freedom 251, actual cost 251 rs. అదనంగా 40 rs షిప్పింగ్ charges తో 291 రూ. టోటల్ రెండు లక్షల ఫోనులు ఉన్నాయి కంపెని వద్ద ప్రస్తుతానికి. వాటిలో 5000 ఫోనులు lucky draw ద్వారా select అయిన registered users కు పంపిస్తుంది. మరిన్ని డిటేల్స్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.
4 in qHD(QHD కాదు), 1GB ర్యామ్, క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1450 mah బ్యాటరీ అండ్ ఆండ్రాయిడ్ 5.1 OS ఉన్నాయి.
కంపెని స్పెక్ షీట్ ప్రకారం ఫోనులో 3.2MP కెమెరా ఉంది. కాని ఫోన్ లోని కెమెరా యాప్ మాక్సిమం 2MP చూపిస్తుంది resolution.
ఫోన్ డిస్ప్లే dim గా మరియు reflective(అంటే మన faces అవీ కనిపిస్తాయి డిస్ప్లే పై) గా ఉంది. టచ్ పెర్ఫార్మన్స్ మరియు capacitive బటన్స్ బాలేవు అంతగా. అయితే 251 రూ లకు ఇలాంటివి ఉంటాయని expect చేసినవే.
రింగింగ్ బెల్స్, 251 ఫోన్ కు రేపటి నుండి షిప్పింగ్ స్టార్ట్ చేస్తుంది. ఫోన్ కూడా ఆల్రెడీ బయటకు రిలీజ్ చేసింది కాబట్టి ఈ సారి వాయిదా పడే అవకాశాలు లేవు కాని కేవలం 5000 మందికే మొదటి సారి షిప్పింగ్ చేస్తుంది.lucky draw లో ఎంచి సెలెక్ట్ చేసిన వారికీ మెయిల్స్ కూడా వెళ్ళాయి.
రింగింగ్ బెల్స్ కంపెని 30 రోజుల replacement గారెంటీ ఇస్తుంది ఫోనులకు. బేసిక్ feature ఫోనుల అయితే 180 days రీప్లేస్మెంట్ తో వస్తున్నాయి.