ఫేస్ బుక్ వాడని వారు ఉండరు. అలాగే రోజూ దానిని చూడని వారు 80% కన్నా తక్కువ ఉండరు. కాని దానిలో కొన్ని సెట్టింగ్స్ ఉన్నట్లు చాలా మందికి తెలియదు. అవేంటో, ఎలా ఉపయోగపడతాయో తెలిపే ప్రయత్నమే ఈ ఆర్టికల్. ఆ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకోవటానికి ఇమేజెస్ ను చూడగలరు. ఇవి తెలిసిన వాళ్ళుకు ఒక గమనిక: మనకు తెలుసు అని అందరికీ తెలుసు అని అనుకోవటం సమంజసం కాదు. ఇంతకీ అవేంటో చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి మొబైల్ users.
MESSAGE REQUESTS:
మీ ఫ్రెండ్స్ కాని ఫేస్ బుక్ అకౌంట్ holder కు మీరు మెసేజ్ చేస్తే, అవతల వ్యక్తి కి మీరు మెసేజ్ చేసినట్లు తెలియదు. అంటే అతనికి ఎటువంటి నోటిఫికేషన్ రాదు, లేదా రెగ్యులర్ user ఇంటర్ఫేస్ లో ఎక్కడా కనపడదు. ప్రత్యేకించి మెసేజెస్ పై క్లిక్ చేసి recent ప్రక్కన ఉన్న Message Requests ను గమనిస్తేనే తెలుసుకోగలరు. చాలా మంది దీనిని గమనించారు, అందుకే తెలియదు.మెసేజ్ అందుకునే వారికి disturbance ఉండకూడదని ఫేస్ బుక్ ఈ ఫీచర్ ను ప్రవేశ పెట్టింది.
VIEW AS
మన FB ప్రొఫైల్ పబ్లిక్ (మన ఫ్రెండ్స్ కానీ వారికి) లేదా పర్టికులర్ ఫ్రెండ్ కు ఎలా కనిపిస్తుంది అని తెలుసుకోవాలని ఉందా? అయితే మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి View activity log ప్రక్కన ఉన్న 3 dots పై ప్రెస్ చేస్తే View as అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేసి పబ్లిక్ కు మీ ప్రొఫైల్ లో ఏ విషయాలు కనిపిస్తున్నాయి అని చెక్ చేసుకోగలరు మీ అంతట మీరే. ప్రత్యేకించి ఒక ఫ్రెండ్ కు ఎలా కనిపిస్తుంది అని చెక్ చేయటానికి పైన వాళ్ళ పేరు ఎంటర్ చేయాలి.
SEE/FOLLOW FIRST
ఒక ఫ్రెండ్ లేదా ఫేస్ బుక్ పేజ్ యొక్క అప్ డేట్స్ మాత్రం ముందుగా చూడాలి అనుకుంటే, వాళ్ళ ప్రొఫైల్ లేదా పేజ్ ను ఓపెన్ చేసి, mesasge కు left సైడ్ లో ఉన్న FOLLOW(ING) అనే ఆప్షన్ పైకి వెళ్తే SEE FIRST అని ఉంటుంది. దానిని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫ్రెండ్ యొక్క అప్ డేట్స్ ప్రధమంగా కన్పిస్తాయి మీ న్యూస్ ఫీడ్. అదే పేజ్ అయితే ఆ LIKE చేసిన పేజ్ ను ఓపెన్ చేసి LIKED బటన్ మీదకు వెళ్తే SEE FIRST అనే ఆప్షన్ ఉంటుంది.దానిని సెలెక్ట్ చేసుకుంటే ఇక ఆ పేజ్ నుండి పోస్ట్స్ మిస్ అవ్వరు.
TRUSTED CONTACTS
మీరు ఎప్పుడైనా పాస్ వర్డ్ మరిచిపోయి మీ ఫేస్ బుక్ ను ఓపెన్ చేయలేని పరిస్థితులలో ఉండి,forgot password మెథడ్ ద్వారా మెయిల్ ను కూడా వాడలేని పరిస్థితిలో ఉంటే, మీరు ఆల్రెడీ సెట్ చేసుకున్న trusted ఫ్రెండ్స్ కు ఒక URL ద్వారా కోడ్స్ పంపి, ఆ కోడ్స్ ద్వారా మీరు ఫేస్ బుక్ లోకి లాగిన్ అయ్యేలా ఉపయోగాపడటానికి ఫేస్ బుక్ Settings>security లో Your Trusted contacts అనే ఆప్షన్ ను అందిస్తుంది. దానిపై క్లిక్ చేసి Choose trusted contacts ను క్లిక్ చేస్తే మీకు Trusted contacts ఏమి చేయగలరో చెబుతుంది. ఇక అక్కడున్న Choose trusted contacts బటన్ పై క్లిక్ చేసి మీ trusted contact ను సెలెక్ట్ చేసుకోగలరు.
SEND ANY FILES
అవును మీరు ఫేస్ బుక్ ద్వారా మీ మిత్రులకు ఎటువంటి ఫైల్స్ అయినా పంపగలరు. అది ఏదైనా జస్ట్ మీరు చాట్ విండో ఓపెన్ చేసి క్రింద కెమెరా ఐకాన్ ప్రకన్న ఉన్న attachment pin సింబల్ పై టాప్ చేస్తే format తో సంబంధం లేకుండా వీడియో, ఆడియో, text ఫైల్, apk, exe, zip ఇలా ఏదైనా మీరు అవతల వ్యక్తికి పంపగలరు. చాలామంది వాట్స్ అప్ లో ఫైల్స్ పంపలేరు అని అనుకుంటారు, సో అలాంటివారు దీనిని వాడుకోగలరు.