మొబైల్ ఫోన్‌లతో మనం మన అవసరానికి తగినట్లుగా చాలా మొబైల్ యాప్‌లను ఉపయోగిస్తాము. ఇక్కడ వరకూ అంతా బాగానే వుంది. కానీ, వీటిలో కొన్ని యాప్స్ మీ ఫోన్ నుండి ముఖ్యమైన డేటాను దొంగిలిస్తున్నాయని తెలిస్తే మీరు ఏమి చేస్తారు. ఇదేదో ఒట్టి మాటని కొట్టిపారేయకండి. ఇటీవల, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుండి డేటాను దొంగిలించే 203 హానికరమైన యాప్స్ ను థాయిలాండ్ యొక్క డిజిటల్ ఎకానమీ మరియు సొసైటీ మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించాయి. వీటిలో కొన్ని యాప్స్ వివరాలను అందిస్తున్నాను.
గమనిక: ఇక్కడ చూపిన ఇమేజిలు భిన్నంగా ఉండవచ్చు, గమనించగలరు.!
4K వాల్ పేపర్స్ - లైవ్ వాల్‌పేపర్స్ అనే ఈ యాప్ అనేక రకాల 4K (UHD/Ultra HD) అలాగే Full HD (హై డెఫినిషన్) వాల్‌పేపర్‌లను అందించే ఉచిత యాప్.
అడ్వాన్స్ SMS చాలా సులభం మరియు వేగవంతమైనది. ఇది మంచి టెక్స్టింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. అయితే, ఈ యాప్ థర్డ్ పార్టీ యాప్‌లతో మీ డేటాను షేర్ చేయవచ్చు.
Art Filters అనేది శక్తివంతమైన ఎడిటర్, ఇది చాలా కూల్ ఎఫెక్ట్స్ మరియు ఫిల్టర్లతో వస్తుంది. ఆర్ట్ ఫిల్టర్లు - ఆర్ట్ ఫోటో ఎడిటర్‌లో మీరు ప్రతి ఫోటోను అద్భుతంగా చేయడానికి కావలసినవన్నీ అన్ని హంగులు ఉన్నాయి. అయితే, ఇది మీ డేటాను దొంగిలించడం ద్వారా మీకు నష్టం కలిగిస్తుందని గుర్తుంచుకోండి.
ఈ యాప్ మీ స్వంత స్టిక్కర్ లను క్రియేట్ చెయ్యడానికి మీకు ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా మీరు మీ మీమ్స్, ఫోటోలు నుండి స్టిక్కర్లను సృష్టించవచ్చు.
కడుపుతో వున్నపుడు మరియు పసిబిడ్డ ఫోటోలను అలంకరించడానికి బేబీ స్టిక్కర్ గొప్ప మార్గం. కానీ, ఇది డేటాని ప్రమాదంలో నెట్టవచ్చు.
ఈ Bass Booster యాప్ మీ ఫోన్ BASS ను గరిష్ట స్థాయికి పెంచుతుంది మరియు హెవీ బాస్ తో మెరుగైన సౌండ్ క్వాలిటీని పొందుతారు. అయితే, ఇది మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ద్వారా మీకు హాని కలిగించవచ్చు.
గమనిక: ఈ చిత్రం కల్పితం!
మీ ఫోన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు ఈ యాప్ మీకు తెలియజేస్తుంది. తద్వారా, మీరు మీ ఫోన్/టాబ్లెట్ ని అన్‌ప్లగ్ చేయవచ్చు. అయితే, ఇది మీ డేటాను సేకరించే అవకాశం వుంది.
బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ బబుల్ తో బబుల్ ఎఫెక్ట్ ను సులభంగా పొందవచ్చు. ఈ యాప్ ఉపయోగించడానికి సులభమైనది మరియు ఈ యాప్ తో మీరు మీ ఛార్జింగ్ స్క్రీన్‌ని కస్టమైజ్ చెయ్యవచ్చు.
అధునాతన టెంప్లేట్లు, ప్రసిద్ధ మ్యూజిక్, అద్భుతమైన ట్రాన్సిషన్స్ మరియు వీడియో ఎఫక్ట్ లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇది థర్డ్ పార్టీ యాప్స్ తో మీ డేటాను షేర్ చేయవచ్చు.
బీట్ మేకర్ ప్రో అనేది ప్లే స్టోర్‌లో 10 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో కూడిన గేమింగ్ యాప్. అయితే, ఇది హానికరమైన యాప్‌ల జాబితాలో కూడా చేర్చబడింది.
CallMe Phone Themes టోటల్ 1 మిలియన్ కంటే ఎక్కువ సార్లు డౌన్ లోడ్ లను సాధించింది. ఈ యాప్ వుపయోగించి ఫోన్ కాలర్ కోసం బ్రెట్ థీమ్‌ను సెట్ చేయవచ్చు. అయితే, ఇది మీ డేటా రక్షణకు హానికలిగించవచ్చు.
Camera Translator యాప్ ఇతర భాషలో ఉన్న ఏదైనా వస్తువు యొక్క అర్థాన్ని గుర్తించి తర్జుమా చేయడానికి అత్యంత అధునాతన OCR సాంకేతికతను ఉపయోగిస్తుంది. కానీ, ఈ యాప్ తో మీ పర్సనల్ డేటా చిక్కుల్లో పడుతుంది.
Dazz Cam- D3D Photo Effect యాప్ మీ ఫోటోలకు 3D ఎఫెక్ట్ ఇవ్వడానికి బాగా ఉపయోగించబడుతుంది. అయితే, డేటా చౌర్యానికి పాల్పడే ప్రమాదకరమైన యాప్స్ జాబితాలో ఇది కూడా చేర్చబడింది.
1 మిలియన్ కంటే ఎక్కువ డౌన్ లోడ్ లను సాధించిన ఈ Guitar Play - Games & Songs యాప్ ఫీచర్స్ పరంగా వినియోగదారులను ఆకర్షిస్తుంది. అయితే, ఈ యాప్ ను మీ ప్రైవసీ మరియు సెక్యురిటీ లకు భంగం కలిగిస్తుంది.
హైలైట్ స్టోరీ కవర్ మేకర్ అనే ఈ యాప్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల హైలైట్ కవర్ ని క్రియేట్ చెయ్యడానికి అనుకూలమైన న యాప్, అయితే ఇది మీ డేటా సెక్యూరిటీకి హానికరం.
Jigsaw Puzzle అనే ఒక గేమింగ్ యాప్ మరియు గేమింగ్ ఇష్టపడేవారు ఎక్కువగా ఎక్కువగా ఇన్‌స్టాల్ చేసే గేమింగ్ యాప్. అయితే, ఇది మీ డేటాకు చేటు కలిగించవచ్చు.
Nebula: Horoscope & Astrology అనే ఈ యాప్ మీ జోడియాక్ ప్రిడిక్షన్ ను ఊహించి చెబుతుంది. కానీ, ఇది మీ పర్సనల్ డేటాని చిక్కులో పడవేస్తుంది.
ScanGuru అనే యాప్ డాక్యుమెంట్స్ ని PDF లేదా JPEG ఫార్మాట్ లో తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ, ఈ యాప్ ఉపయోగంకంటే మీ డేటాని తస్కరిస్తుందనే విషయమే ఎక్కువగా భయపెడుతుంది.
Equalizer + HD Music Player అనే ఈ యాప్ ఒక ఆల్ ఇన్ వన్ మ్యూజిక్ ప్లేయర్ యాప్. ఈక్వలైజర్ బూస్టర్ ద్వారా మీ సంగీతానికి మరింత ఆనందాన్ని జోడించవచ్చు. అయితే, ఈ యాప్ మీ డేటాని ఇతరులకు చేరవేస్తుంది.
ఇది ఒక మ్యూజిక్ మేకింగ్ యాప్. ఈ డెవలపర్ మ్యూజిక్ మేకింగ్ యాప్‌తో Pro DJ వంటి బీట్స్ మరియు మ్యూజిక్ ని క్రియేట్ చేయవచ్చు. కానీ, ఈ యాప్ కూడా డేంజరస్ యాప్స్ లిస్ట్ లో వుంది.