చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ కంపెనీ జియోనీ రిలయన్స్ JIO మరియు PAYTM తో తన పార్టనర్ షిప్ కుదుర్చుకుంది. దీని ద్వారా సంస్థ దాని వినియోగదారులకు అదనపు 4G డేటా మరియు నగదు వోచర్లు అందిస్తుంది.
జియోనీ తన కొత్త ఆఫర్ "జియో-Gionee అదనపు డేటా" కోసం JIO తో పార్టనర్ షిప్ పెట్టుకుంది . ఈ ఆఫర్ కింద ఎన్నో జియోనీ స్మార్ట్ ఫోన్స్ పై యూజర్స్ కి ఫ్రీ గా 4G డేటా ఇవ్వబడుతుంది. సుమారు 60జీబీ వరకు అందుకోగలరు .
PAYTM తో ఒప్పందం కుదుర్చుకుని జియోనీ తన యూజర్స్ కి 700 రూ లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్ చేస్తే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అందిస్తుంది.
"జియో-Gionee అదనపు డేటా" జియోనీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే లభ్యమవుతుంది. ఈ ఆఫర్ 16 జూన్ తరువాత కొనే జియోనీ స్మార్ట్ ఫోన్ ఫై లభిస్తుంది. వీటిలో Gionee Pioneer P5L, Gionee P7 కొంటె 2జీబీ ఎక్స్ట్రా 4జి డేటా ప్రతీ రీఛార్జ్ పై లభిస్తుంది.
అలానే Gionee Elife S6, Gionee Elife S7, Gionee Marathon M5, Gionee S Plus, Gionee S6s, Gionee F103 Pro, Gionee marathon <5 lite CDMA, Gionee Marathon M4, Marathon M5 Lite, Gionee P7 Max, and Gionee F103 లు కొంటె యూజర్స్ కి ప్రతీ రీఛార్జ్ పై 5జీబీ ఎక్స్ట్రా 4జి డేటా ప్రతీ రీఛార్జ్ పై లభిస్తుంది.
ఇవే కాక Gionee A1, Gionee Marathon M5 Plus, Gionee S6 Pro, మరియు Gionee Elife E8 స్మార్ట్ ఫోన్స్ పై 10జీబీ ఎక్స్ట్రా 4జి డేటా ప్రతీ రీఛార్జ్ పై లభిస్తుంది. జియోనీ దీనితో పాటుగా PAYTM తో చేసిన ఒప్పందం ప్రకారం Gionee A1 లేదా P7 Max కొంటె 250 రూ యొక్క రెండు PAYTM క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందుతారు .