Gionee మారథాన్ M5: ఫర్స్ట్ ఇంప్రెషన్స్ (మొదటి అభిప్రాయాలు)

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Nov 26 2015
Gionee మారథాన్ M5: ఫర్స్ట్ ఇంప్రెషన్స్ (మొదటి అభిప్రాయాలు)

6020 mah బ్యాటరీ అండ్ 3gb ర్యామ్ తో 17,999 రూ లకు Gionee మారథాన్ M5 మొబైల్ ను రీసెంట్ గా ఇండియాలో లాంచ్ చేసింది. ఇది ఫ్లిప్ కార్ట్ లో సేల్ అవుతుంది. దీని పై మేము రివ్యూ చేస్తున్నాము. త్వరలోనే కంప్లీట్ రివ్యూ వస్తుంది. ఈ లోపు మా మొదటి అభిప్రాయాలను చూడగలరు. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
 
Gionee మారథాన్ M5: ఫర్స్ట్ ఇంప్రెషన్స్ (మొదటి అభిప్రాయాలు)

డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ
బాడీ అంతా ప్లాస్టిక్ అండ్ మెటల్ తో వస్తుంది. మరీ అంత బెస్ట్ లుకింగ్ కాదు. సిమిలర్ డిజైనింగ్ తో చాలా మొబైల్స్ ఉన్నాయి. సైడ్స్ లో ఉన్న chamfered మెటల్ ప్రీమియం ఫీల్ ఇస్తుంది. కానీ 211 గ్రా తో లార్జ్ బ్యాటరీ వలన బరువు గా ఉంది. వెయిట్ అండ్ మేటేరియాల్ కారణంగా sturdy గా ఉంది ఓవర్ ఆల్ గా.

Gionee మారథాన్ M5: ఫర్స్ట్ ఇంప్రెషన్స్ (మొదటి అభిప్రాయాలు)

డిస్ప్లే అండ్ UI
5.5 in 720P HD అమోలేడ్ డిస్ప్లే ఉంది. వైబ్రెంట్ అండ్ గుడ్ బ్లాక్స్ కలర్స్ ఉన్నాయి. వ్యూయింగ్ angles కూడా బాగున్నాయి. అవుట్ డోర్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సరిగా కనిపించటం లేదు డిస్ప్లే. అమిగో 3.1UI తో లాలిపాప్ పై రన్ అవుతుంది. దీనిలో పెద్దగా కొత్త విషయాలు ఏమి లేవు.

Gionee మారథాన్ M5: ఫర్స్ట్ ఇంప్రెషన్స్ (మొదటి అభిప్రాయాలు)

పెర్ఫార్మన్స్
మీడియా టెక్ 6735 క్వాడ్ కోర్ SoC అండ్ 3gb ర్యామ్ కాంబినేషన్ ఉంది.రెగ్యులర్ UI నేవిగేషన్ స్మూత్ గా ఉంది. కాని గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే గేమింగ్ ప్రొసెసర్ పై కొంత ఒత్తిడి తెస్తుంది. ఇంతకు మించి ఇప్పుడే చెప్పటానికే అవదు, కంప్లీట్ రివ్యూ లో అంతా తెలుసుకొని తెలియజేస్తాము. దీనిలో 32gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంది.

Gionee మారథాన్ M5: ఫర్స్ట్ ఇంప్రెషన్స్ (మొదటి అభిప్రాయాలు)

బ్యాటరీ
6020 mah ఉంది దీనిలో. ఇది రెండు బ్యాటరీ లను కలిపి వస్తుంది. కంపెని 4 రోజులు పాటు ఫోన్ ను వాడవచ్చు అని చెబుతుంది సింగల్ చార్జ్ తో. అమోలేడ్ డిస్ప్లే మరింత హెల్ప్ అవుతుంది బ్యాటరీ లైఫ్ కు. మరో రెండు ఫోన్స్ కూడా దీనితో రివర్స్ చార్జింగ్ చేయటం మంచి ఫీచర్. 

Gionee మారథాన్ M5: ఫర్స్ట్ ఇంప్రెషన్స్ (మొదటి అభిప్రాయాలు)

కెమేరా
13MP రేర్ మరియు 5MP ఫ్రంట్ కెమేరా ఉన్నాయి. మా మొదటి ఇంప్రెషన్స్ లో ఇమేజెస్ బాగా వచ్చాయి. dim లైట్ లో కూడా డిటేల్స్ బాగున్నాయి. కలర్ సేచురేషన్ డిసెంట్. ఓవర్ ఆల్ గా దీనిపై ఒక ఒపినియన్ కంప్లీట్ రివ్యూ లో వస్తుంది.