Coolpad నోట్ 3 LITE: ఫర్స్ట్ ఇంప్రెషన్స్

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Jan 18 2016
Coolpad నోట్ 3 LITE: ఫర్స్ట్ ఇంప్రెషన్స్

సబ్ 7K బడ్జెట్ లో కూల్ ప్యాడ్ నోట్ 3 LITE పేరుతో కొత్త వేరియంట్ 6,999 రూ లకు లాంచ్ చేసిన సంగతి తెలిసినదే.  ఇప్పటి వరకు ఈ బడ్జెట్ లో 2GB ర్యామ్ మాత్రమే ఉంది. అంతే కాక అతి తక్కువ ధరకు ఫింగర్ ప్రింట్ కూడా జోడించి సబ్ 7K  సెగ్మెంట్ లో కూడా high end స్పెక్స్ ఇచ్చిన మోదటి కంపెని గా కూల్ ప్యాడ్ పేరు తెచ్చుకుంది. మిగిలిన స్పెక్స్ కూడా decent గా ఉండటం వలన స్పెక్స్ వైజ్ గా ఇది బెస్ట్ ఫోన్ on పేపర్ లో. ఇప్పుడు మా మొదటి అభిప్రాయాలను చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఫైనల్ రివ్యూ మరి కొద్ది రోజుల్లో..

Coolpad నోట్ 3 LITE: ఫర్స్ట్ ఇంప్రెషన్స్

ముందుగా దీనిలోని Key Specs:
డిస్ప్లే: 5 అంగుళాల, 720P
SoC: మీడియా టెక్ MT6735
RAM: 3GB
నిల్వ: 16GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 2500mAh

Coolpad నోట్ 3 LITE: ఫర్స్ట్ ఇంప్రెషన్స్

డిజైన్: సేమ్ నోట్ 3 మోడల్ వలె ఉంది. నోట్ 3 మొదటి మోడల్ ను మేము వాడాము. దాని ఫ్రంట్ బెజేల్స్ లో ఉన్న స్టిల్ కోటింగ్ రౌండ్ ఎడ్జ్ క్రింద పడితే పోతుంది. 5in డిస్ప్లే వలన కంపాక్ట్ గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటి కూడా సేమ్. sturdy అండ్ గ్రిప్.

Coolpad నోట్ 3 LITE: ఫర్స్ట్ ఇంప్రెషన్స్

డిస్ప్లే: బాగుంది మొదటి ఇంప్రెషన్స్ లో. డీసెంట్ కలర్ రిప్రోడక్షన్, గుడ్ వ్యూయింగ్ angles.sunlight visibility తక్కువగా ఉంది. HD కొంతమందికి నచ్చకపోవచ్చు..కాని ఈ బడ్జెట్ లో బెటర్ అని చెప్పవచ్చు. అలాగే డిస్ప్లే బాగుంటే చాలు, బాగుండటం అనేది అవసరం. అద్భుతంగా ఉండవసరం లేదు. ఎందుకంటే ఫుల్ HD లేదా అమోలేడ్ ఇతర హై డిస్ప్లే లు బ్యాటరీ ను బాగా హరించే విషయాలలో మొదటివి. HD ఉంది, ఓవర్ ఆల్ బాగుంటే ఈజీగా తీసుకోవచ్చు.. క్రింద నేవిగేషన్ బటన్స్ backlight వెలగటం లేదు.

Coolpad నోట్ 3 LITE: ఫర్స్ట్ ఇంప్రెషన్స్

పెర్ఫార్మెన్స్: మొదటి అభిప్రాయాలలో పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది అలా ఉంది అని నిర్దేశించటం కరెక్ట్ కాదు. కంప్లీట్ రివ్యూ లో తెలుసుకోగలరు. కాని మేము వాడుతున్న సమయంలో మాత్రం అంతా ఫాస్ట్ గానే ఉంది. దీనిలో క్వాడ్ కోర్ MT 6735 SoC ఉంది. ఇదే ప్రొసెసర్ meizu M2 అండ్ acer Z530 లో కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ మొదటి వేరియంట్ వలె ఫాస్ట్ గా ఉంటుంది. 5 ప్రింట్స్ సపోర్ట్ చేస్తుంది.
 

Coolpad నోట్ 3 LITE: ఫర్స్ట్ ఇంప్రెషన్స్

కెమేరా: 13MP షట్టర్ రెస్పాన్స్ బాగుంది. గేలరీ ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. 5MP లో కంపెని కొన్ని ట్యూనింగ్ చేసింది అని చెప్పింది. కంప్లీట్ రివ్యూ లో వీటిపై తెలుసుకోగలరు.

Coolpad నోట్ 3 LITE: ఫర్స్ట్ ఇంప్రెషన్స్

నోట్ 3 లో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. మైనస్ విషయాలు ఏమి లేవు ప్రత్యేకంగా. 2500mah బ్యాటరీ కంపెని ప్రకారం 10 గంటల పటు వస్తుంది. దీనిపై మేము టెస్ట్స్ చేస్తున్నాము. ఫోన్లో ఉన్న మరొక VoLTE. ఇది వాయిస్ ఓవర్ LTE. అంటే వాయిస్ usual circuit - switched way లో కాకుండా ఇంటర్నెట్ డేటా ద్వారా వెళ్తుంది. ఈ పద్ధతిలో వాయిస్ మూడు రెట్లు అధికంగా carry చేస్తుంది నార్మల్ వాయిస్ కన్నా. అయితే ఇది ఫోన్ లో ఉన్నా, ఈ ఫీచర్ కు సపోర్ట్ ఇండియాలో ఇంకా అందుబాటులో లేదు.