నిన్న లాంచ్ అయిన మైక్రోసాఫ్ట్ కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్స్ లుమియా 950,950XL అండ్ dock క్లోజ్ పిక్స్. మేము లాంచ్ ఈవెంట్ లో పాల్గొనటం జరిగింది. సో ఇక్కడ మేము సేకరించిన ఇన్ఫర్మేషన్ అండ్ పిక్స్. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.
ఇది లుమియా 950 XL. ధర: 49.399 కేవలం పెద్ద స్క్రిన అనే కాదు, పవర్ ఫుల్ కూడా
డిస్ప్లే: 5.7 అంగుళాల, 2K SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 810 RAM: 3GB స్టోరేజ్: 32GB కెమెరా: 20MP, 5MP బ్యాటరీ: 3340 ఎమ్ఏహెచ్ OS: Windows 10
రెండింటికీ 2K క్లియర్ బ్లాక్ డిస్ప్లే ఉంది. మంచి వ్యూయింగ్ angles. టచ్ sensitivity టాప్ notch. సన్ లైట్ విసిబిలిటి కూడా బాగుంది
రెండూ కంప్లీట్ గా polycarbonate మేటేరియాల్ తో తయారు అయ్యాయి. అన్ని లుమియా ఫోన్స్ ఈ మేటేరియాల్ తోనే ఉన్నాయి గతంలో కూడా. కాని ప్రస్తుతం ఇతర మొబైల్ కంపెనీలు అన్నీ ప్రీమియం లుక్స్ కోసం మెటల్ బాడీ లేదా గ్లాస్ బాడీ లతో లాంచ్ చేస్తున్నాయి ఫోన్స్ ను.
రెండింటికి 20MP ప్యూర్ view carl zeiss రేర్ లెన్స్ ఉన్నాయి. నైట్ time ఫోటోస్ కోసం 3 led లను జోడించింది కంపెని.
మొదటి సారి crispy గా కనిపించాయి ఫోటోస్. కాని ఫోటోస్ ను వెంటనే క్వాలిటీ asses చేయటం కరెక్ట్ కాదు. సో కంప్లీట్ రివ్యూ లో చూడండి. ఫోకస్ స్పీడ్ అండ్ ఇమేజ్ ప్రోసెసింగ్ స్పీడ్ అయితే బాగా ఇంప్రూవ్ అయ్యాయి.
రెండు మోడల్స్ కు usb టైప్ c పోర్ట్ ఉంది. దీని ద్వారానే డాక్ ను కనెక్ట్ చేసి ఫోన్ ను విండోస్ pc వాడుకునే అవకాశం ఉంది.
ఇదే మైక్రోసాఫ్ట్ dock. ప్రైస్ - 6 వేలు. usb టైప్ c పోర్ట్ తో లుమియా ఫోన్స్ కు కనెక్ట్ అవుతుంది. అది అవతల వైపు ఉంది. మీరు చూసే పోర్ట్స్ లో 3 usb పోర్ట్స్, 1 usb టైప్ c పోర్ట్, 1 డిస్ప్లే, 1 hdmi పోర్ట్ ఉన్నాయి.
విండోస్ ui విషయానికి వస్తే UI చాలా స్మూత్ గా ఉంది. నేవిగేట్ చేసినప్పుడు రెండు ఫోనుల్లో డిఫరెన్స్ ఏమీ కనిపించలేదు అస్సలు స్పీడ్ విషయంలో. కాని XL లో స్ప్లిట్ సెకెండ్ ఫాస్ట్ కనిపిస్తుంది 950 కన్నా