రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో HP పెవిలియన్ సిరిస్ లాప్టాప్, స్పెక్ట్రా నోట్ బుక్ మరియు ఒమెన్ గేమింగ్ లాప్టాప్ ను లాంచ్ చేసింది HP సంస్థ. HP ఈవెంట్ నుండి మేము డైరెక్ట్ గా తీసిన ఫోటోస్ ఇక్కడ చూడగలరు.
HP ఒమెన్ 2015 మొదట్లో అనౌన్స్ చేస్తే ఇప్పుడు ఇండియా లో లాంచ్ అయ్యింది. 15.6 అంగుళాల 1080P డిస్ప్లే కలిగిన ఈ గేమింగ్ లాప్టాప్ విండోస్ 8.1 64 బిట్ వెర్షన్ ఆర్కిటెక్చరు.
ఒమెన్ కి RGB బ్లేక్ లిట్ కీబోర్డ్ ఉంది. ఇది ఫుల్ కస్టమైజబల్. గేమింగ్ కు అనువుగా ఉండేందుకు దీనిలో మైక్రో కీస్ కూడా ఉన్నాయి.
నాలుగవ జెనరేషన్ ఇంటెల్ i7 ప్రాసెసర్, 4 జిబి Nvidia GTx960M GPU, 8జిబి ర్యామ్మరియు 256జిబి PCIe SSD దీని స్పెసిఫికేషన్స్.
మరింత ఆకర్షణ కోసం స్పీకర్ లోపల LED బల్బులను ఉపయోగించింది HP.
అన్ని I/O పోర్ట్స్ వెనుక ఉండగా, లాప్టాప్ రైట్ ఎడ్జ్ లో కార్డ్ రీడర్ ఉంది. లాప్టాప్ బ్యాక్ అంతా ప్రాసెసర్ లకు వెంటిలేటర్ లాగ పనిచేసే మేష్ ఉంది.
అల్యూమినియం క్లాడ్ ఉన్న లాప్టాప్ టాప్ లో మ్యాటీ రబ్బరైజెడ్ ఫినిషింగ్ ఉంది. ఇది లుక్స్ తో పాటు గ్రిప్పింగ్ కూడా బాగుంది.
HP ఒమెన్ గేమింగ్ లాప్టాప్ తో పాటు కొత్త పెవిలియన్ లాప్టాప్స్ ను కూడా లాంచ్ చేసింది. వీటి ధర 44,490 రూ. నుండి ప్రారంభం అవుతున్నాయి. పెవిలియన్ 15(AB028TX) మోడల్ 5వ జేనేరేషణ్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ను వాడుతుండగా, పెవిలియన్ 15(AB030TX) మోడల్ 5 వ జేనేరేషణ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ను వాడుతుంది.
రెండు లాప్టాప్స్ ఒకే లే అవుట్ డిజైన్ తో వస్తున్నాయి. ఇక్కడ కి బోర్డ్ డిజైన్ ను చూడండి.
పెవిలియన్ 15(AB030TX) మోడల్ కు GeForce 940M Nvidia GPU ను వాడారు.
రెండు లాప్టాప్స్ కు స్టాండర్డ్ I/O పోర్ట్స్, స్టాండర్డ్ LAN మరియు DVD రైటర్ ఉన్నాయి.
HP స్పెక్ట్రా x360 అల్ట్రా తిన్ లాప్టాప్ ఇది. 13.3 in పోర్టబల్ లాప్టాప్ లో విండోస్ 8.1 నడుస్తుంది.
స్పెక్ట్రా x360 అనేక రకాల కన్ఫిగరేషన్స్ తో లభిస్తుంది. మేము చూసినది, ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్.
HP స్పెక్ట్రా కూడా బ్యాక్ లిట్ కీ బోర్డ్ తో వస్తుంది.
మీరు చూసినట్లు అయితే ఇది చాలా సన్నగా డిజైన్ చేయబడింది. అలాగే స్క్రీన్ కూడా 360 డిగ్రి ఏంగిల్ లో తిప్పుకోవచ్చు.