మీరు ఇంకా మీ PAN CARD కోసం అప్లై చెయ్యకపోతే, కేవలం పదే పది నిమిషాల్లో మీ ఇంట్లో కూర్చొనే ఖర్చు లేకుండా కొత్త పాన్ కార్డును పొందవచ్చు. ప్రభుత్వం అందించిన సౌకర్యాలతో మీరు మీ పాన్ కార్డు ను ఆన్లైన్లో కేవలం 10 నిమిషాల్లో క్రియేట్ చెయ్యవచ్చు. మరి అది ఎలా చేయ్యాలో తెలుసుకుందామా..!
గతంలో, పాన్ కార్డు పొందాలంటే ఒక రెండు పేజీల ఫారమ్ ను పూరించడమే కాకుండా పాన్ కార్డు ఇంటికి వచ్చే వరకూ ఎన్ని రోజులైనా వేచి ఉండాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ఈ సమస్యకు ప్రభుత్వం మంచి పరిస్కారం అందించింది. Income Tax శాఖ ఇప్పుడు కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా మీ ఆధార్ కార్డు సహాయంతో కేవలం 10 నిమిషాల్లో మీ పాన్ కార్డును మీరే క్రియేట్ చేసుకోవచ్చు.
ఆన్లైన్లో పాన్ కార్డు కోసం ఎలా అప్లై చెయ్యాలో ఈరోజు తెలుసుకుందాం....
ఇక్కడ మీరు ఎడమ వైపున కనిపించే "Instant PAN through Aadhaar" పై క్లిక్ చేయాలి.
(Pink కలర్ బాక్స్ లు చూపించాము)
ఇప్పుడు మీరు కొత్త పేజీకి మళ్ళించబడతారు
ఈ పేజీలో మీరు "Get New PAN" అప్షన్ పైన నొక్కాలి.
ఇక్కడ మీరు అప్లికేషన్ చూడవచ్చు
ఇక్కడ బాక్సులో మీ ఆధార్ నంబర్ నమోదు చేయాలి మరియు OTP కోసం కాప్చా కోడ్ ఎంటర్ చెయ్యాలి.
ఆధార్ కార్డుతో రిజిష్టర్ చెయ్యబడిన రిజిష్టర్ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది.
ఇప్పుడు మీ రిజిష్టర్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చెయ్యాలి.
OTP ఇచ్చిన తరువాత, మీరు పాన్ కార్డ్ అప్లికేషన్ కోసం ఇ-మెయిల్ ఐడిని ధృవీకరించాలి.
ఈ విధంగా ఈ ఫారమ్ ను పూర్తి చేసిన తర్వాత, కేవలం 10 నిమిషాల్లో మీ పాన్ నంబర్ ను పొందుతారు మరియు దీనిని మీరు కావాలనుకుంటే PDF ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మీరు "చెక్ స్టేటస్ / డౌన్‌లోడ్ పాన్" ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఈ వెబ్‌సైట్ నుండి PDF ఫైల్ లో పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ, మీకు హార్డ్ కాపీ కావాలంటే, దాని కోసం మీరు 50 రూపాయలు చెల్లించాలి.