సోషల్ మీడియా ప్లాట్ఫారంలు అయినటువంటి,Facebook, Instagram మొదలైన వాటిలో మనం ప్రతిరోజూ ఏదో ఒకటి షేర్ చేయకపోతే, మనకు రోజు గడవదు. మన జీవితానికి సంబంధించి జరిగిన విషయాలను ప్రతిరోజూ ఇందులో చూపించకపోతే, మన జీవితం అసంపూర్తిగా అనిపించడం కూడా కొన్నిసార్లు జరుగుతుంది. ఎందుకంటే, మనం ఇలా జీవించడం అలవాటు చేసుకున్నాం. దీనికి కారణం కొన్నిసార్లు ప్రజల దృష్టిని ఆకర్షించడం, కొన్నిసార్లు తమను తాము ఫేమస్ గా చేసుకోవడం మరియు కొన్నిసార్లు ప్రజలతో కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చెయ్యడానికి. ఫేస్ బుక్ లో మీకు నిరంతరంగా వచ్చే లైక్స్, కామెంట్స్ మరియు రియాక్షన్స్ వంటివి నిస్సందేహంగా మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి, అయితే కొన్నిసార్లు అవి మీ వ్యక్తిగత జీవితానికి హాని కలిగించే చెడు ప్రభావాన్ని కూడా కలిగిస్తాయి. facebook లో మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని జాగ్రత్తలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాము ...
ఫేస్ బుక్ లో ఏదైనా పోస్ట్ చేసే ముందు, మీరు సోషల్ ప్లాట్ ఫామ్ లో ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని పంపుతున్నారో, ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీ స్నేహితుల జాబితాలో ఎంత మంది ఉన్నారు మరియు మీ సమాచారాన్ని వారిలో ఎవరు ఎలా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చో, మీకు తెలియదు. . ఏదైనా పోస్ట్ చేసే ముందు ఎప్పుడూ ఒకసారి ఆలోచించండి.
మందుతాగిన వ్యక్తి డ్రైవ్ చేయకూడదని మనందరికీ తెలుసు, కాని అదే విధంగా డ్రింక్ చేసి ఉంటే facebook కూడా మానుకోవాలి. తాగినప్పుడు, మీరు ప్రతి వ్యక్తితో మీ ప్రైవేట్ విషయాలను కూడా తెలియని మైకంలో షేర్ చెయ్యవచ్చు.
మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో మీకు 800 మంది స్నేహితులు ఉంటే, వారంతా మీకు పరిచయం ఉన్న స్నేహితులు అని కాదు అర్ధం. కాబట్టి ఎటువంటి కారణం లేకుండా, తెలియని వ్యక్తిని facebook ఖాతాలో చేర్చే ముందు జాగ్రత్త వహించండి. మీకు తెలిసిన ప్రతి వ్యక్తితో మీరు షేర్ చేయకూడని, మీ వ్యక్తిగత సమాచారాన్ని మీరు పోస్ట్ చేసే వేదిక ఇది.
మీ ప్రొఫైల్ లోని ప్రతి సమాచారాన్ని బహిరంగపరచడం తప్పనిసరి కాదు. ఇటువంటి సమాచారం మీ పాఠశాల లేదా కళాశాల పేరుతో పాటు మీ సొంత పట్టణం కూడా కలిగి ఉంటుంది. బదులుగా, మీరు దానికి సంబంధించిన వ్యక్తులకు కూడా ఒక పోస్ట్ చూపించాలి. మీ సమాచారం అంతా ఫ్రెండ్ జాబితాలోని ప్రతి వ్యక్తితో షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
మనమందరం కూడా అనుకోకుండా తరచూ ఈ పొరపాటు చేస్తాము. మన ఇల్లు, పాఠశాల, కళాశాల మరియు కార్యాలయ చిరునామా లేదా టైమింగ్ కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ఫేస్‌బుక్ లో షేర్ చెయ్యడం ద్వారా నేరస్థుల పని సులభతరం చేస్తాము. కాబట్టి ఎల్లప్పుడూ ఈ రకమైన సమాచారాన్ని షేర్ చేయకుండ ఉండడమే మంచిది.
మీరు మీ పిల్లలను ఫేస్‌బుక్ అకౌంట్ నుండి దూరంగా ఉంచగలిగితే చాలా మంచిది. కానీ మీరు కుటుంబ ఫోటోను పోస్ట్ చేస్తుంటే, మరింత సమాచారం ఫోటోల నుండి బయటకు రాకుండా చూసుకోవడం మాత్రం గుర్తుంచుకోండి. అంటే, మీ పిల్లలు తినడానికి ఇష్టపడేవి, వారి స్కూల్ సమయం లేదా స్కూల్ పేరు మొదలైనవి.
మీరు క్రొత్త కారును కొనుగోలు చేసినట్లయితే లేదా ఎక్కువ ఖర్చు చేసినట్లయితే, ఈ విషయాలను ప్రైవేట్‌గా ఉంచండి, ఎట్టిపరిస్తుతుల్లో బహిరంగంగా చూపించవద్దు. ఈ రకమైన అంశాలను పోస్ట్ చేయడం మీకు తెలియని ఇబ్బందుల్లో చిక్కుకుపోయేలా చెయ్యవచ్చు.
అసభ్యకరమైన భాషను ఉపయోగించి ఫేస్‌బుక్ లో ఎప్పుడూ మాట్లాడకండి ఎందుకంటే ప్రజలు తరచూ అలాంటి స్క్రీన్‌షాట్ లను తీసుకొని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు.
ఒక్కొక్కసారి మీరు అత్యుత్సాహంగా ఉంటారు మరియు పాస్ పోర్ట్, సర్టిఫికేట్ లేదా డిగ్రీ మొదలైన వాటి ఫోటోలను షేర్ చేస్తుంటారు. అయితే, ఇది పెద్ద తప్పు మరియు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇది వ్యక్తిగత సమాచారం మరియు దీన్ని మీరు సోషల్ మీడియా నుండి దూరంగా ఉంచాలి. ఇది కాకుండా, ఏదైనా సెలవు ప్రారంభమయ్యే ముందు మీ విమాన టిక్కెట్లను ఫేస్‌బుక్ లో ఉంచడం కూడా సరైనది కాదు.
ప్రతిసారీ మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ ను తనిఖీ చేస్తూ ఉండండి మరియు మీకు తెలియని లేదా మీ గురించి ఎక్కువగా ఆరాతీస్తున్న అవ్యక్తులు మీ స్నేహితుల జాబితాలో ఉంటే వారు మీకు అవసరం లేదు, కాబట్టి వారితో కొంచం జాగ్రత్తగా ఉండండి.