2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది May 14 2019
2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

2019 సంవత్సరం, స్మార్ట్ ఫోన్లకు మంచి శుభారంభాన్ని అందించి. ఎందుకంటే, ఈ సంవత్సరంలో ప్రారంభం నుండే అనేకమైన సరికొత్త స్మార్ట్  ఫోన్లు, అంకేమైనా బ్రాండ్స్ ద్వారా అందించబడ్డాయి. వీటిలో కొన్ని ఇప్పటి వరకు చూడనటువంటి సరికొత్త టెక్నాలజితో వచ్చాయి. ఇక ధరల విషయంలో కూడా చెప్పుకోదగ్గ మార్పులే జరిగాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో కూడా 32MP సెల్ఫీ,ట్రిపుల్ కెమేరా, బెస్ట్ ప్రాసెసర్ మరియు వాటర్ డ్రాప్ నోచ్ వంటి అనేకమైన  చాలా గొప్ప మార్పులు  కూడా సంభవించాయి . 

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

1. HUAWEI P30 PRO

ఈ హువావే P30 స్మార్ట్ ఫోన్ ఒక అద్భుతమైన కెమేరా ఫోనుగా ఉంటుంది. దేనితో, DSLR క్వాలిటీలో ఫోటోలను మరియు వీడియోలను తీసుకోవచ్చు. అలాగే, ఇది ఒక  6.47-అంగుళాల పూర్తి HD + కర్వ్డ్  OLED డిస్ప్లే, ఒక 2340x1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ (DCI-P3 HDR), మరియు 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. P 30 ప్రో ఒక డ్యూయల్ -NPU తో 7nm కిరిన్ 980 ప్రాసెసర్ కలిగివుంటుంది. దీన్ని రూ.71,990 ధరతో అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.  (LINK) పైన క్లిక్ చేసి నేరుగా కొనవచ్చు.                     

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

2. HUAWEI P30 LITE

ఈ హువావే P30 స్మార్ట్ ఫోతో కూడా DSLR క్వాలిటీలో ఫోటోలను మరియు వీడియోలను తీసుకోవచ్చు. ఈ P30 ఒక 6.15 -అంగుళాల పూర్తి HD + TFT LCD IPS పానెల్, 2340x1080 పిక్సెళ్ళ రిజల్యూషనుతో మరియు 19.5:9 వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది మరియు ఒక కిరిన్ 710 ఆక్టా కోర్  ప్రాసెసర్ కలిగివుంటుంది. అయితే, ఇది కేవలం 4GB RAM మరియు 128GB స్టోరేజితో మాత్రమే అందించబడుతోంది. దీన్ని రూ.19,990 ధరతో అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. (LINK) పైన క్లిక్ చేసి నేరుగా కొనవచ్చు.

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

3. SAMSUNG GALAXY A50              

ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియంగా ఉంటుంది.  ఈ ఫోన్ ఒక  6.4 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. ఇది వెనుక 8MP+25MP +5MP  ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. A50  స్మార్ట్ ఫోన్ ఒక Exynos 9610 ఆక్టా - కోర్ ప్రాసెసర్ మరియు జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. ఇది ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్  ఫోన్ను Flipkart నుండి  Amazon నుండి రూ. 19,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. 

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

4. REDMI NOTE 7 PRO  

ఇండియాలో మిడ్ రేంజ్ ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా, అదీకూడా SONYIMX586 సెన్సారుతో ఒక స్మార్ట్ ఫోన్, కేవలం షావోమి మాత్రమే అందించింది. కేవలం, కెమేరా మాత్రమే కాదు ఒక స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసరుతో మంచి స్పీడ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB మరియు 6GB వంటి ర్యామ్ ఎంపికలతో కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్  ఫోన్ యొక్క మరొక ఫ్లాష్ సేల్  ఏప్రిల్ 28న మధ్యాహ్నం 12 గంటలకి Flipkart నుండి జరుగుతుంది. (LINK) పైన క్లిక్ చేసి నేరుగా కొనవచ్చు.                       

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

5. REALME 3 PRO

రియల్మీ 3 ప్రో  స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8%  స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది. 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519  సెన్సారుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ Flipkart మరియు realme.com  నుండి ఏప్రిల్ 29 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది.  

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

6. SAMSUNG GALAXY M30

శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ - U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ఎక్సినోస్ 7904  ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 13MP +5MP+5MP  ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఏప్రిల్ 30 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి Amazon.in నుండి కొనుగోలు చేయవచ్చు.

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

7. REDMI NOTE 7

ఇటీవల భారతదేశంలో మంచి స్పెక్స్ తో, 10,000 రూపాయల కంటే తక్కువధరలో షావోమి నుండి వచినటువంటి స్మార్ట్  ఫోనుగా, ఈ రెడ్మి నోట్ 7 గురించి చెప్పొచ్చు. ఇది ముందు మరియు వెనుకా కూడా ఒక గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది మరియు ఒక 2.2GHz వద్ద క్లాక్ చెయ్యబడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 AIE ప్రొసెసరుతో మంచి పెరఫార్మెన్సు అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు Flipkart నుండి ఓపెన్ సేల్ తో అందుబాటులో వుంది. (LINK) పైన క్లిక్ చేసి నేరుగా కొనవచ్చు.     

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

8. SAMSUNG GALAXY A30

ఇది ఒక 6.4 అంగుళాలసూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. ఇది వెనుక భాగంలో 16MP+5MP  డ్యూయల్ కెమెరాతో పాటుగా ముందు 16MP సెల్ఫీ కెమేరాతో అందించబడింది మరియు ఇది ఒక 3D Arc డిజన్ తో వస్తుంది. అలాగే ఒక 4,000 mAh బ్యాటరీ ఇందులో అందించింది. ఈ ఫోన్, ఒక Exynos 7904 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో 4GB ర్యామ్ జతగా వస్తుంది.  ఈ ఫోన్ రెడ్, బ్లూ ,బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఈ స్మార్ట్  ఫోన్ను Flipkart నుండి  Amazon నుండి రూ. 16,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. 

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

9. XIAOMI REDMI  Y3

షావోమి సంస్థ నుండి కేవలం రూ.9,999 ధరలో 32MP సెల్ఫీ కెమేరాతో ఇండియాలో విడుదల చేయబడినటువంటి, ఈ స్మార్ట్ ఫోన్, 1.8 GHz వద్ద క్లాక్ చేయబడిన,  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 12+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999 ప్రారంభ ధరతో లభిస్తుంది మరియు దీని యొక్క మొదటి సేల్  ఏప్రిల్ 30వ తేది 12గంటలకి mi.com మరియు AMAZON నుండి జరగనుంది.  

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

10. INFINIX SMART 3 PLUS 

ఇన్ఫినిక్స్ సంస్థ నుండి కేవలం రూ.6,999 ధరలో మూడు కెమెరాలతో, ఇటీవల ఇండియాలో లాంచ్ చేయబడినటువంటి ఈ స్మార్ట్ 3 ప్లస్ స్మార్ట్ ఫోన్, ఒక పెద్ద 6.4 అంగుళాల HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది.  ఇది ఒక  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మరియు ఇది 2GB ర్యామ్ మరియు 16GB అంతర్గత మెమొరీతో వస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఒక 3,500 mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 30 ఉదయం 10 గంటలకి Flipkart నుండి మొదలవుతుంది. 

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

11. XIAOMI REDMI  7

ఈ నెలలో భారతదేశంలో మంచి స్పెక్స్ తో, కేవలం రూ.7,999 రూపాయల ప్రారంభ ధరలో షావోమి నుండి వచినటువంటి ఈ స్మార్ట్  ఫోన్, డిజైన్ పరంగా గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఒక 1.8GHz వద్ద క్లాక్ చెయ్యబడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్  ప్రొసెసరుతో మంచి పెరఫార్మెన్సు అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 29 మధ్యాహ్నం 12గంటలకి  mi.com మరియు అమేజాన్ నుండి జరగనుంది. 

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

12. REALME C2

ఇటీవల విడుదల చేరిన ఈ రియల్మీ C2 , 2GHz వద్ద క్లాక్ చేయబడిన, మీడియా టెక్ హీలియో P22ప్రాసెసర్ శక్తికి జతగా 2GB/3GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 16GB/32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 13+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.5,999 ప్రారంభ ధరతో లభిస్తుంది మరియు దీని యొక్క మొదటి సేల్  మే 15వ తేదికి జరగనుంది.         

 

2019 సంవత్సరం ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసా ?

13. SAMSUNG GALAXY A10

ఇది ఒక 6.2 అంగుళాల HD+ ఇన్ఫినిటీ v- డిస్ప్లేతో ఉంటుంది. అంటే, V వలనే ఉండే ఒక వాటర్ డ్రాప్ నోచ్ అన్నమాట. ఒక దీని ఆప్టిక్స్ పరంగా చూస్తే, ఇది వెనుక భాగంలో కేవలం 13MP సింగిల్ కెమెరాతో పాటుగా ముందు 5MP సెల్ఫీ కెమేరాతో అందించబడింది.  ఒక Exynos 7884 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో 3GB ర్యామ్ జతగా వస్తుంది.  ఈ ఫోన్ రెడ్, బ్లూ ,బ్లాక్ రంగులలో లభిస్తుంది మరియు ఒక 3,400 mAh బయటరీతో వస్తుంది. ఈ స్మార్ట్  ఫోన్ను Flipkart నుండి  Amazon నుండి రూ. 8,490 ధరతో కొనుగోలు చేయవచ్చు.