Meizu చైనా బేస్డ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్. ఇది తాజాగా ఇండియాలో మార్కెటింగ్ స్టార్ట్ చేసి M1 note ను విడుదల చేసింది. నిన్న MEIZU MX5 పేరుతో 16, 32, 64 ఇంబిల్ట్ స్టోరేజ్ వెర్షన్స్ లో 18,451 స్టార్టింగ్ ప్రైస్ తో చైనా లో కొత్త మోడల్ ను రిలీజ్ చేసింది కంపెని. కొన్ని రోజులలో ఇది ఇండియాలో రిలీజ్ అవనుంది. ఇక్కడ ఈ ఫోనులోని నాలుగు హై లైట్ అంశాలను స్లైడ్ షో లో చూడండి. నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి.
Metal Unibody Design
ఫ్రంట్ లుక్ సామ్సంగ్ గేలక్సీ S5 బ్యాక్ లుక్ ఐ ఫోన్ లాగ కనిపిస్తుంది ఇది. సిగ్నల్ మరియు రేడియో రిసెప్షన్ కొరకు వెనుక రెండు ప్లాస్టిక్ inlays మినహా బాడీ అంతా మెటల్ డిజైనింగ్ తో ఉంది. ఫ్రంట్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ కోసం ఒక ఫిజికల్ బటన్ ఉంది. కర్వ్ద్ ఎడ్జ్ 5.5 in, 7.9 mm థిక్ నెస్ తో చూడటానికి ఐ ఫోన్ 6 ప్లస్ వలే కనిపిస్తుంది. దిని బరువు 149 గ్రా.
Helio X10 ఆక్టో కోర్ ప్రొసెసర్
మీడియా టెక్ Helio X10 ఆక్టో కోర్ 2.2GHz SoC ప్రొసెసర్, LP DDR3 3జిబి ర్యామ్ దీని హై లైట్స్ అని చెప్పవచ్చు. ఇందులో PowerVR G6200 GPU గ్రాఫిక్స్ ను హ్యాండిల్ చేయనుంది. ప్రాసెసర్ మరియు మిగిలిన స్పెక్స్ వైస్ గా చూడటానికి పవర్ ఫుల్ డివైజ్ లా ఉంది. ఈ ప్రొసెసర్ ను HTC వన్ M9+ మరియు HTC వన్ ME మోడల్స్ లో మేము టెస్ట్ ఇంతకముందు టెస్ట్ చేశాం. రెండింటిలో రెగ్యులర్ టాస్క్ పెర్ఫార్మన్స్ బాగా ఇచ్చింది SoC. ఇందులో ఉన్న 3150 mah బ్యాటరీ డిసెంట్ స్టామినా బ్యాక్ అప్ ను ఇవ్వాలి.
4K వీడియో మరియు 20.7MP కెమేరా
20.7 సోనీ IMX220 మరియు f/2.2 అపెర్చార్ సిక్స్ ఎలిమెంట్ లెన్స్ కెమేరా సెన్సార్లను వాడారు. ఈ కెమేరా లెన్స్ కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. డ్యూయల్ కలర్ LED ఫ్లాష్ మరియు లేజర్ aided ఫోకస్ ప్రత్యేకతలు అని చెప్పవచ్చు.Meizu MX4 కు కూడా ఇందులో వాడిన సెన్సార్ నే వాడారు. 720P లో 100 ఫ్రేమ్స్ పర సెకెండ్(fps) లో స్లో మోషన్ వీడియోలను మరియు 4K వీడియోలను చిత్రీకరించగలదు. 5MP ఇమేజ్ సెన్సార్ తో f/2.0 అపెర్చార్ తో ఫ్రంట్ కెమేరా దీని సొంతం.
5.5 " సూపర్ AMOLED డిస్ప్లే
1080 x 1920 పిక్సెల్స్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 5.5 ఇన్ సూపర్ ఎమోలేడ్ డిస్ప్లే దీని నాలుగవ హై లైట్. ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్, Meizu Flyme OS 4.5 వెర్షన్ పై రన్ అవుతుంది ఫోన్. దీనిలో mTouch ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంది.
16GB వెర్షన్ - 18,451 రూ
32GB వెర్షన్ - 20,497 రూ
64GB వెర్షన్ - 24,598 రూ లకు ఈ ఫోన్ చైనా లో సేల్ అవుతుంది.