౌంట్ లాగిన్ మరింత సెక్యూర్ గా ఉంటుంది
మీకు తెలియని లాగిన్ లింక్స్ ను అనుసరించకండి. ఇది ఇన్‌స్టాగ్రామ్ లో ఫిషింగ్ ఇమెయిల్ మోసానికి ప్రధాన ద్వారం
ఎల్లప్పుడూ అఫీషియల్ అకౌంట్స్ కోసం వెతకండి. అఫీషియల్ అకౌంట్స్ వెరిఫై చేయబడతాయి కాబట్టి వాటినే ఎంచుకోండి. యూజర్ పేరు పక్కన బ్లూ టిక్ ఈ అకౌంట్స్ కనిపిస్తాయి.
మీ డివైజ్ లో యాంటీ వైరస్ ను ఇన్స్టాల్ చేసుకోవడం ఎల్లవేళలా మంచిది. ఇది అనేక వైరస్ మరియు మాల్వేర్ ల నుండి తప్పు వెబ్సైట్ ల నుండి రక్షిస్తుంది.
మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని ఫాలో అవుతుంటే కూడా మీరు జాగ్రత్త పడడం మంచిది. అంటే, తనంతట తానుగా మీ అకౌంట్ ను ఫాలో చేస్తూ, మీ నమ్మకాన్ని పొందడానికి చూసే వారిని బ్లాక్ చేయడం మంచిది.
మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని ఫాలో అవుతుంటే కూడా మీరు జాగ్రత్త పడడం మంచిది. అంటే, తనంతట తానుగా మీ అకౌంట్ ను ఫాలో చేస్తూ, మీ నమ్మకాన్ని పొందడానికి చూసే వారిని బ్లాక్ చేయడం మంచిది.
మీ అకౌంట్ లో Login Alerts ని సెట్ చేసుకోండి. ఇది మీ అకౌంట్ లాగిన్ అయిన ప్రతిసారి మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది
షోషల్ మీడియాలో కామన్ మరియు ఎక్కువగా జరిగే స్కామ్స్ తో పాటుగా వాటి నుండి ఎలా సురక్షితంగా ఉండాలో Instagram Help ద్వారా వివరణ ఇచ్చింది. ఈ వివరాలను చూడటానికి Instagram Help పైన క్లిక్ చేయండి