నిన్న హానర్ నుండి 5X మరియు Holly 2 ప్లస్ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. 5X గత సంవత్సరం అక్టోబర్ లో చైనాలో రిలీజ్ కాగా Holly 2 ప్లస్ ఇండియాలోనే మొదటి లాంచ్ ప్రపంచ వ్యాప్తంగా. ఈ రోజు Holly 2 ప్లస్ యొక్క ఫర్స్ట్ లుక్స్ ను ఇక్కడ చూడండి. దీని ధర 8,499 రూ.
ముందుగా key స్పెక్స్..
డిస్ప్లే: 5 అంగుళాల 720
SoC: మీడియా టెక్ 6735P
RAM: 2GB
స్టోరేజ్: 16GB మైక్రో SD కార్డు మద్దతు
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 4000mAh
5 in 720P panel బ్రైట్ గా ఉంది కలర్ saturation కూడా బాగున్నట్లు అనిపిస్తుంది. వ్యూయింగ్ angles కూడా బాగున్నాయి. బడ్జెట్ సెగ్మెంట్ లో one అఫ్ the బెస్ట్ డిస్ప్లే అని చెప్పవచ్చు.
ఒరిజినల్ holly మోడల్ కు బాగా polish చేసినట్లు అనిపిస్తుంది దీని డిజైన్. రౌండ్ edges, బ్లాక్ బెజేల్స్ తో నేవిగేషన్ బటన్స్ కూడా స్క్రీన్ లోకి వెళ్ళిపోయాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ weave లాంటి pattern కలిగి ఉంది.
ఫోన్ ప్లాస్టిక్ తో తయారు అయ్యింది కాని మెటల్ ఫినిష్ తో వస్తుంది సైడ్స్ లో. competing ఫోన్ల కన్నా 30% అధిక సౌండ్ వస్తుంది అని కంపెని ప్రోమోట్ చేస్తుంది.
పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మీడియా టెక్ 6735P 1.3GHz ప్రాసెసర్ 2GB ర్యామ్ తో రావటం వలన quite స్మూత్ ఆగా ఉంది మేము గడిపిన షార్ట్ టైమింగ్ లో. మొదటి holly కన్నా బాగా ఫాస్ట్ గా ఉంది.
13MP రేర్ కెమెరా మంచి అప్ గ్రేడ్ మొదటి మోడల్ నుండి. ఫ్రంట్ 5MP ఉంది. కొన్ని ఇమేజెస్ తీయటం జరిగింది కాని ఫైనల్ రివ్యూ లో కెమెరా పై అభిప్రాయం వేల్లడిస్తాము.
బ్యాక్ కవర్ రిమూవ్ చేస్తే లోపల 4000 mah బ్యాటరీ ఉంది. almost రెండు రోజులు usage ఈజీగా వస్తుంది
రెండు సిమ్ స్లాట్స్ మరియు సెపరేట్ sd కార్డ్ స్లాట్ ఉంది.
ఓవర్ ఆల్ Holly 2 ప్లస్ మంచి అవుట్ పుట్ తో వస్తుంది. లార్జ్ బ్యాటరీ అండ్ deliverable పెర్ఫార్మెన్స్. కంప్లీట్ రివ్యూ లో దీని పై conclusion ఇస్తాము.