ఫేస్ బుక్ లో మీకు తెలియని సింపుల్ ఇంట్రస్టింగ్ ఫీచర్స్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Jul 06 2015
ఫేస్ బుక్ లో మీకు తెలియని సింపుల్ ఇంట్రస్టింగ్ ఫీచర్స్

ఫేస్ బుక్ లో కొన్ని ఇంబిల్ట్ ప్రైవసీ ఫీచర్స్ ఉన్నాయి. కాని వాటిని చాలా తక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఇవి అందరికీ తెలియవలసిన ఇంపార్టేంట్ సెక్యూర్ ఫీచర్స్. అవేంటో చూసేందుకు నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.

ఫేస్ బుక్ లో మీకు తెలియని సింపుల్ ఇంట్రస్టింగ్ ఫీచర్స్

ఫేస్ బుక్ లో మీ ఫోన్ నంబర్ లేదా ప్రోఫైల్ ID తో లాగిన్ అవ్వ వచ్చు. ఈ మెయిల్ id నే అవసరం లేదు. మీ ఫేస్ బుక్ id ఏంటో తెలుసుకోవటానికి ప్రోఫైల్ ఓపెన్ చేసి బ్రౌజర్ లోని url ను గమనిస్తే 
https://www.facebook.com/ తరువాత వచ్చేదే మీ id.  అయితే మీరు ఫోన్ నంబర్ తో లాగిన్ అవ్వటానికి ముందుగా మీ నంబర్ ను మీ ఫేస్ బుక్ తో జత చేయాలి.         


 

ఫేస్ బుక్ లో మీకు తెలియని సింపుల్ ఇంట్రస్టింగ్ ఫీచర్స్

మీ స్నేహితులు మీ ఫ్రెండ్స్ లిస్ట్ లోని ఫ్రెండ్స్ కు Add Request లు పంపుతున్నారా? అయితే మీ ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ ఎవ్వరికీ కనపడకుండా మీ ప్రోఫైల్ లోని Friends మీద క్లిక్ చేసి, Find Friends పక్కన ఉన్న పెన్ సింబల్ పై క్లిక్ చేసి Edit Privacy లోకి వెళ్లండి. Who can see your friends list ను Only Me ను సెలెక్ట్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్  మీకు తప్ప ఎవ్వరికీ కనపడదు. 

ఫేస్ బుక్ లో మీకు తెలియని సింపుల్ ఇంట్రస్టింగ్ ఫీచర్స్

మీరు ఏ ఫ్రెండ్ ను యాడ్ చేసుకున్నారో, ఏ గ్రూప్ జాయిన్ అయ్యారో, ఏ పేజ్ లైక్ చేసారో మీ ఫ్రెండ్స్ అందరికీ అప్పటికప్పుడే తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండాలా?
మీ ప్రోఫైల్ లో Cover Pic పై క్రింద View  Activity Log పై క్లిక్ చేసి, కావలసిన యాక్టివిటి వద్ద పెన్ సింబల్ పై క్లిక్ చేసి Hidden from Timeline ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. (పైన చెప్పిన యాక్టివిటి మీరు చేసిన వెంటనే ఇక్కడకు  వస్తే సర్చ్ చేయనవసరం లేకుండా మీ లేటెస్ట్ యాక్టివిటి పైనే ఉంటుంది.) ఇది కేవలం పైన చెప్పిన 3 యాక్టివిటీ లకు మాత్రమే పనిచేస్తుంది.

ఫేస్ బుక్ లో మీకు తెలియని సింపుల్ ఇంట్రస్టింగ్ ఫీచర్స్

మీరు పోస్ట్ చేసే స్టేటస్ అప్ డేట్స్ అందరికీ కాకుండా కేవలం కొంత మందికి మాత్రమే కనపడాలా?
స్టేటస్ అప్ డేట్ టైప్ చేసి POST బటన్ లెఫ్ట్ సైడ్ ఉండే గ్లోబ్ సింబల్ బటన్ పై క్లిక్ చేసి More Options పై క్లిక్ చేస్తే Custom ఆప్షన్ వస్తుంది. దాని పై క్లిక్ చేసాక, Share With లో ఎవరికీ మీ స్టేటస్ అప్ డేట్ కనపడాలి అనుకుంటున్నారో వాళ్ల పేరులను టైప్ చేయండి, లేదా కేవలం కొంతమందికి తప్ప మీ ఫ్రెండ్స్ అందరికీ కనపడాలని అనుకుంటున్నట్టు అయితే వాళ్ళ పేర్లను Don’t share with క్రింద బాక్స్ లో టైప్ చేయండి.
బెస్ట్ టిప్: మీ ఫ్రెండ్స్ ను స్కూల్, కాలేజ్, ఫ్యామిలీ మరియు Acquaintances వైజ్ గా ముందే లిస్టు చేసుకొని పెట్టుకుంటే, స్టేటస్ పోస్ట్ చేసేటప్పుడు ఎవరెవరికి కనపడాలనే సెట్టింగ్ ప్రాసెస్ ఈజీ గా ఉంటుంది.

ఫేస్ బుక్ లో మీకు తెలియని సింపుల్ ఇంట్రస్టింగ్ ఫీచర్స్

మీ ఇ మెయిల్ id లేదా నంబర్ తెలిస్తే చాలు, వాటి ద్వారా మిమ్మల్ని ప్రపంచంలో ఎక్కడ నుండి అయినా ఎవరైనా వెతికి మీ పర్సనల్ విషయాలు గురించి తెలుసుకోగలరు అని మీకు తెలుసా?
అవును జస్ట్ మీ నంబర్ లేదా ఈ మెయిల్ id తెలిస్తే చాలు. ఇలా జరగకుండా చేసుకోవచ్చు. Settings లోకి వెళ్లి లెఫ్ట్ సైడ్ Privacy ను సెలెక్ట్ చేసుకొని “Who can look me up“ క్రింద ఆప్షన్లు లో edit ఆప్షన్ ద్వారా Friends ను సెలెక్ట్ చేసుకుంటే కేవలం మీ ఫేస్ బుక్ లోని ఫ్రెండ్స్ మాత్రమే మిమ్మల్ని మీ నంబర్ లేదా మెయిల్ id ద్వారా చూడగలరు. అది కూడా వాళ్లకి కూడా మీ నంబర్ లేదా id తెలిస్తేనే. అసలు ఇది అంతా ఎందుకు అని అనుకుంటే మీ ఫేస్ బుక్ నుండి ఫోన్ నంబర్ ను తీసి వేయండి Settings - Mobile ఆప్షన్ కు వెళ్లి.